Golam OTT: అదిరిపోయే మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ.. ఇప్పుడు తెలుగులోనూ వ‌చ్చేసింది! అస‌లు వ‌ద‌ల‌కండి

ABN, Publish Date - Oct 27 , 2024 | 07:47 AM

మూడు నెల‌ల క్రితం థియేట‌ర్ల‌లోకి, ఆపై ఆగ‌స్టు నెల‌ల‌లో చ‌ప్పుడు లేకుండా డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చి అంత‌కుమించి అనే స్థాయిలో రెస్పాన్స్ ద‌క్కించుకున్న మ‌ల‌యాళ ఇన్వెస్టిగేష‌న్ క్రైమ్ థ్రిల్ల‌ర్ గోలం ఎట్ట‌కేల‌కు మ‌న తెలుగు భాష‌లోనూ అందుబాటులోకి వ‌చ్చింది.

golam

మూడు నెల‌ల క్రితం థియేట‌ర్ల‌లోకి, ఆపై ఆగ‌స్టు నెల‌ల‌లో చ‌ప్పుడు లేకుండా డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చి అంత‌కుమించి అనే స్థాయిలో రెస్పాన్స్ ద‌క్కించుకున్న మ‌ల‌యాళ ఇన్వెస్టిగేష‌న్ క్రైమ్ థ్రిల్ల‌ర్ గోలం (Golam). సినీ అభిమానుల‌ను ఓ రేంజ్‌లో థ్రిల్‌ను అందించిన ఈ చిత్రం ఎట్ట‌కేల‌కు మ‌న తెలుగు భాష‌లోనూ అందుబాటులోకి వ‌చ్చింది. మ‌నం ఇంత‌వ‌ర‌కు చూడ‌ని కాన్సెప్ట్‌తో మంచి స్కీన్‌ప్లే రూపొందిన ఈ మూవీ చూసేవారికి అదిరిపోయే ఫీల్ ఇస్తుండద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. రంజిత్ సజీవ్ (Ranjith Sajeev), సన్నీ వేన్ (Sunny Wayne), దిలీష్ పోతన్ (Dileesh Pothan), అలెన్సియర్ లే లోపెజ్ (Alencier Ley Lopez), సిద్ధిక్ (Siddique) కీల‌క పాత్ర‌ల్లో న‌టించ‌గా స‌మ్జ‌ద్ (Samjad) ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. జూన్7న థియేట‌ర్ల‌లో విడుద‌లై మంచి విజ‌యం సాధించింది.

క‌థ విష‌యానికి వ‌స్తే.. V-Tech అనే పాపుల‌ర్ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉంటుంది. ఓరోజు ఉద‌యం ఆ కంపెనీలో ప‌ని చేసే ఉద్యోగుల‌తో పాటు, MD ఐజాక్ జాన్ కూడా ఎప్ప‌టిలానే త‌న విధుల నిమిత్తం ఆఫీసుకు వ‌స్తాడు. ఎంప్లాయిస్ కూడా అంతా ఎవ‌రి ప‌నుల్లో వారు నిమ‌జ్ఞ‌మై ఉంటారు. అయితే.. క్యాబిన్‌లో ఉన్న MD త‌న ష‌ర్టుపై కాఫీ ప‌డ‌డంతో దానిని శుభ్రం చేసుకుందామ‌ని వాష్ రూంలోకి వెళ‌తాడు, అనుకోకుండా డోర్ కూడా లాక్ అవుతుంది. అలా వాష్ రూంలోకి వెళ్లిన MD ఎంత సేప‌టికి బ‌య‌ట‌కు రాక‌పోవ‌డంతో అక్క‌డే ఉన్న ఉద్యోగులు మ‌రో తాళం చెవితో డోర్‌ను ఓపెన్ చేసి చూడ‌గా అప్ప‌టికే MD ఐజాక్ జాన్ త‌ల‌కు దెబ్బ త‌గిలి చ‌నిపోయి ఉంటాడు. దీంతో ఎంఫ్లాయూస్ పోలీసుల‌కు స‌మాచారం అందిస్తారు.


ఈ క్ర‌మంలో కేసును చేధించ‌డానికి ASP సందీప్ రంగంలోకి దిగి ఇన్వెస్టిగేష‌న్ మొద‌లు పెట్టగా త‌న‌కు వ‌చ్చిన అనుమానం, ఆపై ఓ చిన్న క్లూ దొర‌క‌డంతో త‌న‌కు ప‌రిచ‌యం ఉన్న ఓ న్యూరో స‌ర్జ‌న్‌ను క‌లుస్తాడు. ఈ నేప‌థ్యంలో చాలా విస్తుపోయే అంశాలు బ‌య‌ట‌కు వ‌స్తాయి. అది అనుకోకుండా సంభ‌వించిన మ‌ర‌ణం కాద‌ని కావాల‌నే చంపార‌ని, దీని వెన‌కాల పెద్ద చ‌రిత్రే ఉన్న‌ట్లు తెలుస్తుంది. ఈ నేప‌థ్యంలో ASP అస‌లు నిందితుడిని ప‌ట్టుకోగ‌లిగాడా, మ‌ర్డ‌ర్ వెన‌కాల దాగి ఉన్న చీక‌టి కోణం ఏంటి, న్యూరో స‌ర్జ‌న్‌కు ఈ క‌థ‌కు లింకేంటి, అస‌లు చిన్న క్లూ దొర‌క‌కుండా ఎంఫ్లాయిస్ అంద‌రు ఆఫీసులో ఉండ‌గానే హ‌త్య ఎలా జ‌రిగింది అనే ఇంట్రెస్టింగ్ అంశాల‌తో సినిమా సాగుతూ ప్రేక్ష‌కుల‌కు సూప‌ర్ థ్రిల్‌ను ఇస్తుంది.

ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుండ‌గా ఇన్నాళ్లు కేవ‌లం మ‌ల‌యాళం భాష‌లో మాత్రమే ఉండ‌గా తాజాగా తెలుగు భాష‌లోనూ అందుబాటులోకి తీసుకు వ‌చ్చారు. మ‌ర్డ‌ర్‌, మిస్ట‌రీ సస్పెన్స్ సినిమాలు ఇష్ట‌ప‌డే వారు, విభిన్న త‌ర‌హా స్క్రీన్ స్లే చిత్రాలు లైక్ చేసే వాళ్లు ఈ సినిమాను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఈ గోలం (Golam) మూవీనీ చూడ‌డం మిస్ చేయొద్దు. ఇందులో ఎలాంటి అశ్లీల‌, వ‌ల్గ‌ర్ స‌న్నివేశాలు లేవు. ఫ్యామిలీతో క‌ల‌సి హాయిగా చూసేయ‌వ‌చ్చు. మ‌ర్డ‌ర్ వెన‌కాల ఉన్న స్టోరీ కాన్సెప్ట్, మ‌ర్డ‌ర్ జ‌రిగిన విధానం మంచి ఎమోష‌న్‌ను, థ్రిల్‌ను ఇస్తుంది. ఇలా కూడా ఉంటుందా అనిపిస్తుంది. క్లైమాక్స్ ట్విస్టు మ‌నం అస‌లు ఊహించ‌ని విధంగా ఉంటుంది.

Updated Date - Oct 27 , 2024 | 07:47 AM