Parakramam OTT: అప్పుడే ఓటీటీకి.. బండి స‌రోజ్ పరాక్ర‌మం! ఎప్ప‌టి నుంచంటే

ABN, Publish Date - Sep 12 , 2024 | 05:16 PM

ఆగ‌స్టు 22న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి మిశ్ర‌మ స్పంద‌న తెచ్చుకున్న పరాక్ర‌మం అనే రివెంజ్ డ్రామా చిత్రం డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. బండి సరోజ్ కుమార్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించాడు.

Parakramam

ఆగ‌స్టు 22న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి మిశ్ర‌మ స్పంద‌న తెచ్చుకున్న పరాక్ర‌మం (Parakramam) అనే రివెంజ్ డ్రామా చిత్రం డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. బి‌ఎస్‌కె మెయిన్ స్ట్రీమ్ పతాకంపై బండి సరోజ్ కుమార్ (Bandi Saroj Kumar) హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శృతి సమన్వి (Sruthi Samanvi), నాగ లక్ష్మి, మోహన్ సేనాపతి, నిఖిల్ గోపు, అనిల్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు.

క‌థ విష‌యానికి వ‌స్తే.. తూర్పు గోదావ‌రి లంపకలోవ అనే గ్రామంలో మ‌తిస్తిమితం స‌రిగ్గా ఉండ‌ని స‌త్తిబాబు నాట‌కాలు వేస్తూ జీవిస్తూ ఉంటాడు. అయితే ఓ రోజు తీవ్ర అస్వ‌స్థ‌త‌కు లోనైన స‌త్తిబాబు త‌న కుమారుడు లోవరాజుతో త‌ను ర‌చించిన ప‌రాక్ర‌మం అనే నాట‌కాన్ని ఎప్ప‌టికైనా వేయాల‌ని, ఆ నాట‌కం వేయ‌డానికి రెడీ అయిన‌ప్పుడు మాత్ర‌మే ఆ బుక్ తెర‌వాల‌ని చెప్పి చ‌నిపోతాడు. దీంతో తండ్రికి ఇచ్చిన మాట కోసం ‘పరాక్రమం’ నాటకాన్ని హైదరాబాద్‌ రవీంద్ర భారతిలో వేయాలని ప్రయత్నిస్తుంటాడు. ఇంతకీ పరాక్రమం నాటకంలో ఏముంది..? సత్తిబాబు గతం ఏమిటి..? లోవరాజు రవీంద్ర భారతిలో నాటకం ఎందుకు వేయాలని అనుకుంటాడు..? బుజ్జమ్మ అతడి కోసం ఎందుకు ఎదురుచూస్తుంది..? అనే క‌థ‌నంతో సినిమా సాగుతుంది.


ఇదిలాఉండ‌గా ఈ సినిమాను బండి సరోజ్ కుమార్ (Bandi Saroj Kumar) అంతా తానే అయి న‌డిపించాడు. దర్శకత్వం, సంగీతం, ఎడిటింగ్, నిర్మాణం ఇలా అన్ని విభాగాలను ఒక్కడే హ్యాండిల్ చేశాడు. కానీ స్క్రీన్ ప్లే కన్ఫ్యూజన్‌గా సాగడం, క‌థ స్టోగా న‌డ‌వ‌డం ఇబ్బందిక‌రంగా అనిపిస్తుంది. అయితే లోప‌రాజు క్యారెక్ట‌ర్‌, డైలాగ్స్ బాగా మెస్మ‌రైజ్ చేస్తాయి. ఈ సినిమా ఈగ‌స్టు 14 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవ‌నుంది. ఆస‌క్తి ఉన్న వారు, ల్యాగ్ ఉన్నా చూస్తామ‌నుకునే వారు ఒక‌సారి ఈ పరాక్ర‌మం (Parakramam) సినిమాను చూసేయ‌వ‌చ్చు.

Updated Date - Sep 12 , 2024 | 05:16 PM