Munjya OTT: ఓటీటీలో తెలుగులోనూ.. స్ట్రీమింగ్‌కు వచ్చేసిన బాలీవుడ్ బ్లాక్‌బస్టర్
ABN, Publish Date - Sep 22 , 2024 | 12:46 PM
జూన్7న చిన్న చిత్రంగా థియేటర్లలోకి వచ్చి సంచలన విజయం సాధించిన హర్రర్, కామెడీ చిత్రం ముంజ్య . ఈ మూవీ నెల రోజులుగా ఓటీటీలో హిందీలో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో కూడా అందుబాటులోకి తీసుకు వచ్చారు.
జూన్7న చిన్న చిత్రంగా థియేటర్లలోకి వచ్చి సంచలన విజయం సాధించిన హర్రర్, కామెడీ చిత్రం ముంజ్య (Munjya). హిందీ భాషలోనే వచ్చిన ఈ సినిమా థియేటర్లలో రూ. 135 కోట్లకు పైగా కలెక్షన్లతో ఈ ఏడాది బాలీవుడ్ మొదటి హయ్యస్ట్ గ్రాసర్‌గా బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. అభయ్ వర్మ (Abhay Verma), శర్వారి (Sharvari), సత్యరాజ్ (Sathyaraj), మోనా సింగ్ (Mona Singh) ప్రధాన పాత్రల్లో నటించగా ఆదిత్య సర్పోత్దార్ (Aditya Sarpotdar) దర్శకత్వం వహించాడు. అయితే ఈ మూవీ నెల రోజులుగా ఓటీటీలో హిందీలో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో కూడా అందుబాటులోకి తీసుకు వచ్చారు.
కథ విషయానికి వస్తే.. పుణేలో తల్లితో కలిసి ఉండే బిట్టు పిరికివాడిగా, భయస్తుడిగా పెరుగుతాడు. ఓ రోజు తమ బంధువుల పెండ్లి వేడుక కోసం తన స్వగ్రామం కొంకన్‌కు వెళతాడు. అక్కడ ఓ సందర్భంలో బిట్టు తన తండ్రి మరణం గురించి, ఆయనకు చెందిన భూమిలో ఉన్న ఓ చెట్టు గురించి తెలుసుకుని అక్కడికి వెళ్లగా ముంజ్యా అనే బ్రహ్మ రాక్షసుడు అవహించిన ఓ భారీ వృక్షం బిట్టును బంధిస్తుంది. అప్పుడే బిట్టు నానన్మ వచ్చి కాపాడుతుంది. కానీ ముంజ్యా తిరిగి బిట్టుతో పాటే వచ్చి ఆ నానమ్మను చంపేసి ఆపై బిట్టుతో పాటే పయనిస్తూ వేదిస్తూ ఉంటుంది..
ఓ రోజు మున్ని అనే యువతిని కనిపెట్టి చెప్పాలని లేకుంటే మీ ఆమ్మను కూడా చంపేస్తానని ముంజ్యా వార్నింగ్ ఇస్తుంది. దీంతో బిట్టు మున్నిని వెతికే పనిలో పెడతాడు. ఈక్రమంలో అనేక రహస్యాలు బయట పడతాయి. చివరకు బిట్టును ముంజ్యా చెర నుంచి బయట పడగలిగాడా లేదా ముంజ్యా ఎవరు, అతని స్టోరీ ఏంటి, ముంజ్యాకు బిట్టుకు ఉన్న రిలేషన్ ఏంటి, మున్ని ఎవరు అసలు తన ఊరిలో 50 ఏండ్ల క్రితం ఏం జరిగింది అనే ఇంట్రెస్టింగ్ కథకథనాలతో సినిమా ప్రతి ఒక్కరినీ అలరిస్తుంది. ఈ చిత్రం డిస్నీ ఫ్లస్ హాట్‌స్టార్ (Disney+ Hotstar) ఓటీటీలో తెలుగులోనూస్ట్రీమింగ్‌కు అవుతుంది కాబట్టి హర్రర్, కామెడీ చిత్రాలు ఇష్ట పడే వారు ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయవచ్చు.