Ajay Gadu: ‘అజయ్ గాడు’ డైరెక్ట్‌గా ఓటీటీలోకి.. ఈ ఓటీటీలో ఫ్రీగా చూసేయండి
ABN, Publish Date - Jan 17 , 2024 | 11:20 AM
అజయ్ కుమార్ ప్రొడక్షన్స్ పతాకంపై అజయ్ కర్తుర్వర్ స్వీయ దర్శకత్వంలో అజయ్ కుమార్, చందన కొప్పిశెట్టి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘అజయ్ గాడు’. అజయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ ‘అజయ్‌గాడు’ మూవీలో బిగ్ బాస్ తెలుగు ఫేమ్ భానుశ్రీ, రోడీస్ విన్నర్ శ్వేత మెహతా కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. అంతేకాదు, ఈ మూవీ అందరికీ ఫ్రీగానే అందుబాటులో ఉంది.
అజయ్ కుమార్ ప్రొడక్షన్స్ (Ajay Kumar Productions) పతాకంపై అజయ్ కర్తుర్వర్ (Ajay Karthurvar) స్వీయ దర్శకత్వంలో అజయ్ కుమార్, చందన కొప్పిశెట్టి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘అజయ్ గాడు’. అజయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ ‘అజయ్ గాడు’ (Ajay Gadu) మూవీలో బిగ్ బాస్ తెలుగు ఫేమ్ భానుశ్రీ, రోడీస్ విన్నర్ శ్వేత మెహతా కీలక పాత్రల్లో నటించారు. ప్రాచీ టక్కర్, అభయ్ బేతిగంటి, జయశ్రీగారు, యద్దం రాజు తదితరలు ఇతర పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఇప్పుడు డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. భారతదేశంలో అత్యంత వేగవంతంగా దూసుకెళుతోన్న వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ Zee5లో డైరెక్ట్ డిజిటల్ మూవీగా ‘అజయ్‌గాడు’ చిత్రం అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమాను ఎటువంటి ఛార్జెస్ లేకుండా జీ5 ఫ్రీగా అందరికీ అందుబాటులో ఉంచింది. (Ajay Gadu in Zee 5 OTT)
‘అజయ్ గాడు’ సినిమా విషయానికి వస్తే.. అజయ్ అనే వ్యక్తికి సంబంధించిన కథ ఇది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి అజయ్. రోజురోజుకీ మారిపోతున్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి.. డబ్బు, పేరు, ప్రేమ వంటి వాటి ప్రాముఖ్యతను తెలుసుకోవడానికి ఇబ్బందిపడుతుంటాడు. వీటన్నింటినీ వదిలేయాలనుకున్న అతను ఒకానొక సందర్భంలో శ్వేతను ప్రేమిస్తాడు. ఆమె డ్రగ్స్‌కి బానిస అయిన మెడికో. అలాంటి ఆమెను సక్రమ మార్గంలో ఉంచటానికి చేసే ప్రయత్నాల్లో బాహ్య ప్రపంచంతో అజయ్ ఎలాంటి యుద్ధం సాగించాడనేదే కథ. ఈ సినిమా జనవరి 12 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ సందర్భంగా అజయ్ కర్తుర్వర్ (Ajay Karthurvar) మాట్లాడుతూ.. ఒక సినిమాలో నటిస్తూ, నిర్మాతగా, దర్శకుడిగా పనిచేయడం మామూలు విషయం కాదు. చాలా థ్రిల్లింగ్ జర్నీ ఇది. ఈ ప్రాజెక్టుకు నా మనసులో ఎప్పుడూ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఈ అద్భుతమైన అనుభవాన్ని ప్రతి ఒక్కరితోనూ పంచుకోవాలని అనుకుంటున్నాను. సినిమా కథ ఎలా ఉంటుందో ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. కానీ సినిమాలో అంతకు మించిన విషయాలు చాలా ఉంటాయి. స్టంట్స్, ఎమోషన్స్, రొమాన్స్ వీటన్నిటిని కలగలిపి అద్భుతంగా తెరకెక్కించాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులకు ఈ సినిమాను అందించడమే నా ధ్యేయం. జీ5తో కలిసి ఈ సినిమాను విడుదల చేయడానికి చాలా ఆనందంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులను ఒకే రోజు పలకరించడానికి జీ5 చక్కటి వేదిక అయింది. అజయ్‌గాడు సకుటుంబంగా చూడాల్సిన సినిమా. ప్రతి ఒక్కరికీ నచ్చే అంశాలు ఇందులో ఉంటాయని తెలిపారు.
అజయ్ కర్తుర్వర్‌తో పనిచేయడం అత్యద్భుతమైన అనుభవం. తను మంచి కోస్టార్. ఈ సినిమాలో ఆయన పాత్ర, కథనం డిఫరెంట్‌గా ఉంటుంది. అజయ్ తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తారనటంలో సందేహహం లేదు. ఆయన కథ చెప్పగానే నాకు నచ్చింది. ఈ సినిమాలో నేను ప్రియ అనే పాత్రలో నటిస్తున్నాను. స్వేచ్ఛగా ఉండే యువతి పాత్ర అది. తన జీవితానికి తనకు నచ్చిన సిద్ధాంతాన్ని అమలు చేసుకునే అమ్మాయి పాత్ర అది. బోల్డ్ రిలేషన్‌షిప్స్ ని చూపిస్తూ సాగే, అందమైన ప్రేమ కథ ఇది. మూవీలో అజయ్‌తో నా కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. ఈ సినిమాను ప్రేక్షకులు జీ5లో ఆస్వాదిస్తారని ఆశిస్తున్నానని అన్నారు హీరోయిన్ భానుశ్రీ (Bhanu Shree).
ఇవి కూడా చదవండి:
====================
*HanuMan: ‘హను-మాన్’ ఇది నీ దర్శనం.. ఇది నిదర్శనం
***************************
*Kanguva: ‘కంగువ’ సెకండ్ లుక్.. సూర్య ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్
**************************
*Akira Nandan: పవన్ మిస్.. అయితేనేం పండగ వేళ ఆయన వారసుడి లుక్‌కి ఫ్యాన్స్ ఫిదా!
*************************