Bigg Boss 8: ఈ లవ్ స్టోరీ రూటే సెపరేటు.. వన్ సైడ్ లవ్
ABN, Publish Date - Nov 29 , 2024 | 08:17 AM
బిగ్‌బాస్ సీజన్ 8 ఫినాలేకి సమయం దగ్గుపడుతున్న వేళా హౌస్‌లోకి మాజీ కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. వాళ్ళు ఏం చేశారంటే..
ఇప్పటి వరకు జరిగిన అన్ని బిగ్‌బాస్ సీజన్‌లలో ప్రేమ కథలు కామన్. కానీ ఈ సీజన్ లోని ప్రేమ కథలు మాత్రం చాలా డిఫరెంట్. ప్రత్యేకంగా విష్ణుప్రియ, పృథ్వీల లవ్ ట్రాక్ కొత్తగా కొన్ని సార్లు చెత్తగా ఉంది. ఇక సీజన్ 8 ఫినాలేకి సమయం ఆసన్నమైన వేళా మాజీ కంటెస్టెంట్లు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి సందడి చేశారు. ఫినాలేకి వెళ్లే ఫైనల్ కంటెస్టెంట్లను డిసైడ్ చేసేందుకు టాస్క్‌లు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే విష్ణు ప్రియ, పృథ్వీల లవ్ స్టోరీ మరోసారి తెరపైకి వచ్చింది. ఇందులో ఓ ట్విస్ట్ కూడా ఉంది.
ప్రస్తుతం బిగ్ బాస్ 8లో టికెట్ టు ఫినాలే కంటెండర్‌షిప్ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీలు నిర్వహించడం కోసం బిగ్ బాస్ 3కి చెందిన వితికా షేరు, పునర్నవి హౌస్‌లోకి వచ్చారు. ఎంటర్ కాగానే తమ మాజీ హౌస్ మేట్ రోహిణిని హాగ్ చేసుకొని మిగతా వారితో ముచ్చట్లు పెట్టారు. తర్వాత ట్రూత్ ఆర్ డేర్ గేమ్ నిర్వహించారు. ఇందులో భాగంగానే పృథ్వి, విష్ణుప్రియా మధ్య ఉంది ప్రేమా? స్నేహమా? అని అడిగింది పునర్నవి. దీనికి పృథ్వీ తను నాకు జస్ట్ ఫ్రెండ్ అన్నాడు. విష్ణుప్రియా మాత్రం ఫ్రెండ్ కంటే ఎక్కువ అని చెప్పుకొచ్చింది.ఆడియెన్స్ ప్రకారం.. విష్ణుప్రియ స్నేహాన్ని అడ్డం పెట్టుకొని పృథ్వి గేమ్‌లో ముందుకు వెళ్తున్నట్లు ఉందని పునర్నవి చెప్పింది. దీనికి ఆయన ఒప్పుకోలేదు. విష్ణు తనకు మంచి సపోర్ట్ అని, కానీ తను ముందుకు వెళ్లడం కోసం స్నేహం తనకు అవసరం లేదని చెప్పాడు. ఈ వన్ సైడ్ లవ్ ట్రాక్ ఎన్ని రోజులు నడుస్తుందని ఆడియెన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇక టేస్టీ తేజ సింపథీ గేమ్ ఆడుతున్నాడని వితికా అంది. దీనికి తేజ సమాధానం ఇస్తూ.. ఒక టాస్క్‌లో తాను ఓడిపోయినందుకు బాధలో గ్రూప్ గేమ్ గురించి, సపోర్ట్ గురించి మాట్లాడానని, అది సింపథీ గేమ్ కాదని అన్నాడు. బిగ్ బాస్ హౌస్‌లో నిఖిల్ చెప్పిన అతిపెద్ద అబద్ధం గురించి చెప్పమని అడిగారు. తను మానసికంగా కృంగిపోయినా కూడా తాను అలా కాదని చాలా స్ట్రాంగ్‌గా ఉన్నానని అబద్ధం చెప్పానని చెప్పాడు. హౌస్‌లో నీకు ప్రేమ దొరకలేదా అని నబీల్‌ను అడగగా.. లేదు అని సమాధానమిచ్చాడు నబీల్. అయితే బయట ఉందా అంటూ అందరూ నబీల్ ని టార్గెట్ చేశారు. బయట కూడా తనకు లవ్ స్టోరీ లేదని, తను సింగిల్ అని చెప్పాడు.