Bigg Boss: విష్ణుప్రియ బ్రేకప్ స్టోరీ.. అర్ధరాత్రి పృథ్వీ‌తో

ABN, Publish Date - Nov 28 , 2024 | 06:53 AM

ఒకవైపు బిగ్‌బాస్ సీజన్ ముగింపు దశకు చేరుకుంటున్న నేపథ్యంలో హౌస్ లో ఇంట్రెస్టింగ్ విషయాలు బయటికొస్తున్నాయి. అందరూ నిద్రపోయిన తర్వాత అర్ధరాత్రి విష్ణుప్రియ.. పృథ్వీ బెడ్డు దగ్గరికి వెళ్లి బాధపడింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

బుధవారం టెలికాస్ట్ అయినా లేటెస్ట్ ఎపిసోడ్ లో అర్థరాత్రి విష్ణుప్రియ.. పృథ్వీ బెడ్డుపైకి వెళ్లి కహానీలు చెప్పింది. తన ఎక్స్ బాయ్‌ఫ్రెండ్, బ్రేకప్ గురించి పృథ్వీకి చెప్తూ బాధపడింది. దీనికి పృథ్వీ ఎలా రియాక్ట్ అయ్యారంటే..


మొదట విష్ణుప్రియ బెడ్ దగ్గరికి వెళ్లి కహాని చెప్పడం స్టార్ చేసింది. "నాకు లాస్ట్ కలలో నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వచ్చాడు" అంటూ స్టార్ చేయగానే ఏంటి ఆ కల, చెప్పలేనంత కలా.. అని పృథ్వీ వెంటనే రియాక్టయ్యారు. దీనికి విష్ణు 'అంటే ఇదంతా చూసి ఎంత బాధపడి ఉంటాడా అని వచ్చింది. ఎందుకు నువ్వేం చేశావ్ అలాంటిది.. అంటూ పృథ్వీ అడగగా.. అంటే ఆ బ్రేకప్ నుంచి నేను మూవ్ అయిపోయా కదా.. 1 పర్సెంట్ కూడా ఆలోచించకుండా పృథ్వీ పృథ్వీ అంటూ తిరగుతున్నా కదా! అంటూ చెప్పుకొచ్చింది. దీనికి పృథ్వీ ఓకే నువ్వు అలా మూవ్ ఆన్ అవుతున్నావనా.. బ్రేకప్ నువ్వే చేసుకున్నావా? అంటూ క్వశన్ చేశారు. దీంతో విష్ణు అందరితో నేనే చేసుకున్నా అని అన్సార్ ఇవ్వగా.. పృథ్వీ షాక్ అయ్యారు.


పృథ్వీ కంటిన్యూ చేస్తూ.. తనకి నువ్వు ఇంకా కావాలా.. అతను నిన్ను ఇంకా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడా అని అడిగారు. దీనికి విష్ణు.. 'పాపం తెలీకుండా రెండు తప్పులు చేశాడు.. నా మంచి కోసం చేశాడు నాకు తెలిస్తే భరించలేనని .. కానీ నాకు తెలిసింది నిజంగా భరించలేకపోయాను. నా దగ్గర కొన్ని విషయాలు దాచాడు. ఎందుకంటే అవి నాకు నచ్చవని.. అది ఒకసారి చేశాడు. మళ్లీ రెండోసారి చేశాడు.. నా ముఖం మీద చెప్పే గట్స్ అతనికి లేవు. అలా గట్స్ లేని వ్యక్తితో ఉండాలని నాకు అనిపించలేదు.. జనవరి నుంచి ఇంక వైబ్స్ వచ్చేస్తున్నాయ్ నాకు.. ఇక స్టాప్ చేసేయాలి ఇది అని. ఇది ఇక వర్కవుట్ అవ్వదని తెలిసి బ్రేకప్ చెప్పేశా' అంటూ మొత్తం స్టోరీ చెప్పేసింది.


ఇప్పటికీ తన ఎక్స్‌ని చూడాలనిపిస్తుందంటూ విష్ణు చెప్పుకొచ్చింది. 'నా మదర్ ప్లేస్ తీసుకున్నాడు కాబట్టి అతడ్ని చూడకుండా అయితే నేను ఉండలేకపోతున్నాను. మా అమ్మ హగ్స్ తర్వాత మళ్లీ అలాంటి ప్రేమ తన హగ్స్ లోనే నాకు తెలిసింది..అతన్ని చూడాలని ఉంది.. అతనే నా బలం.. మా మమ్మీ ప్రేమించినంత ప్యూర్‌గా నన్ను నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటాడు.. నువ్వు నన్ను మొన్న మూస్కో అంటే నాకు వాడు గుర్తొచ్చాడు.. అసలు నన్ను ఎలా ట్రీట్ చేసేవాడు. ఇలా నువ్వు అనడం విన్నా కూడా వాడు చచ్చిపోతాడు' అంటూ పాస్ట్ లోకి వెళ్ళిపోయింది.

Updated Date - Nov 28 , 2024 | 06:53 AM