మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hema-Maa: నటి హేమ‌ అరెస్ట్..‌ ‘మా’ యాక్షన్ ఎప్పుడు?

ABN, Publish Date - Jun 03 , 2024 | 09:20 PM

‘మా’ సభ్యురాలైన హేమ ఇప్పుడు డ్రగ్స్ విషయంలో అరెస్ట్ అయిన నేపథ్యంలో ‘మా’ ఎటువంటి యాక్షన్ తీసుకోబోతోంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇటీవల బెంగుళూరు‌లో జరిగిన రేవ్ పార్టీలో డ్రగ్స్ సేవించినట్లు పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో, నటి హేమను బెంగుళూరు పోలీసులు సోమవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

Manchu Vishnu and Hema

‘మా’ (Maa) సభ్యురాలైన హేమ (Hema) ఇప్పుడు డ్రగ్స్ విషయంలో అరెస్ట్ అయిన నేపథ్యంలో ‘మా’ ఎటువంటి యాక్షన్ తీసుకోబోతోంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇటీవల బెంగుళూరు‌లో జరిగిన రేవ్ పార్టీలో డ్రగ్స్ సేవించినట్లు పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో, నటి హేమను బెంగుళూరు పోలీసులు సోమవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ పార్టీ (Bengaluru Rave Party)లో తాను లేనని తొలుత హేమ బుకాయిస్తూ.. హైదరాబాద్‌లో ఉన్నానంటూ ఓ వీడియోను విడుదల చేసినా.. ఆమె ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఈ పార్టీకి 73 మంది పురుషులు, 30 మంది మహిళలు హాజరయ్యారని, అందులో హేమ‌ కూడా ఉందని పోలీసులు ఆమె పేరు ప్రత్యేకంగా వెల్లడించారు. ఇందులో 59 మంది పురుషుల, 27 మంది మహిళల రక్త నమూనాలు పాజిటివ్‌గా పరీక్షించారు. మొత్తంమీద, 103 మంది వ్యక్తులలో 86 మందికి పాజిటివ్ అని తేలినట్లుగా వెల్లడైంది. (Actress Hema Arrested)

Also Read- Anjali: బాలయ్య నన్ను ఎందుకు నెట్టారో నాకు తెలుసు.. అనవసరంగా పెద్దది చేశారు

ఈ కేసు విచారణ నిమిత్తం, హేమకు నోటీసులు ఇచ్చినా.. అనారోగ్య కారణాలను హేమ సాకుగా చెప్పి, విచారణకు హాజరు కాలేదు. సోమవారం బెంగుళూరు పోలీసులు హెబ్బగోడి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ వినియోగించిన కేసులో హేమను అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల కోసం‌ ఆమెను హాస్పిటల్‌కు కూడా తరలించారు. ఈ నేపథ్యంలో హేమపై మరోసారి వార్తలు వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఆమెపై ‘మా’ ఎటువంటి యాక్షన్ తీసుకోబోతోంది అనేలా అప్పుడు టాలీవుడ్‌లో టాక్ మొదలైంది.


ఇదిలా ఉండగా విచారణ నిమిత్తం హేమను 7 రోజుల పాటు పోలీసులు కస్టడీ కోరే అవకాశం ఉందని సమాచారం.‌ ఇక ఈ కేసులో హేమపై అరోపణలు నిరూపితమైతే.. పోలీసులు ఇచ్చిన ఆధారాలకు అనుగుణంగా మా అసోసియేషన్ యాక్షన్ తీసుకుంటుందని గతంలో మా‌ అధ్యక్షుడు (Maa President) విష్ణు ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. మరీ హేమ డ్రగ్స్ తీసుకుందన్నది నిజం.. దాన్ని ఆమెకు ఎవరిచ్చారనే దానిపైనే పోలీసులు విచారణ జరగనుంది.‌ రేవ్ పార్టీ ఆర్గనైజర్స్ ఎవరనే దానిపై కూడా క్లారిటి రావాల్సి ఉంది. మరోపక్క డ్రగ్స్‌‌ను రూపుమాపాలంటూ అప్పట్లో ‘మా’ కమిటీ పోలీసులను కలిసింది.‌ అలాంటిది ‘మా’ సభ్యురాలైన (Maa Member) హేమ ఇప్పుడు డ్రగ్స్ తీసుకుందని తేలడంతో.. హేమ చేసిన తప్పుపై మంచు విష్ణు (Manchu Vishnu) ఇంతకముందు తాను చెప్పినట్లుగా యాక్షన్ ఎప్పుడు తీసుకుంటారు.‌ ఏ విధంగా తీసుకుంటారనే చర్చ మొదలైంది.

Read Latest Cinema News

Updated Date - Jun 03 , 2024 | 09:20 PM