Thalavan OTT: పోలీసులు కేసులో ఇరుక్కుంటే.. ఓటీటీలో అదిరిపోయే క్రైమ్ థ్రిల్లర్
ABN, Publish Date - Sep 10 , 2024 | 06:51 PM
ఇటీవల మలయాళంలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయం సాధించిన థ్రిల్లర్ చిత్రం తలవన్ ప్రకటించిన సమయానికన్నా ముందుగానే డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. మే 24న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా రూ.25 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి సంచలనం సృష్టించింది.
ఇటీవల మలయాళంలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయం సాధించిన థ్రిల్లర్ చిత్రం తలవన్ (Thalavan) ప్రకటించిన సమయానికన్నా ముందుగానే డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. మే 24న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా రూ.25 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి సంచలనం సృష్టించింది. బీజు మీనన్ (Biju Menon), అసిఫ్ అలీ (Asif Ali) వంటి అగ్ర నటులతో పాటు మియా జార్జ్ (Miya George), దిలీష్ పోతన్, శంకర్ రామక్రుష్ణన్ ఇతర పాత్రల్లో నటించారు. ఇదిలాఉండగా మలయాళంలో రిలీజయ్యే అల్లు అర్జున్ ప్రతి సినిమాలో హీరోకు డబ్బింగ్ చెప్పే జిస్ జాయ్ (Jis Joy) ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. అదేవిధంగా ఇప్పటివరకు ఆరు సినిమాలు డైరెక్ట్ చేసిన జిస్ జాయ్ (Jis Joy) తన ప్రతి సినిమాలో అసిఫ్ అలీ (Asif Ali) ప్రధాన పాత్ర పోషించడం విశేషం.
ఇక కథ విషయానికి వస్తే.. కేరళలోని ఓ టౌన్‌లోని పోలీస్ స్టేషన్‌లో జయ శంకర్ (బీజు మీనన్) సీఐగా ఉంటాడు. ముక్కు సూటిగా వ్యవహరించే జయశంకర్ తప్పు చేస్తే ఎలాంటి వారినైనా కనుకరించడు, ఏమున్నా డైరెక్ట్‌గా చెబుతాడు. కొన్ని కేసుల్లో మొండిగా ఉంటాడు. అయితే అదే స్టేషన్‌కు కొత్తగా కార్తీక్ ఎస్సైగా ట్రాన్స్‌ఫర్‌పై వస్తాడు. అచ్చం జయశంకర్ మనస్తత్వం ఉన్న కార్తీక్ ఒకటి రెండు సందర్భాల్లో సీఐ జయశంకర్‌తో వాగ్వాదం పెట్టుకుంటాడు. అయితే జైలుకు వెళ్లిన ఓ నిందితుడి భార్య డెడ్ బాడీ ఓ రోజు సీఐ ఇంటిపై దొరుకుతుంది. దీంతో సీఐను ఆరెస్టు చేసి కేసు ఇన్వెస్టిగేషన్‌ను ఎస్సై కార్తీక్‌కు అప్ప చెబుతారు.
ఈ క్రమంలో ఇంతకు ఆ హత్య చేసిందెవరు, హంతకుడు నిజాయితీ ఉన్న పోలీసును ఎందుకు టార్గెట్ చేశాడు, ఒకరంటే ఒకరికి పడని సీఐ, ఎస్సైలు ఈ కేసును ఎలా చేధించారనే నేపథ్యంలో సినిమా ఆద్యంతం సస్పెన్స్‌తో సాగుతుంది. ఇప్పుడీ సినిమా సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా మలయాళంతో పాటు తెలుగులోనూ అందుబాటులో ఉంది. చివరి వరకు మంచి గ్రిప్పింగ్ స్టోరీతో, హంతకుడు వేసిన స్కెచ్‌లో పోలీసులు ఇరుక్కోవడం, అసలు నిందితుడెవరో అనే సస్పెన్స్‌ను సినిమా ముగింపు వరకు కంటిన్యూ చేయడం బాగా ఆకట్టుకుంటుంది. మంచి కాప్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారు ఈ తలవన్ (Thalavan) సినిమాను అసలు మిస్ చేయకండి.