Chiranjeevi: పద్మవిభూషణుడికి ఉపాసన అభినందన సభ.. హాజరైన తెలంగాణ సీఎం
ABN, Publish Date - Feb 03 , 2024 | 11:14 PM
మెగాస్టార్ చిరంజీవి.. హీరోగానే కాదు వ్యక్తిత్వంలోనూ నెంబర్ వన్. ఆ విషయం ఇప్పుడు దేశానికి తెలిసింది. తనకు దేశంలోనే అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌తో కేంద్ర ప్రభుత్వం గౌరవించిన విషయం తెలిసిందే. ఈ పురస్కారం మెగాస్టార్‌కి వచ్చిందని తెలిసి.. సినీ, రాజకీయ ప్రముఖులెందరో ఆయనని అభినందించారు.. అభినందిస్తూనే ఉన్నారు. తన మామగారికి పద్మవిభూషణ్ పురస్కారం వరించిన సందర్భంగా మెగా కోడలు ఉపాసన.. తన నివాసంలో అభినందన సభను నిర్వహించి గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశారు.

ఈ అభినందన సభకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ‘చిరంజీవికి అవార్డు రావడం మనందరికీ గర్వకారణం.. ఆయనకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని తెలిపారు.
తనని అభినందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మెగాస్టార్ చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
====================
*Love Guru: శోభనం రోజు.. భర్త ఎదురుగానే భార్య ఏం చేస్తుందో చూశారా!
**************************
*Natti Kumar: గద్దర్ పేరుతో అవార్డ్స్ ఇవ్వడం సినిమా వారికి ఇష్టం లేదా?
**********************
*Operation Valentine: వరుణ్ తేజ్ సినిమా విడుదల తేదీలో మార్పు.. ఎప్పుడంటే?
**************************
*Natti Kumar: ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ని అందుకే రీ రిలీజ్ చేస్తున్నాం
**************************
*‘సప్త సాగరాలు దాటి’ డైరెక్టర్ తదుపరి చిత్ర హీరో ఎవరంటే?
**************************
*Chiranjeevi: ఎల్‌కే అద్వానీకి ‘భారతరత్న’.. మెగాస్టార్ స్పందనిదే..
*************************