Bigg Boss 8 Telugu: టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు.. బిగ్ బాస్‌లో ఆ పర్వం మొదలైంది

ABN, Publish Date - Nov 28 , 2024 | 04:26 PM

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 చివరి ఘట్టానికి చేరుకుంది. ప్రస్తుతం 13 వీక్‌కి చేరుకున్న ఈ షో డిసెంబర్ 15తో ఎండ్ కాబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే డిసెంబర్ 15న జరిగే గ్రాండ్ ఫినాలేకు ఉండే టాప్ 5 కంటెస్టెంట్స్‌‌ ఎవరనే దానిపై ఓ రేంజ్‌లో చర్చలు నడుస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

Bigg Boss Telugu Season 8

బిగ్ బాస్ సీజన్ 8 ఆఖరి పర్వానికి చేరుకుంది. గతవారం యష్మీ ఎలిమినేషన్ తర్వాత.. ఒక్కసారిగా బిగ్ బాస్ టాప్ 5 కంటెస్టెంట్ లెక్కలు తారుమారయ్యాయి. ఎందుకంటే, కచ్చితంగా టాప్ 5లో యష్మీ ఉంటుందని అనుకుంటే.. అనూహ్యంగా ఆమెను బిగ్ బాస్ ఎలిమినేట్ చేశారు. దీంతో ఇప్పుడు కచ్చితంగా టాప్ 5 కంటెస్టెంట్స్‌లో ఉంటామని అనుకుంటున్న హౌస్ మేట్స్‌లోనూ, ఈ షోనూ ఫాలో అయ్యే వారిలోనూ టెన్షన్ మొదలైంది. అలాగే ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న వారి లిస్ట్ కూడా.. టాప్ 5 కంటెస్టెంట్ అనుకున్న మరొకరిని ఎలిమినేట్ చేస్తుంది కాబట్టి.. అసలు సిసలైన ఉత్కంఠ ఇకపై ఉండబోతుందనేలా బిగ్ బాస్‌ ఈ షోని మార్చేశారు.

ఈ వారంలో నామినేషన్స్‌లో ఉంది ఎవరంటే..

బిగ్ బాస్ హౌస్‌లో ప్రస్తుతం టికెట్ టు ఫినాలే రేస్ జరుగుతోన్న విషయం తెలిసిందే. దీంతో ఇంటిలోని సభ్యులు ఒకరిని మించి ఒకరు గేమ్ స్టార్ట్ చేశారు. ఈ రేసులో మొదటి కంటెండర్‌గా ఇప్పటికే రోహిణి నిలిచింది. దీని కోసం ఆమె చేసిన ప్రయత్నాన్ని, ఆడిన గేమ్‌ని షో చూస్తున్న వారు కూడా ప్రశంసించడం విశేషం. ఈ వారం యష్మీ వెళుతూ వెళుతూ గౌతమ్‌పై బిగ్ బాంబ్ పేల్చగా.. ‘రంగుపడుద్ది’ కాన్సెప్ట్‌లో ఎలిమినేషన్‌కు నామినేట్ అయిన వారిలో విష్ణుప్రియ, నిఖిల్, పృథ్వీ వంటి వారంతా డేంజర్ జోన్‌లో ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి వీరిలో ఎవరు ఈ వారం బయటికి వెళ్లిపోతారనేది తెలియాలంటే నాగ్ ఆగమనం వరకు వేచి చూడాల్సిందే. ఇప్పటి వరకు ఈ సీజన్‌లో ఎలిమినేట్ అయిన వారి లిస్ట్ చూస్తే.. బెజవాడ బేబక్క, శేఖర్ బాషా, నవీన్, సోనియా, ఆదిత్య ఓం, నైనిక, సీత, నాగ మణికంఠ, మెహబూబ్, నయనీ పావనీ, గంగవ్వ, హరితేజ, యష్మీ. నెక్స్ట్ ఈ లిస్ట్‌లో ఎవరు చేరబోతున్నారో..

Also Read-ప్రభాస్ లాంటి కొడుకు కావాలి: ‘దేవర’ మదర్


బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 15న జరగబోతోందని తెలుస్తుంది. ఇప్పటికే గ్రాండ్ ఫినాలేకు సంబంధించి యాజమాన్యం కసరత్తులు మొదలెట్టినట్లుగా టాక్ నడుస్తోంది. కొత్త కొత్త ట్విస్ట్‌లను గేమ్‌లలో పెడుతూ.., ప్రైజ్ మనీని మరింతగా పెంచడానికి ట్రై చేస్తున్నట్టుగా సమాచారం. ఇప్పటికే ప్రైజ్ మనీ రూ. 50 లక్షలు అనేలా ఓ వార్త బయటికి రాగా.. ఈ ప్రైజ్ మనీని డబుల్ చేసుకునే అవకాశం కూడా కంటెస్టెంట్స్‌కే బిగ్ బాస్ ఇచ్చారు. కాబట్టి.. ఫైనల్ డే కి ఈ ప్రైజ్ మనీ ఎంత ఉంటుందనేది అంచనా వేయడం కూడా కష్టం. అదంతా కంటెస్టెంట్స్ చేతుల్లోనే ఉంది.

Also Read-సిద్ధార్ద్, అదితి రావ్ హైదరి మళ్లీ పెళ్లి.. ఇదేం ట్విస్ట్! ఫొటోలు వైరల్

Also Read-Akkineni Family: ఒకవైపు నాగచైతన్య పెళ్లి.. మరో వైపు అఖిల్ నిశ్చితార్థం

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 28 , 2024 | 04:26 PM