Arthamainda Arun Kumar: అరుణ్‌కుమార్‌కు ఎదురైన సవాళ్లు ఏంటి..

ABN, Publish Date - Sep 27 , 2024 | 12:14 AM

'అర్థమైందా అరుణ్‌ కుమార్‌' (Arthamainda Arun Kumar) వెబ్‌ సిరీస్‌కు కొనసాగింపు సిద్ధమవుతోంది. ఈనిపై అధికారిక ప్రకటన వచ్చింది

'అర్థమైందా అరుణ్‌ కుమార్‌' (Arthamainda Arun Kumar) వెబ్‌ సిరీస్‌కు కొనసాగింపు సిద్ధమవుతోంది. ఈనిపై అధికారిక ప్రకటన వచ్చింది. తొలి సీజన్‌ పాపులర్‌ కావడంతో రెండో సీజన్‌లపై కూడా మంచి అంచనాలున్నాయి. కామెడీ డ్రామాగా రూపొందిన తొలి సిరీస్‌లో హర్షిత్‌ రెడ్డి 30 వెడ్స్‌ 21 ఫేమ్‌ అనన్య శర్మ, తేజస్వి మదివాడ కీలక పాత్రలు పోషించారు. గతేడాది జూన్‌ 30వ తేదీన ఈ సిరీస్‌ ఆహా ఓటీటీలోకి స్ట్రీమింగ్‌ అయింది. న్యూఏజ్‌ కామెడీతో ఆకట్టుకుంది. ఇప్పుడు, ఈ అర్థమైందా అరుణ్‌ కుమార్‌ రెండో సీజన్‌ వస్తోంది. దీనికి సంబంధించి కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. అక్టోబర్‌లో ఈ సిరీస్‌ను విడుదల చేయనున్నారు. త్వరలో టీజర్‌ను తీసుకొచ్చే అవకాశం ఉంది. జోనాథన్‌ ఎడ్వర్డ్స్‌ దర్శకత్వం వహించారు. (Arthamainda Arun Kumar Season 2)

ఓ ఊరు నుంచి హైదరాబాద్‌కు వచ్చి.. కార్పొరేట్‌ ఆఫీస్‌లలో తిప్పలు పడే యువకుడి చుట్టూ ఈ సిరీస్‌ తొలి సీజన్‌ సాగింది. కార్పొరేట్‌ లైఫ్‌ ఎలా ఉంటుందనేది డైరెక్టర్‌ చూపించారు. దీంతో ఈ సిరీస్‌ చాలా మందికి కనెక్ట్‌ అయింది. మంచి వ్యూస్‌ దక్కించుకుంది. తొలి సీజన్‌లో హర్షిత్‌(Harshith reddy) , అనన్య (Ananya Sharma), తేజస్వితో పాటు వాసు ఇంటూరి, జై ప్రవీణ్‌, శ్రావ్య మృదుల కీలక పాత్రలు పోషించారు. అయితే ఈ సీజన్‌లో అరుణ్‌కుమార్‌కు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి... వాటిని ఎదుర్కొన్నాడా లేదా అన్న నేపథ్యంలో సాగుతుంది. అరీ స్టూడియోస్‌, లాఫింగ్‌ కౌ ప్రొడక్షన్స్‌ బ్యానర్లపై బి.సాయికుమార్‌, తన్వి దేశాయ్‌ నిర్మిస్తున్నారు. అజయ్‌ అరసాడ సంగీతం అందించారు.

Updated Date - Sep 27 , 2024 | 12:14 AM