Bigg Boss 8 Today: ఇంకేంటి నాగార్జున కూడా క్లారిటీ ఇచ్చేశాడు.. సర్దుకోవాల్సిందే

ABN, Publish Date - Nov 03 , 2024 | 06:42 PM

ఈ వారం నామినేషన్స్‌లో తేజ, యష్మీ, నయని పావని, హరితేజ, గౌతమ్ ఉన్నారు. ఇప్పటికే నాగ్ మామ తేజను సేవ్ చేసేయడంతో ఎలిమినేట్ అయ్యేదెవరని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక అందరు భావించినట్లే ఒక ఘటన జరిగినట్లు తెలుస్తోంది. నాగార్జున కూడా దీనిపై క్లారిటీ ఇచ్చేసినట్లే తెలుస్తోంది. ఇంతకీ ఏమైందంటే..

బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 8 విజ‌య‌వంతంగా 60 రోజులు దాటి దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే తొమ్మిదో వారం ఎలిమినేషన్‌కి సర్వం సిద్ధమైంది. వీకెండ్ కావడంతో హౌస్‌మేట్స్‌తో నాగార్జున సందడి చేస్తూ.. చిన్న చిన్న టాస్క్‌లు ఇస్తూనే పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. ఈ వారం నామినేషన్స్‌లో తేజ, యష్మీ, నయని పావని, హరితేజ, గౌతమ్ ఉన్నారు. ఇప్పటికే నాగ్ మామ తేజను సేవ్ చేసేయడంతో ఎలిమినేట్ అయ్యేదెవరని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక అందరు భావించినట్లే ఒక ఘటన జరిగినట్లు తెలుస్తోంది. నాగార్జున కూడా దీనిపై క్లారిటీ ఇచ్చేసినట్లే తెలుస్తోంది. ఇంతకీ ఏమైందంటే..


మొదటగా సండే ఫన్‌డే కావడంతో ఫన్నీ టాస్క్‌లతో షో మొదలు పెట్టారు నాగార్జున. గుమ్మడి కాయ, కీర దోస, ఉల్లి, నిమ్మ, చిల్లి, ఉసిరి, టమాటా, కాకరకాయ ఇలా 8 రకాల జ్యూస్‌లు ఏర్పాటు చేసి.. ఇందులో ఏదైనా రెండు జ్యూస్‌లు కలిపి ప్రతి ఒకరు ఒక కంటెస్టెంట్‌కి ఇవ్వాలంటూ నాగార్జున ఆదేశించారు. దీంతో చాలా మంది చిల్లీ జ్యూస్ తో అందరిని ఏడిపించేశారు. నెక్స్ట్ మ్యూజిక్ తో మరో గేమ్ పెట్టారు నాగ్. మ్యూజిక్ ఆగినప్పుడు తాను చెప్పిన స్టేజ్ మీదకి లాస్ట్ వెళ్లిన వాళ్లు గేమ్ నుండి అవుట్ అని ప్రకటించారు. దీంతో నయని ఫస్ట్ రౌండ్‌లోనే అయ్యింది. దీంతో ఒక్కసారిగా నాగార్జున "నయని యూ ఆర్ ఎలిమినేటెడ్" అన్నారు.


ఇక చివర్లో ఎలిమినేషన్స్ చూపిస్తూ.. హరితేజ-నయనిలను స్క్రీన్ పై చూపించారు. అయితే ఇప్పటికే సోషల్ మీడియాలో ఎలిమినేట్ అయ్యిందని న్యూస్ లీక్ అయ్యింది. ప్రోమోలో కూడా నాగ్ "నయని యూ ఆర్ ఎలిమినేటెడ్" అంటూ హింట్ ఇచ్చేయడంతో ఆడియెన్స్ పెద్దగా ఆశ్చర్యపోలేదు. ఇక నాగ్ కూడా క్లారిటీ ఇచ్చేయడంతో నయని ఎలిమినేషన్ పై అందరికీ క్లారిటీ వచ్చేసింది.


ఇక ఈ వారం ఎలిమినేషన్‌లో ఉన్న తేజ, యష్మీ, నయని పావని, హరితేజ, గౌతమ్‌లలో తేజని నాగార్జున శనివారమే సేవ్ చేసిన విషయం తెలిసిందే. ఇక గౌతమ్, యష్మీ మంచి ఓటింగ్‌తో సేవ్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఈ వీక్ తన ప్రదర్శనతో అంతగా ఆకట్టుకోలేని హరితేజ.. నయనితో పాటు ఆఖరి వరకు నామినేషన్స్‌లో నిలిచింది. మ‌రోవైపు ఎప్పుడో ఎలిమినేట్ అయ్యే అవ‌కాశ‌మున్న‌ హరితేజను బిగ్‌బాస్ కాపాడుతూ వచ్చిన‌ప్ప‌టికీ బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 8 (Bigg Boss Telugu 8) షో టీఆర్పీ పెంచ‌డం కోసం ఈసారి ఆమెను సీక్రెట్ రూమ్‌కు పంపించే అవ‌కాశాలు ఉన్నాయంటున్నారు.

Updated Date - Nov 03 , 2024 | 06:45 PM