Buddy: ఓటీటీకి అల్లు శిరీష్ ‘బ‌డ్డీ’.. ఎప్ప‌టినుంచంటే!

ABN, Publish Date - Aug 27 , 2024 | 09:12 AM

అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్లుగా ఇటీవ‌ల థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన చిత్రం ‘బడ్డీ’ డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది.

buddy

అల్లు శిరీష్ (Allu Sirish) హీరోగా ఇటీవ‌ల థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన చిత్రం ‘బడ్డీ’ (Buddy) డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. ఆగ‌స్టు2న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం అంత‌గా ఆక‌ట్టుకోలేక పోయింది. శిరీష్ (Allu Sirish) స‌ర‌స‌న‌ గాయత్రి భరద్వాజ్ (Gayatri bharadwaj), ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్లుగా నటించ‌గా స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా (KE Gnanavelraja), అధన జ్ఞానవేల్ రాజా నిర్మించారు. శామ్ ఆంటోన్ ( Sam Anton) దర్శకత్వం చేయ‌గా, హిప్‌హాప్ త‌మిళ (Hiphop Tamizha) సంగీతం అందించారు.

క‌థ విష‌యానికి వ‌స్తే.. పైలెట్ ఆదిత్య (అల్లు శిరీష్‌) . పల్లవి (గాయత్రి భరద్వాజ్‌) వైజాగ్‌లో ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌. విధి నిర్వహణలో ఫ్టైట్‌ ల్యాండ్‌ చేయడంలో పల్లవికి పైలెట్ ఆదిత్య సాయపడతాడు. ఆపై ఇద్ద‌రు ప్రేమించుకుంటారు. ఓ రోజు డ్యూటీలో ప‌ల్ల‌వి చేసిన పొర‌పాటు వ‌ల్ల ఆదిత్య జాబ్ పోతుంది అదే స‌మ‌యంలో ప‌ల్ల‌వి కిడ్నాప్ అయి అక్క‌డ జ‌రిగిన ప్ర‌మాదంలో కోమాలోకి వెళ్లగా.. ఆమె ఆత్మ ఓ టెడ్డీబేర్‌లోకి చేరుతుంది. ప్రాణం ఉండగానే పల్లవి ఆత్మ బయటకెలా వచ్చింది? ఆమెను కిడ్నాప్‌ చేసిన ముఠాకి.. హాంకాంగ్‌లో ఉన్న డాక్టర్‌ అర్జున్‌ కుమార్‌ వర్మ (అజ్మల్‌)కూ ఉన్న సంబంధం ఏంటి? పల్లవి శరీరంలోకి ఆత్మ తిరిగి వచ్చిందా? ఆదిత్యా, పల్లవి ఒకటయ్యారా? అన్నదే స్టోరీ.


అవయవాల అక్రమ రవాణా నేపథ్యంలో వారి ఆరాచ‌కాల‌ను ఒక టెడ్డీబేర్‌తో కలిసి హీరో ఎలా పోరాటం చేశాడనే స్టోరీ లైన్ అద్భుతంగా ఉన్న‌ప్ప‌టికీ సినిమాగా వ‌చ్చేస‌రికి కాస్తక‌న్‌ఫ్యూజ్ అయిన‌ట్టు తెలుస్తుంది. ఆర్‌ఆర్‌ఆర్‌, జై బాలయ్య, భగవంత్‌ కేసరి రిఫరెన్స్‌లు నవ్వులు పూయిస్తాయి. క‌థానాయిక కోమాలో ఉండ‌గా అమె బాడీ కోసం వెత‌క‌డం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. పిల్లలు మాత్రం ఈ సినిమాను చాలా ఇష్ట‌ప‌డుతారు. ఆగ‌స్టు30 శుక్ర‌వారం నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీలో ప్ర‌సారం కానుంది. థియేట‌ర్ల‌లో మిస్స‌యిన‌వారు ఇంట్లోనే చూసి ఎంజాయ్ చేయ‌వ‌చ్చు.

Updated Date - Aug 27 , 2024 | 10:50 AM