చిక్కుల్లో ‘జైలర్‌’ దర్శకుడి సతీమణి

ABN, Publish Date - Aug 21 , 2024 | 01:26 AM

ఇటీవల జరిగిన బీఎస్పీ తమిళనాడు శాఖ అధ్యక్షుడు ఆర్మ్‌ స్ట్రాంగ్‌ హత్య కేసులో ‘జైలర్‌’ చిత్ర దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ సతీమణి మోనీషాను నగర పోలీసులు విచారిస్తున్నారు....

ఇటీవల జరిగిన బీఎస్పీ తమిళనాడు శాఖ అధ్యక్షుడు ఆర్మ్‌ స్ట్రాంగ్‌ హత్య కేసులో ‘జైలర్‌’ చిత్ర దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ సతీమణి మోనీషాను నగర పోలీసులు విచారిస్తున్నారు. ఈ హత్య కేసు విచారణలో భాగంగా ఇప్పటికే 23 మందిని అరెస్టు చేయగా, ఓ నిందితుడు పోలీస్‌ ఎన్‌కౌంటరులో ప్రాణాలు కోల్పోయాడు. ఇందులోభాగంగా, పేరుమోసిన రౌడీ మొట్టై రాజేంద్రన్‌ ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొట్టై రాజేంద్రన్‌ దేశం విడిచి పారిపోయినట్టు సమాచారం. ఆయన పారిపోయేముందు మోనీషాతో పలుమార్లు ఫోన్‌లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించడంతో ఆమె చిక్కుల్లో పడ్డారు.

చెన్నై, (ఆంధ్రజ్యోతి)

Updated Date - Aug 21 , 2024 | 10:34 AM