బంతి భోజనం కార్యక్రమంలో ‘వీరాంజనేయులు విహారయాత్ర’ టీమ్ హల్చల్

ABN, Publish Date - Aug 15 , 2024 | 11:57 PM

ప్రీమెచ్యూర్ బేబీస్ ఆరోగ్యం కోసం అకాన్ రెస్టో బార్, ఎక్స్‌ట్రా మైల్ సంయుక్తంగా నిర్వహించిన బంతి భోజనం కార్యక్రమంలో ‘వీరాంజనేయులు విహారయాత్ర’ టీమ్ హల్చల్ చేసింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సమాజం పట్ల బాధ్యతను గుర్తు చేసేలా ఏర్పాటు చేసిన అరుదైన కార్యక్రమం ఒక వైపు, సాంప్రదాయ రుచులను అందిస్తూ మరోవైపు సామాజిక బాధ్యతను గుర్తు చేసేలా ఉందని ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మిసెస్ ఇండియా (2004 ), వ్యాపారవేత్త, శిల్పా రెడ్డి అన్నారు.

ప్రీమెచ్యూర్ బేబీస్ ఆరోగ్యం కోసం అకాన్ రెస్టో బార్, ఎక్స్‌ట్రా మైల్ సంయుక్తంగా నిర్వహించిన బంతి భోజనం కార్యక్రమంలో ‘వీరాంజనేయులు విహారయాత్ర’ టీమ్ (Veeranjaneyulu Vihara Yatra Team) హల్చల్ చేసింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సమాజం పట్ల బాధ్యతను గుర్తు చేసేలా ఏర్పాటు చేసిన అరుదైన కార్యక్రమం ఒక వైపు, సాంప్రదాయ రుచులను అందిస్తూ మరోవైపు సామాజిక బాధ్యతను గుర్తు చేసేలా ఉందని ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మిసెస్ ఇండియా (2004 ), వ్యాపారవేత్త, శిల్పా రెడ్డి అన్నారు. ఇంకా ఆమె మాట్లాడుతూ.. మన చుట్టూ ఉన్న సమాజానికి మన వంతు సహాయం అందించడం చాలా గొప్ప విషయం. అకాన్ రెస్టో బార్ వినూత్న రీతిలో బంతి భోజనాలు ఏర్పాటు చేయడం చాలా మంచి ఆలోచన. దక్షిణాది వంటలతో ఏర్పాటు చేసిన ఈ విందు ఆరగించి తమకు తోచినంత ఇవ్వడం అనేది అద్భుతమైన ఆలోచన. ఈ విధానం మన సంస్కృతికి అద్దం పడుతుంది. కడుపునిండా తినండి.. మీకు తోచినంత చెల్లించండి అనేది మనలోని దయా గుణాన్ని పెంచేలా ఉంది. మన దేశంలో మనం గర్వపడే విషయాలు చాలా ఉన్నాయి. మన గురించి మనమే ఆలోచించుకుంటున్నామా మన కుటుంబానికే కాకుండా మనతోటి మనుషులకు, జీవజాతికి మనకు తోచిన చిన్న సహాయం అయినా చేయగలుగుతున్నామా అన్నది ఆలోచించాలి. మనం చేసే చిన్న సహాయం అయినా ఎంతో పెద్ద ప్రయోజనం చేకూర్చుతుంది. బుద్ది జీవులుగా మనం ఎన్నో రకాలుగా సహాయం అందించవచ్చు. అకాన్, నెలలు నిండకుండా పుట్టిన పిల్లల కోసం, వారికి వచ్చే అనారోగ్య సమస్యలకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ‘ఎక్స్‌ట్రా మైల్’ వారి కృషి అభినందనీయం"అని శిల్పా రెడ్డి అన్నారు.

‘వీరాంజనేయులు విహారయాత్ర’ (Veeranjaneyulu Vihara Yatra) హీరో రాగ్ మయూర్ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర దినోత్సవం రోజు మన సంస్కృతి సంప్రదాయాలు గుర్తుకు తీసుకువచ్చేలా ఒక మంచి కార్యక్రమాన్ని అకాన్ రెస్టో బార్, ఎక్స్ ట్రా మైల్ వారు కలిసి నిర్వహించడం సంతోషంగా ఉంది. ఆరోగ్యకరమైన ఆహారం అందించి సమాజం పట్ల మన బాధ్యతను గుర్తు చేసేలా అరుదైన కార్యక్రమాన్ని నిర్వహిచడం అభినందనీయమని అన్నారు. హీరోయిన్ ప్రియా వడ్లమాని మాట్లాడుతూ.. చిన్నారులకు వైద్య చికిత్స అందించేందుకు ఏర్పాటు చేసిన ఈ బంతి భోజనం ఆలోచన ఎంతో గొప్పగా ఉందని కొనియాడారు.

Also Read- Mr Bachchan Review: ర‌వితేజ.. మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ ఎలా ఉందంటే?


నెలలు నిండకుండా పుట్టిన పిల్లల కోసం, వారికి వచ్చే అనారోగ్య సమస్యలను కోసం అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ‘ఎక్స్‌ట్రా మైల్’ పనిచేస్తుందని ఆ సంస్థ వ్యవస్థాపకురాలు డాక్టర్ నితీష చెప్పారు. నెలలు నిండకుండా పుట్టిన పిల్లల కోసం మూడు సంవత్సరాల క్రితం ఎక్స్ ట్రా మైల్ ఆర్గనైజేషన్‌ను ప్రారంభించి వాళ్ళకి అవసరమైన వైద్యచికిత్సను అందించడానికి ఆర్థిక సహాయాన్ని ఈ సంస్థ ద్వారా అందిస్తున్నామన్నారు. ఇప్పటివరకు 197 మంది ప్రీమెచ్యూర్ బేబీస్‌కి ఆర్థిక సహాయం అందించి వారిని అనారోగ్య సమస్యల నుంచి కాపాడమని ఆమె తెలిపారు.

చిన్నారుల వైద్య చికిత్స కోసం అవసరమైన నిధుల సేకరణలో భాగంగా ఎక్స్‌ట్రా మైల్ సంస్థతో కలిసి బంతి భోజన కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందని అకాన్ రెస్టో బార్ నిర్వాహకులు జి. నాగేశ్వర్ రెడ్డి, జి. నీహాల్ రెడ్డి అన్నారు. ఆనందదాయకమైన సంగీతం వింటూ ఆరోగ్యకరమైన ఆహారం తింటూ తమ వంతు బాధ్యతగా సమాజానికి చిరు సహాయం అందించడం అనేది గొప్ప అనుభూతిని అందించాలన్నారు.  ఈ స్వాతంత్య్ర దినోత్సవం రోజు అకాన్ రెస్టో బార్‌లో అవసరార్థులకు అండగా నిలుస్తూ, వారిలో స్వేచ్ఛా స్ఫూర్తిని నింపే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. మా అతిథుల్లో ప్రతి ఒక్కరూ అవసరమైన వారి జీవితాల్లో స్పష్టమైన మార్పును తీసుకురావడానికి సహాయం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని ప్లాన్ చేస్తున్నామని నిహాల్ రెడ్డి గుర్రాల అన్నారు.

Read Latest Cinema News

Updated Date - Aug 15 , 2024 | 11:57 PM