Bigg Boss Telugu 8: ప్రతి నిమిషం రసవత్తరం.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది తనేనా
ABN, Publish Date - Nov 08 , 2024 | 10:56 AM
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 10వ వారం కూడా ముగింపునకు వచ్చేసింది. మరో నెల పదిహేను రోజుల్లో ఈ షో ఎండింగ్ కానుండడంతో హౌజ్‌లో కంటెస్టంట్ల మధ్య పోరు కూడా రసవత్తరంగా జరుగుతుంది.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 ఇప్పటికే 9 వారాలు పూర్తి చేసుకుని 10వ వారం కూడా ముగింపునకు వచ్చేసింది. మరో నెల పదిహేను రోజుల్లో ఈ షో ఎండింగ్ కానుండడంతో హౌజ్‌లో కంటెస్టంట్ల మధ్య పోరు కూడా రసవత్తరంగా జరుగుతుంది. మరో రెండు రోజుల్లో ఈ షో 10 వారాలు ముగించుకుని 11వ వారంలో అడుగు పెట్టబోతుంది. ఈ క్రమంలో 10వ వారం 7 గురు ( గౌతమ్, నిఖిల్, యష్మీ గౌడ, ప్రేరణ, పృథ్వీ, విష్ణుప్రియ, హరితేజ) వంటి కంటెస్టంట్లు నామినేషన్ల బరిలో ఉన్నారు. వీరిలో అంతా ప్రాబల్యం ఉన్నవారు, పలుకుబడి ఉన్న వారే కావడంతో వీరిలో ఈ పక్షం ఎవరు హౌజ్ వీడుతారనే సందిగ్దం, ఉత్సుకత అంతటా నెలకొంది.
అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మేరకు 10వారం ఓటింగ్‌లో గౌతమ్ అందరికన్నా అత్యధిక ఓటింగ్‌తో దూసుకెళుతున్నట్లు తెలుస్తోంది. తర్వాతి స్థానాల్లో వరుసగా ప్రేరణ, యష్మిగౌడ, విష్ణుప్రియ, పృథ్వీ, హరితేజ ఉండగా హరితేజ ఈ వారం హౌజ్‌ను వీడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు బిగ్‌బాస్ ఫాలోవర్స్, నెటిజన్లు జోస్యం చెబుతున్నారు. ఇదిలాఉండగా ప్రస్తుతం హౌజ్‌లో టాస్క్‌లు జరుగుతున్న క్రమంలో ఎగ్ టాస్క్ ఆడి గెలిచిన నబీల్‌కు ఫ్రీ ఎవిక్షన్ పాస్ లభించింది. దీంతో అతను ఈ వారం ఎలిమినేషన్ నుంచి సేవ్ అవ్వొచ్చు లేదా నామినేట్ అయిన ఇతర ఇంటి సభ్యుల్లో ఒకరు తేదా ఇద్దరిని ఎలిమినేషన్ నుంచి సేవ్ చేసే అవకాశం ఉంటుంది.
అయితే పాస్ విషయంలో బిగ్‌బాస్ పెట్టిన ట్విస్టు ఆసక్తికరంగా మారింది. పాస్ దక్కించుకున్న నబీల్ను సీజన్ మొత్తంలో ఎవరు నామినేట్ చేయకుండా మెలిక పెట్టాడు. ఇదే ఇప్పుడు నబీల్‌కు సమస్యగా మారే అవకాశం ఉంది. నామినేషన్స్‌లోనే ఉంటేనే ఫాలోయింగ్ పెరగడానికి, టాస్క్‌లు మంచిగా ఆడటానికి అవకాశం ఉంటుంది. నామినేషన్స్‌లో లేకపోతే నబీల్‌కు ప్రేక్షకాదరణ కరువయ్యే అవకాశం మెండుగా ఉంటుంది. మరోవైపు హౌజ్‌లో గౌతమ్, నిఖిల్ మధ్య కోల్డ్ వార్ సాగుతుండగా బయట సామాజిక మాధ్యమాల్లోనూ అదే సీను రిపీట్ అవుతుంది. గౌతమ్ మద్దతు దారులు, నిఖిల్ మద్దతు దారులు ఒకరిపై ఒకరు అదేపనిగా ట్రోల్ చేసుకుంటున్నారు.