మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Rare Photo: రామోజీరావు.. ఈ రేర్ ఫొటో చూశారా?

ABN, Publish Date - Jun 08 , 2024 | 08:24 PM

మీడియా మొఘల్, ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు, ఎగ్జిబిటర్, స్టూడియో అధినేత చెరుకూరి రామోజీరావు మృతి అందరినీ కలచివేస్తోంది. ప్రతి ఒక్కరూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు చేస్తున్నారు. సినీ, రాజకీయ, పారిశ్రామిక వేత్తలు ఇలా ఎందరెందరో ఆయనకు నివాళులు అర్పిస్తూ.. రామోజీరావు చేసిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. ప్రస్తుతం రామోజీరావు‌కి సంబంధించి ఓ రేర్ ఫొటో వైరల్ అవుతోంది.

Rare Photo of Legends

మీడియా మొఘల్, ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు, ఎగ్జిబిటర్, స్టూడియో అధినేత చెరుకూరి రామోజీరావు (Cherukuri Ramoji Rao) మృతి అందరినీ కలచివేస్తోంది. ప్రతి ఒక్కరూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు (Rip Ramoji Rao) చేస్తున్నారు. సినీ, రాజకీయ, పారిశ్రామిక వేత్తలు ఇలా ఎందరెందరో ఆయనకు నివాళులు అర్పిస్తూ.. రామోజీరావు చేసిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. అలాగే ఆయన ఫొటోలను వైరల్ చేస్తున్నారు. ఇలా వైరల్ అవుతోన్న ఫొటోలలో ఒక ఫొటో అందరినీ ఆకర్షిస్తోంది. ఎందుకంటే ఈ ఫొటో అంత గొప్ప ఫొటో మరి.

Also Read- RamojiRao: రామోజీరావు.. ఆ కోరిక తీరకుండానే..!


ఎందుకంత గొప్ప ఫొటో అంటే.. ఇందులో లెజెండ్స్‌తో రామోజీరావు ఠీవీగా నిలబడి ఉన్నారు. ఇందులో మహామహులైన నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Ramarao), అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao), నడిగర్ తిలకం శివాజీ గణేశన్, ఎన్టీఆర్ తండ్రి లక్ష్మయ్య చౌదరి (Nandamuri Lakshmaiah Chowdary) వంటి వారు ఉండగా.. అక్కినేనికి, శివాజీ గణేశన్‌ (Sivaji Ganesan)కి మెడలో దండలు ఉన్నాయి. అంటే ఇదేదో సత్కార సమయమనేది అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో రామోజీరావుని చూసిన వారంతా.. ఆ తరం నుంచి ఈ తరం వరకు అందరినీ ఆయన ఎంతగానో అభిమానించేవాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Read Latest Cinema News

Read more!
Updated Date - Jun 08 , 2024 | 08:24 PM