Arvind Krishna: హీరో అరవింద్‌ కృష్ణ వీగన్‌ లైఫ్‌స్టైల్‌కి అరుదైన గుర్తింపు

ABN, Publish Date - Jul 10 , 2024 | 09:56 PM

‘ఏ మాస్టర్‌పీస్‌: రెయిజ్‌ ఆఫ్‌ సూపర్‌హీరో’ చిత్ర హీరో అరవింద్‌ కృష్ణను ‘వీగన్‌ వాయిస్‌ ఆఫ్‌ ఇండియా’ పురస్కారం వరించింది. ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ ‘శుక్ర’, ‘సిట్‌’ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నటుడు అరవింద్‌ కృష్ణ. ఆయన రీసెంట్‌ చిత్రం ‘సిట్‌’ గత ఎనిమిది వారాలుగా ఓటీటీలో ట్రెండింగ్‌లో ఉంది. విజయవంతమైన ప్రాజెక్టులతోనే కాదు, వీగన్‌ లైఫ్‌స్టైల్‌తోనూ నిత్యం వార్తల్లో ఉంటారు హీరో అరవింద్‌ కృష్ణ.

Jacqueline Fernandez and Arvind Krishna

‘ఏ మాస్టర్‌పీస్‌: రెయిజ్‌ ఆఫ్‌ సూపర్‌హీరో’ చిత్ర హీరో అరవింద్‌ కృష్ణ (Arvind Krishna)ను ‘వీగన్‌ వాయిస్‌ ఆఫ్‌ ఇండియా’ (Vegan Voice of India) పురస్కారం వరించింది. ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ ‘శుక్ర’, ‘సిట్‌’ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నటుడు అరవింద్‌ కృష్ణ. ఆయన రీసెంట్‌ చిత్రం ‘సిట్‌’ గత ఎనిమిది వారాలుగా ఓటీటీలో ట్రెండింగ్‌లో ఉంది. విజయవంతమైన ప్రాజెక్టులతోనే కాదు, వీగన్‌ లైఫ్‌స్టైల్‌తోనూ నిత్యం వార్తల్లో ఉంటారు హీరో అరవింద్‌ కృష్ణ. గత కొన్నేళ్లుగా ఆయన అనుసరిస్తున్న వీగన్‌ లైఫ్‌స్టైల్‌కి అరుదైన గుర్తింపు దక్కింది. తాజాగా ఆయన ‘వీగన్‌ వాయిస్‌ ఆఫ్‌ ఇండియా’ పురస్కారాన్ని అందుకున్నారు. గత రెండేళ్లుగా ఆయన వీగనరీ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ముంబైలో జరిగిన వీగన్‌ ఇండియా కాన్ఫెరెన్స్‌లోనూ పార్టిసిపేట్‌ చేశారు. అరవింద్‌ కృష్ణతో పాటు బాలీవుడ్‌ నటి జాక్వలిన్‌ ఫెర్ఫాండెస్‌ (Jacqueline Fernandez) కూడా ఆ కాన్‌క్లేవ్‌లో ప్యానలిస్టుగా వ్యవహరించారు. ఈ క్రమంలో వీగన్‌ జీవన శైలికి సంబంధించి ఇద్దరూ తమ ఆలోచనలను కలబోసుకున్నారు. అరవింద్‌ కృష్ణను ‘వీగన్‌ వాయిస్‌ ఆఫ్‌ ఇండియా’ పురస్కారంతో సత్కరించారు. (A Masterpiece Actor Arvind Krishna)


‘వీగనిజమ్‌ (Veganism) నేను నమ్మే సిద్ధాంతం’ అని అన్నారు అరవింద్‌ కృష్ణ. ఆయన మాట్లాడుతూ ‘‘ఈ పురస్కారాన్ని బాధ్యతతో స్వీకరిస్తున్నాను. నేను నమ్మిన సిద్ధాంతాన్ని ఇష్టంగా, మరింత సమర్థవంతంగా ఆచరించడానికి, నలుగురికీ పంచడానికి ఈ పురస్కారం నాలో బలమైన స్ఫూర్తి పంచుతోంది’’ అని అన్నారు. వీగనిజం నాకు అన్ని విధాలా ఉపయోగపడుతోంది. నా శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ అందుతున్నాయి. గతంతో పోలిస్తే నేను శ్వాసించే విధానంలోనూ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. మంచి ఆలోచనలు చేయగలుగుతున్నాను. ప్రతి విషయాన్ని నిశితంగా పరిశీలించగలుగుతున్నాను. దీని వల్ల కథలను ఎంపిక చేసుకోవడం కూడా సులువవుతోందని చెప్పుకొచ్చారు అరవింద్‌ కృష్ణ. నటుడిగా కెరీర్‌ని కొనసాగిస్తున్న హీరోల్లో ఏకైక బాస్కెట్‌ బాల్‌ ప్లేయర్‌గానూ ఆయనకు అరుదైన గుర్తింపు ఉంది.

Updated Date - Jul 10 , 2024 | 09:56 PM