SIT: ఆర్మాక్స్‌ రేటింగ్‌లో అరవింద్ కృష్ణ ‘SIT’ మూవీకి టాప్ ప్లేస్

ABN , Publish Date - Jul 19 , 2024 | 09:07 PM

ఇన్వెస్టిగేటివ్ మర్డర్ మిస్టరీ నేపథ్యంలో తీసిన SIT (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) ప్రస్తుతం ఫుల్ ట్రెండ్ అవుతోంది. యంగ్ హీరో అరవింద్ కృష్ణ మల్టీ-షేడ్ పాత్రలో నటించిన ఈ చిత్రం ప్రస్తుతం ZEE5లో టాప్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది. విడుదలై 10 వారాలైనా కూడా ఇప్పటికీ ట్రెండింగ్‌లోనే ఉండటం విశేషం. తాజాగా ఈ సినిమా ఆర్మాక్స్ రేటింగ్‌లో కూడా టాప్ ప్లేస్‌లో ఉండటంతో.. మేకర్స్ తమ ఆనందాన్ని తెలియజేశారు.

SIT Movie Poster

ఇన్వెస్టిగేటివ్ మర్డర్ మిస్టరీ నేపథ్యంలో తీసిన SIT (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) ప్రస్తుతం ఫుల్ ట్రెండ్ అవుతోంది. యంగ్ హీరో అరవింద్ కృష్ణ (Arvind Krishna) మల్టీ-షేడ్ పాత్రలో నటించిన ఈ చిత్రం ప్రస్తుతం ZEE5లో టాప్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది. విడుదలై 10 వారాలైనా కూడా ఇప్పటికీ ట్రెండింగ్‌లోనే ఉండటం విశేషం. తాజాగా ఈ సినిమా ఆర్మాక్స్ రేటింగ్స్‌లో (Ormax Ratings) కూడా టాప్ ప్లేస్‌లో ఉండటంతో.. మేకర్స్ తమ ఆనందాన్ని తెలియజేశారు.

Also Read-Suman: ఏపీలో సినిమా ఇండస్ట్రీ డెవలప్ కావాలంటే.. ఆ కండీషన్లు పెట్టకూడదు

ఆర్మాక్స్ రేటింగ్‌ల ప్రకారం, దేశవ్యాప్తంగా అత్యధికంగా ఇష్టపడిన, అత్యధికంగా వీక్షించబడిన తెలుగు చలనచిత్రాలు/వెబ్ సిరీస్ జాబితాలో SIT అగ్రస్థానంలో ఉంది. భారీ పోటీ ఉన్నప్పటికీ, గ్రిప్పింగ్‌గా సాగే ఈ SIT 2.8 మిలియన్ల వీక్షకులతో టాప్ ప్లేస్‌లో చోటు దక్కించుకోవడంపై దర్శక నిర్మాతలు హర్షం వ్యక్తం చేశారు. ఇంతటి విజయాన్ని తమ చిత్రానికి అందించిన ప్రేక్షకులకు వారు ధన్యవాదాలు తెలిపారు.


Arvind-Krishna.jpg

స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (Special Investigation Team) హెడ్‌గా అరవింద్ కృష్ణ ఈ చిత్రంలోని నటన అందరినీ అలరిస్తోంది. ఎంతో ఛాలెంజింగ్‌ క్యారెక్టర్ అయినప్పటికీ.. అరవింద్ కృష్ణ తన ఆహార్యంతో ఆ పాత్రకి ప్రాణం పోసినట్లుగా తన స్కిల్స్‌ని ప్రదర్శించారు. గ్రే షేడ్స్‌తో అరవింద్ కృష్ణ అందరినీ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లను చేస్తున్నారు. ఆయన నటించిన సూపర్ హీరో చిత్రం ‘ఏ మాస్టర్‌ పీస్’ (A Masterpiece) త్వరలోనే విడుదల కానుంది.

Read Latest Cinema News

Updated Date - Jul 19 , 2024 | 09:07 PM