Krishnamma OTT: షాకింగ్.. 7 రోజుల్లోనే ఓటీటీకి వచ్చేసిన సత్యదేవ్ లేటెస్ట్ మూవీ 'కృష్ణమ్మ'
ABN, Publish Date - May 17 , 2024 | 05:26 AM
సత్యదేవ్ హీరోగా వారం రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'కృష్ణమ్మ'. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాకుసమర్పకుడిగా వ్యవహరించడం విశేషం. మే 10నన థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మే 17న అంటే 7 రోజుల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్‌కు రావడం ఇప్పుడు అందరిని అశ్చర్యానికి గురి చేస్తోంది.
సత్యదేవ్ (Satya Dev) హీరోగా అనిత రాజ్ (Athira raj), అర్చన ప్రధాన పాత్రల్లో నటించగా వారం రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'కృష్ణమ్మ' (Krishnamma). ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాకు ఫస్ట్ టైం సమర్పకుడిగా వ్యవహరించడం విశేషం. వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన అ చిత్రానికి వివి గోపాల కృష్ణ (VV Gopalakrishna) దర్శకత్వం వహించారు. పైగా టాలీవుడ్ అగ్ర దర్శకులు రాజమౌళి, అనిల్ రావిపూడి, కొరటాల శివ (koratala siva), లాంటి వాళ్ళు ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌కు రావడంతో ఈ చిత్రంపై అంచనాలు బాగా పెరిగాయి కూడా.
గత వారమే మే 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఎలక్షన్స్, ఐపీల్ నేపథ్యంలో సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపకపోవడంతో ఈ సినిమా వచ్చిన సంగతి కూడా చాలా మందికి తెలియదు. ఈ క్రమంలోనే తాజాగా థియేటర్లు పది రోజుల పాటు మూసివేస్తున్నట్లు ప్రకటించడంతో ఈ సినిమా సడెన్‌గా ఓటీటీ బాట పట్టినట్లు తెలుస్తోంది. ఈయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ దాటి విజయం సాధించినట్లు గురువారం నాడు మేకర్స్ ప్రకటించడం విశేష్. అదేవిధంగా మే 10నన థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మే 17న అంటే 7 రోజుల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్‌కు రావడం ఇప్పుడు అందరిని అశ్చర్యానికి గురి చేస్తోంది.
ఇక సినిమా కథ విషయానికి వస్తే.. అనాథలైన ముగ్గురు స్నేహితులు భద్ర (సత్యదేవ్), శివ (కృష్ణ బూరుగుల), కోటి (లక్ష్మణ్) విజయవాడలోని ఓ బస్తీలో నివసిస్తూ ఉంటారు. భద్ర, కోటిలు గంజాయి, మాదక ద్రవ్యాల అక్రమరవాణా వంటి ఇల్లీగల్ పనులు చేస్తూ , శివ స్క్రీన్ ప్రింటింగ్ షాపు నిర్వహిస్తూ జీవిస్తుంటారు. అయితే శివ మీనా అనే ఓ అమ్మాయితో ప్రేమలో పడడంతో ముగ్గురు ఫ్రెండ్స్ ఇల్లీగల్ పనులు బంద్ చేసి పద్దతిగా జీవించాలని నిర్ణయించుకుంటారు. ఈ క్రమంలో మీనా తల్లికి వైద్యానికి డబ్బులు అవసరమవడంతో చివరిగా పాడేరు నుంచి విజయవాడకి మాదకద్రవ్యం అక్రమ రవాణాకి ఈ ముగ్గురూ ఫ్రెండ్స్ సిద్దమవుతారు.
ఈ నేపథ్యంలో ఓ చోట జరిగిన గొడవలో ఈ ముగ్గురి మిత్రులు మాదకద్రవ్యంతో పట్టుబడి అరెస్ట్ అవుతారు. అయితే ఏసీపీ (నందగోపాల్) వళ్ల తాము చేయని ఓ నేరంలో ఇరుక్కుని ఈ ముగ్గురు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఇక ఆ తర్వాత బయటకు వచ్చిన మిత్రులు ఏం చేశారనే కథకథనాలతో సినిమా అద్యంతం రివేంజ్ డ్రామాగా ఇంట్రెస్టింగ్ సాగుతుంది. ముఖ్యంగా సత్యవదేవ్ నటన బాగా ఆకట్టుకోవడమే కాక రియలిస్టిక్‌గా, సహజంగా చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి. ఇప్పుడీ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో (Amazon Prime Video) స్ట్రీమింగ్ అవుతోంది. ఎంచక్కా ఇంట్లోనే కూర్చోని ఈ వీకెండ్ ఈ సినిమాను ఎంజాయ్ చేయండి.