Vishwak Sen: టాలెంట్ ఎవరి సొత్తూ కాదు.. అవకాశం వదలొద్దు

ABN, Publish Date - Aug 15 , 2024 | 08:02 PM

టాలెంట్ ఎవరి సొత్తూ కాదని, క్రియేటివిటీ కలిగిన ప్రతి ఒక్కరికీ సోషల్ మీడియా పట్టం కడుతుందని అన్నారు మాస్ కా దాస్ విశ్వక్‌సేన్. హైదరాబాద్‌కు తలమానికంగా భాసిల్లుతున్న ‘థ్రిల్ సిటీ - అమ్యూజ్మెంట్ థీమ్ పార్క్’.. సోషల్ మీడియా ప్రభావాశీలుర టాలెంట్‌కు సవాలు విసిరింది. ఈ ఛాలెంట్ ఈవెంట్ కర్టెన్ రైజర్ కార్యక్రమానికి విశ్వక్‌సేన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

Vishwak Sen at Thrill City Theme Park Event

టాలెంట్ ఎవరి సొత్తూ కాదని, క్రియేటివిటీ కలిగిన ప్రతి ఒక్కరికీ సోషల్ మీడియా పట్టం కడుతుందని అన్నారు మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ (Vishwak Sen). హైదరాబాద్‌కు తలమానికంగా భాసిల్లుతున్న ‘థ్రిల్ సిటీ - అమ్యూజ్మెంట్ థీమ్ పార్క్’.. (Thrill City Theme Park) సోషల్ మీడియా ప్రభావాశీలుర టాలెంట్‌కు సవాలు విసిరింది. అసాధారణమైన, అద్భుతమైన అనేక విశేషాల సమాహారంగా ఇంటిల్లిపాదినీ అలరిస్తున్న ‘థ్రిల్ సిటీ - థీమ్ పార్క్’లోని ఫన్ గేమ్స్, అడ్వెంచర్ గేమ్స్, హార్రర్ మేజ్, 12D థియేటర్ లాంటి వందలాది యాక్టివిటీస్‌ని బేస్ చేసుకుని షూట్ చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో రీల్స్‌ నుంచి అత్యుత్తమమైన వీడియో రీల్స్ మూడింటిని ఎంపిక చేసి, తలా లక్ష రూపాయల చొప్పున మూడు లక్షల నగదు బహుమతులను అందించే బృహత్ కార్యక్రమానికి తెర తీసింది. యంగ్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేసే ‘థ్రిల్లింగ్ ఇన్ఫ్లేన్సర్ చాలెంజ్’ ఈవెంట్ కర్టెన్ రైజర్ వేడుకకు ముఖ్య అతిధిగా విశ్వక్‌సేన్ హాజరయ్యారు. (Thrill City Social Media Influencers Challenge Curtain Raiser Event)

Also Read- Thangalaan Review: ‘బంగారం’లాంటి సినిమా..

ఈ కార్యక్రమంలో విశ్వక్‌సేన్ (Mass ka Dass Vishwak Sen) మాట్లాడుతూ.. ఈరోజున సోషల్ మీడియాపై ఆధారపడని వ్యవస్థ, వ్యాపార రంగమంటూ ఏదీ లేదు. టాలెంట్ ఎవరి సొత్తూ కాదు.. క్రియేటివిటీ కలిగిన ప్రతి ఒక్కరికీ సోషల్ మీడియా పట్టం కడుతుంది. మీ టాలెంట్‌కి వచ్చిన ఈ అవకాశాన్ని వదులుకోకండి. ఇందులోకి కొత్తగా ప్రవేశించేవాళ్ళు కూడా బ్రహ్మాండంగా రాణించవచ్చు. అంతా మీ చేతుల్లోనే ఉందని పిలుపునిచ్చారు.


‘థ్రిల్ సిటీ’ సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్స్ ఛాలెంజ్ ఈవెంట్ కి కో-ఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్న ‘బందూక్’ లక్ష్మణ్ (Bandook Lakshman) మాట్లాడుతూ... మూడు విభాగాల్లో ముగ్గురు విజేతలను ఎంపిక చేసి, ప్రముఖ దర్శకుల సమక్షంలో జరిగే వేడుకలో లక్ష రూపాయల చొప్పున నగదు బహుమతి అందిస్తాము. ఇటువంటి కార్యక్రమాలను ఇకపై కూడా కొనసాగిస్తాం. యంగ్ టాలెంట్‌ని ఎంకరేజ్ చేస్తామని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో థ్రిల్ సిటీ టీమ్ ఫీయాక్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ స్వీకర్‌తో పాటు హైదరాబాద్ వ్యాప్త సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్స్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Read Latest Cinema News

Updated Date - Aug 15 , 2024 | 08:02 PM