Nunakkuzhi OTT: కడుపుబ్బా నవ్వించేందుకు.. సౌత్ ఇండియా ఫ్యామిలీ స్టార్ వచ్చేశాడు
ABN, Publish Date - Sep 13 , 2024 | 10:27 AM
ఫ్యామిలీ స్టార్‌గా సౌత్ ఇండియా మొత్తం సూపర్ క్రేజ్ తెచ్చుకున్న బసిల్ జోసెఫ్ హీరోగా రెండు నెలల క్రితం థియేటర్లలోకి వచ్చి మంచి విజయం సాధించిన ‘నూనక్కళి’ ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
ఫ్యామిలీ స్టార్‌గా సౌత్ ఇండియా మొత్తం సూపర్ క్రేజ్ తెచ్చుకున్న బసిల్ జోసెఫ్ (Basil Joseph) హీరోగా, దృశ్యం, నేరు వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల దర్శకుడు జీతూ జోసెఫ్ (Jeethu Joseph)ల కలయికలో రెండు నెలల క్రితం థియేటర్లలోకి వచ్చి మంచి విజయం సాధించిన ‘నూనక్కళి’ (Nunakkuzhi) ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
కథ విషయానికి వస్తే.. ఎబీ తన తండ్రి మరణానంతరం కొత్తగా తమ కంపెనీ బాధ్యతలు తీసుకుంటాడు. అయితే ఎబీ ఓ రోజు తన భార్యతో కలిసి కంపెనీ వ్యవహారాల్లో అనుకోకుండా ఓ మిస్టేక్ చేస్తాడు. అ తప్పు జరిగిన తెల్లారే కంపెనీపై ఐటీ రైడ్స్ జరిగి ఎబీ పర్సనల్ ల్యాప్‌టాప్‌ను తీసుకెళతారు. ఈ క్రమంలో ఎబీ తన ల్యాప్‌టాప్‌ను తిరిగి తెచ్చుకునేందుకు చేసిన పనులు, జరిగిన పరిణామాల నేపథ్యంలో సినిమా అనేక రకాల మలుపులు తిరుగుంది. ఆపై ఓ సినిమా అసిస్టెంట్ దర్శకుడు, పోలీసాఫీసర్, ఇన్‌కంట్యాక్స్ ఆఫీసర్, సూసైడ్ చేసుకోబోయిన రష్మిత అనే యువతి ఇలా నలుగురైదుగురు ఎబీ జీవితంలోకి వస్తారు. ఆపై ఆ క్యారెక్టర్లు సినిమా ముగింపుకు వచ్చేసరికి మరో తీరుగా మారుతుంటాయి.
ఈ పరిస్థితుల్లో హీరో తన ల్యాప్‌టాప్‌ను దక్కించుకోగలిగాడా, తన అబద్దాల వళ్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడనే పాయింట్‌తో సినిమా చివరి వరకు మంచి కామెడీని పంచుతూ థ్రిల్‌ను ఇస్తుంది. చివరలో వచ్చే ట్విస్టు ఆకట్టుకుంటుంది.
మనిషి జీవితంలో ఎదురయ్యే అనూహ్య మలుపులను కామెడీతో అందంగా మల్చిన ఈ సినిమా సెప్టెంబర్ 13నుంచి జీ5 (ZEE 5) ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, కన్నడ భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉండనుంది. ఈ ‘నూనక్కళి’ (Nunakkuzhi) మూవీలో ఎలాంటి అసభ్య సన్నివేశాలు కూడా లేనందున కుటుంబమంతా కలిసి సినిమాను హాయిగా చూసి ఆనందించవచ్చు.