మూర్ఖులను గెలవలేము

ABN, Publish Date - Jul 30 , 2024 | 04:30 AM

ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలను అభిమానులతో పంచుకున్న సమంత వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. తాజాగా నయనతారకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. తనకు ఆసక్తిగా అనిపించిన పలు విషయాలను...

ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలను అభిమానులతో పంచుకున్న సమంత వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. తాజాగా నయనతారకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. తనకు ఆసక్తిగా అనిపించిన పలు విషయాలను సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో ఆమె మందార పువ్వులతో చేసిన టీ అంటే తనకు ఎంతో ఇష్టమని ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో తెలిపారు. దీనివల్ల రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు పలు దీర్ఘ కాలిక వ్యాధుల నుంచి ఉపశమనం దొరుకుతుందని నయనతార పేర్కొన్నారు. ఫాలోవర్స్‌ను నయనతార తప్పుదోవ పట్టిస్తున్నారని, ఆమె చెప్పినదాంట్లో నిజం లేదని కొంతమంది వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆమె తన పోస్ట్‌ను తొలగించారు. ‘మూర్ఖులతో వాదనకు దిగొద్దు. మీరు గెలవలేరు. మిమ్మల్న కూడా వారి స్థాయికి దిగజార్చి ఓడిస్తారు’ అనే మార్క్‌ ట్వైన్‌ సూక్తిని షేర్‌ చేశారు. తనను విమర్శించిన వారిని ఉద్దేశించి ఆమె ఈ పోస్ట్‌ పెట్టారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Jul 30 , 2024 | 09:37 AM