Bahiskarana OTT: ఓటీటీకి వ‌చ్చేస్తున్న.. అంజ‌లి విలేజ్ రివేంజ్ డ్రామా సిరీస్‌

ABN, Publish Date - Jul 08 , 2024 | 09:38 AM

ఇటీవ‌ల గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చింది చిత్రంతో అల‌రించిన అంజ‌లి మ‌రోసారి ప్రేక్ష‌కుల‌ను అరించ‌డానికి రెడీ అవుతోంది. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో రూపొందిన‌ వెబ్ సిరీస్ ‘బహిష్కరణ’ డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేస్తోంది.

Bahishkarana

ఇటీవ‌ల గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చింది చిత్రంతో అల‌రించిన అంజ‌లి (Anajali) మ‌రోసారి ప్రేక్ష‌కుల‌ను అరించ‌డానికి రెడీ అవుతోంది. యాబైకి పైగా చిత్రాల్లో హీరోయిన్‌గా, విలక్షణ పాత్రల్లో మెప్పించిన నటి అంజలి తాజాగా ఆమె ప్రధాన పాత్రలో ZEE 5, పిక్సల్ పిక్చర్స్ ఇండియా బ్యానర్స్ ( Pixel Pictures Pvt Ltd)పై రూపొందిన‌ వెబ్ సిరీస్ ‘బహిష్కరణ’ (Bahiskarana) డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేస్తోంది. ఈ సిరీస్‌కు ముఖేష్ ప్రజాపతి (Mukesh Prajapathi) ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. తాజాగా ఈ సిరీస్ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు.

టీజ‌ర్‌ను గ‌మ‌నిస్తే.. రేడియోలో చ‌క్క‌టి పాట వ‌స్తుండ‌గా ఓ ప‌ల్లెటూరులో బ‌స్సులో కూర్చున్న అమ్మాయి (అంజ‌లి) స్వ‌చ్చ‌మైన గాలిని ఆస్వాదిస్తుంటుంది. ఈ సన్నివేశంతో ప్రారంభ‌మైన టీజ‌ర్‌కు ఈ ప్ర‌పంచం లొంగిపోయేది రెండిటికే .. ఒక‌టి సొమ్ముకి, ఇంకొక‌టి సోకు అనే డైలాగ్ ఓ అమ్మాయి ఈ ప్ర‌పంచాన్ని అర్థం చేసుకున్న తీరుని చెప్పే ప్ర‌య‌త్నం చేస్తుంది.


ఆదేవిధంగా ఓ వైపు ప్రేమ కురిపిస్తూనే మ‌రో వైపు ఆగ్ర‌హావేశంతో ఊగిపోయే ఆమె పాత్ర‌ను, స‌న్నివేశాల‌ను చూస్తుంటే అంజ‌లి మ‌రో విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లో మెప్పించే ప్ర‌య‌త్నం చేసింద‌ని అర్థ‌మ‌వుతుంది. ప్ర‌శాంతంగా ఉండే ఆ ప‌ల్లెటూరుకి అమ్మాయి ఎందుకు వ‌చ్చింది.. ఆమెకు అక్క‌డ ఎదురైన ప‌రిస్థితులేంటి? ఆమె ఎవ‌రిపై ప్ర‌తీకారం తీర్చుకోవాల‌నుకుంది.. ఎందుకు? అనే ఆస‌క్త‌క‌ర‌మైన క‌థ‌క‌థ‌నాల మ‌ధ్య ఈ సిరీస్ సాగ‌నుంది.

విలేజ్ రివేంజ్ డ్రామా జోనర్‌లో రూపొందిన ఈ వెబ్ సిరీస్‌లో 6 ఎపిసోడ్స్ ఉంండ‌గా.. జూలై 19 నుంచి జీ5 (ZEE 5) ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. అంజ‌లితో పాటు రవీంద్ర విజయ్ (Ravindra Vijay), శ్రీతేజ్ (Shritej), అనన్య నాగళ్ల (Ananya Nagalla), షణ్ముక్, చైతన్య సాగిరాజు, మహ్మద్ బాషా, బేబీ చైత్ర వంటి వారు ముఖ్య పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. ఈ సిరీస్‌కు ప్రసన్నకుమార్ సినిమాటోగ్రఫీ అందించ‌గా సిద్ధార్థ్ సదాశివుని (Sidharth Sadasivuni) సంగీతం సమకూర్చారు. రవితేజ గిరిజాల (Raviteja Girijala) ఎడిటర్‌గా ప‌ని చేశారు.

Updated Date - Jul 08 , 2024 | 09:38 AM