వయనాడ్ విలయం... సినీతారల సాయం
ABN, Publish Date - Aug 04 , 2024 | 03:54 AM
కేరళ సీఎం సహాయక నిధికి రూ. 25 లక్షల సాయం అందించిన మలయాళ నటుడు మోహన్‌లాల్ సహాయక చర్యల్లో సైతం పాల్గొని తన గొప్ప మనసు చాటుకున్నారు. టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్‌గా...
కేరళ సీఎం సహాయక నిధికి రూ. 25 లక్షల సాయం అందించిన మలయాళ నటుడు మోహన్‌లాల్ సహాయక చర్యల్లో సైతం పాల్గొని తన గొప్ప మనసు చాటుకున్నారు. టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్‌గా కొనసాగుతున్న ఆయన ఆ హోదాలో దగ్గరుండి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. వయనాడ్‌లోని ఆర్మీ బేస్ క్యాంప్‌లో ఆయన సైనికులను కలిశారు. తాత్కాలిక బ్రిడ్జిల నిర్మాణం లాంటి కార్యక్రమాల్లో సైనికులతో కలసి పాల్గొన్నారు. ‘మీరు రీల్ హీరో కాదు రియల్ హీరో’ అంటూ నెటిజన్లు మోహన్‌లాల్‌ను ప్రశంసిస్తున్నారు.
నటీనటుల విరాళాలు
భారీ వరదలు, కొండ చరియలు విరిగిపడి తీవ్రంగా నష్టపోయిన వయనాడ్ ప్రాంతంలో సహాయ, పునరావాస కార్యక్రమాలకు తమవంతు సాయం అందించేందుకు తారాలోకం నడుంకట్టింది. పలువురు నటీనటులు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు ఇస్తున్నారు. టాలీవుడ్ కథానాయిక రష్మిక మందన్న రూ. 10 లక్ష లు, నిర్మాత సూర్యదేవర నాగవంశీ రూ. 5 లక్షలు విరాళంగా ఇచ్చారు. తమిళ నటులు సూర్య, కార్తి, జ్యోతిక కలిసి రూ. 50 లక్షలు ఇవ్వగా, కమల్‌హాసన్ రూ. 25 లక్షలు, విక్రమ్ రూ. 20 లక్షలు ఇచ్చారు. దుల్కర్ సల్మాన్ రూ. 10 లక్షలు, మమ్ముట్టి రూ. 15 లక్షలు, ఫహద్‌ఫాజిల్, నజ్రియా దంపతులు రూ. 25 లక్షలు విరాళంగా అందించారు.