Murder In Mahim: గేలు ఇలా కూడా ఉంటారా.. ఓటీటీలో అదిరిపోయే మర్డర్ మిస్టరీ!
ABN, Publish Date - May 13 , 2024 | 09:30 PM
రోజురోజు ఓటీటీల్లో చాలా డిఫరెంట్ కంటెంట్ వస్తూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా క్రైమ్, థ్రిల్లర్ జానర్‌లో వచ్చే సిరీస్‌లైతే వీక్షకులకు ఎనలేని వినోదాన్ని పంచుతున్నాయి. తాజాగా ఈ కోవకు చెందినదే ఓ ఆసక్తికరమైన సిరీస్ స్రీమింగ్ అవుతోంది.
రోజురోజు ఓటీటీల్లో చాలా డిఫరెంట్ కంటెంట్ వస్తూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా క్రైమ్, థ్రిల్లర్ జానర్‌లో వచ్చే సిరీస్‌లైతే వీక్షకులకు ఎనలేని వినోదాన్ని పంచుతున్నాయి. తాజాగా ఈ కోవకు చెందినదే ఓ ఆసక్తికరమైన సిరీస్ స్రీమింగ్ అవుతోంది. అదే మర్డర్ ఇన్ మహీం (Murder In Mahim). విజయ్ రాజ్ (Vijay Raaz), అశుతోష్ రాణా (Ashutosh Rana), శివాని రఘువంశీ (Shivani Raghuvanshi) వంటి నటులు మెయిన్ లీడ్స్‌లో నటించారు.
అయితే ఈ సిరీస్ ఎప్పటిలా వచ్చే క్రైమ్ థ్రిల్లర్ మాదిరి కాకుండా.. మన దేశంలో సాంప్రదాయాలకు దూరమైన, పలకడానికే ఇబ్బందిపడే స్వలింగ సంపర్కుల నేపథ్యంలో వచ్చింది. అంతేగాక ఫస్ట్ టైం వారి గురించి పూర్తి స్థాయిలో స్టడీ చేసి మరీ ఈ సిరీస్‌ను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అంతేగాక గే ల విషయంలో వారి తల్లిదండ్రులు పడే మనే మనో వేదన, ప్రభుత్వాలు, సంస్థల వ్యవహార శైలి గురించి కూడా చూపించారు. అంతేగాక ఇలాంటి సంస్కృతి కూడా మనదేశంలో ఉందా.. ఉంటుందా అనే అనుమానాలు మనకు రావడం ఖాయం. అంతలా గేల గురించి క్షుణ్ణంగా ఈ సిరీస్‌లో వివరించారు.
కథ విషయానికి వస్తే.. మహీం అనే రైల్వే స్టేషన్‌లోని టాయిలెట్‌లో ఓ యువకుడిని మర్డర్ చేసి కిడ్నీ ఎత్తు కెళతారు. ఈ కేసును శివాజీ రావ్ జెండే అనే పొలీసాఫీసర్ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాడు ఈక్రమంలో మరో రెండు మర్డర్స్ జరుగుతాయి. దీంతో పోలీసాఫీసర్ కేసు ఎంక్వైరీ కోసం పీటర్ ఫెర్నాండెజ్ అనే రిటైర్ జర్నలిస్టు సాయం తీసుకుంటాడు. ఈ క్రమంలో చనిపోయిన వారంతా గే అనే విషయం బయట పడుతుంది. ఇక ఆ తర్వాత కేసు మలుపులు తిరుగుతూ అసలు హంతకుడెవరనేది అంతుచిక్కకుండా లాస్ట్ వచ్చే సింపుల్ ట్విస్ట్ వరకు ఉహకందని విధంగా ఉంటుంది. చివరకు జర్నలిస్టు కుమారుడికి ఈ కేసుకు సంబంధం వంటి ఆసక్తికరమైరన కథకథనాలతో సిరీస్ సాగుతూ ఉంటుంది.
మొత్తం స్వలింగ సంపర్కుల చుట్టూనే కథ సాగుతూ వారికి పాజిటివ్‌గా రూపొందించబడిన ఈ ఒరిజినల్ సిరీస్ మర్డర్ ఇన్ మహీం (Murder In Mahim) జియో సినిమా (Jio Cinema)లో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీతో పాటు తెలుగు, తమిళ, మలమాళ, కన్నడ భాషల్లోనూ అందుబాటులో ఉంది. మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్‌లో అక్కడక్కడ గేకు సంబంధించిన ముద్దులు, ఒకటి రెండు సన్నివేశాలు కాస్త ఇబ్బందిగా, జుగుప్సగా అనిపించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ సిరీస్‌ను ఫ్యామిలీతో చూడడం కొద్దిగా కష్టమైన పని.