SWAG OTT: స‌డ‌న్‌గా.. ఓటీటీకి వ‌చ్చేసిన శ్రీవిష్ణు ‘శ్వాగ్‌’! స్ట్రీమింగ్‌ ఎందులో అంటే

ABN, Publish Date - Oct 25 , 2024 | 09:53 AM

ఇటీవ‌ల థియేట‌ర్ల‌లో విడుద‌లై ఓ ప్ర‌యోగాత్మ‌క చిత్రంగా పేరు తెచ్చుకున్న శ్వాగ్ స‌డ‌న్‌గా డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది.

swag

ఇటీవ‌ల థియేట‌ర్ల‌లో విడుద‌లై ఓ ప్ర‌యోగాత్మ‌క చిత్రంగా పేరు తెచ్చుకున్న శ్వాగ్ (Swag movie) స‌డ‌న్‌గా డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్సించేది. శ్రీ విష్ణు (Sree Vishnu), మీరా జాస్మిన్ (Meera Jasmine), రీతూ వ‌ర్మ (Ritu varma), ద‌క్షా న‌గార్క‌ర్ (Daksha nagarkar), స‌నీల్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. 'రాజ రాజ చోర’ వంటి మంచి విజ‌యం త‌ర్వాత హసిత్‌ గోలి ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకం మీద టీజీ విశ్వప్రసాద్ (Tg vishwa prasad ) నిర్మించారు. ఈ ఆక్టోబ‌ర్ 4న థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ మూవీ ప్రేక్ష‌కుల నుంచి పాజిటివ్ రెప్సాన్స్ ద‌క్కించుకున్న‌ప్ప‌టికీ స్టోరీలోని కాన్‌ప్లిక్ట్ అంద‌రికీ రీచ్‌ కాలేక‌పోయింది. దీంతో ఇప్పుడు ఈసినిమాను 20 రోజుల్లోనే ఓటీటీకి తీసుకువ‌చ్చేశారు.

భవభూతి (శ్రీవిష్ణు) ఎస్సైగా రిటైర్‌ అవుతాడు. విధి నిర్వాహణలో పలు కారణాల వల్ల ఆయనకు రావలసిన పెన్షన్‌, ప్రావిడెంట్‌ ఫండ్‌ రాకుండా ఆయన పైనున్న మహిళా అధికారి అడ్డుకుంటుంది. అదే  సమయంలో తాను శ్వాగణిక వంశంలో జన్మించిన వ్యక్తి అని, వారసత్వంగా తనకు కోట్లతో కూడిన నిధి ఉందని తెలుస్తుంది. ఆస్తి కోసం వంశవృక్ష నిలయానికి వెళ్ల‌గా అక్కడ అనుభూతి (రీతూ వర్మ) కనిపిస్తుంది. అయితే శ్వాగణిక వంశ వారసులు తమ వారసత్వాన్ని నిరూపించుకోవడానికి అవసరమైన ఓ పురాతన పలక ఆమె దగ్గర ఉంటుంది.

ఆ పలక అనుభూతి దగ్గరికి ఎలా వచ్చింది. సింగ (శ్రీవిష్ణు) ఎవరు? ఒకే రూపురేఖలతో ఉన్న భవభూతి, సింగకు మధ్య సంబంధం ఏంటి? వాళ్లకు ఆస్తి రాకుండా చేసిన యయాతి (ట్రాన్స్‌జెండర్) ఎవరు? ఏం చేశాడు? 1551 సమయంలో మగాళ్లని తన కాలి కింద చెప్పులా చూసిన వింజామర వంశ మహారాణి రుక్మిణీ దేవి (రీతూ వర్మ)ని కాద‌ని పురుషాధిక్యం పెంచడానికి శ్వాగణిక వంశ మహారాజు భవభూతి (శ్రీ విష్ణు) ఏం చేశాడు? రేవతి (మీరా జాస్మిన్‌), విభూతి ఎవరు? చివరకు ఆస్తి ఎవరికి దక్కింది? అనేది కథ.


చెప్ప‌డానికి , విన‌డానికి చాలా ఆస‌క్తిక‌రంగా ఉన్న ఈ సినిమా క‌థ చూస్తుంటే పాత్ర ఎంతో రీసెర్చ్ చేసి సినిమాను తెర‌కెక్కించిన‌ట్లు తెలుస్తుంది. కానీ హీరోనే నాలుగైదు పాత్ర‌ల్లో క‌నిపించ‌డంతో ప్రేక్ష‌కులు కాస్త క‌న‌ప్యూజ‌న్ గురౌతారు. వివేక్‌ సాగర్‌ పాటలు, నేపథ్య సంగీతం బావుడ‌డంతో పాటు రెట్రో సాంగ్ ఆక‌ట్టుకుంటుంది. అలాగే సమాజంలో మనకు నిత్యం ఎదుర‌య్యే ఓ సున్నితమైన అంశాన్ని కూడా తెరపై అద్భుతంగా చూపించాడు. ఇప్పుడీ సినిమా స‌గ‌న్‌గా అమెజాన్ ప్రైమ్ వీడియో (PrimeVideo) లో ఈ రోజు (ఆక్టోబ‌ర్ 25) శుక్ర‌వారం నుం,ఇ స్ట్రీమింగ్ అవుతోంద‌. ఎవ‌రైతే థియేట‌ర్ల‌లో ఈసినిమాను మిస్స‌య్యారో, ఓ డిఫ‌రెంట్ స్టోరీ టెల్లింగ్ చూడాల‌నుకుంటున్నారో ఈ సినిమా మంచి స‌జేష‌న్‌. రెగ్యులర్‌ శ్రీవిష్ణు (Sree Vishnu) ని కాకుండా కొత్త యాంగిల్‌లో చూడాలనుకునే వారు ఈ శ్వాగ్ (Swag movie) సినిమాపై లుక్కేయవచ్చు.

Updated Date - Oct 25 , 2024 | 09:53 AM