దుమ్మురేపిన ఉపేంద్ర.. 'యూఐ' ట్విట్టర్ రివ్యూ
ABN, Publish Date - Dec 20 , 2024 | 10:03 AM
కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన 'యూఐ' సినిమా టాక్ ఎలా ఉందంటే ..
ఎన్నో అంచనాల మధ్య నేడు రిలీజైన ఉపేంద్ర 'యూఐ' సినిమాకి అన్ని చోట్ల నుండి పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. రిలీజ్‌కి ముందే ఆడియెన్స్ ఇంటరాక్షన్‌లో సవాళ్లు విసిరిన ఉపేంద్ర థియేటర్‌లో ఫస్ట్ డిస్క్లైమర్‌తోనే అందరి మైండ్‌లను బ్లో చేశాడు. ఇంతకీ ఉపేంద్ర ఇంటిలిజెన్స్ (UI) ఎంత వరకు వర్క్ అవుట్ అయ్యింది? ఫ్యాన్స్, కామన్ ఆడియెన్స్ ఏమనుకుంటున్నారంటే..
ఈ సినిమాకి అన్ని చోట్ల నుండి బ్లాక్ బస్టర్ టాక్ వినిపిస్తుంది. 'యూ అండ్ ఐ', 'పగలు, రాత్రి' సత్య(ఉపేంద్ర) వర్సెస్ కల్కి భగవాన్ కాన్సెప్ట్ తో ఈ మూవీ సాగుతుంది. హీరోగా ఉపేంద్ర వన్ మ్యాన్ షో చూపించాడని ఆడియెన్స్ అంటున్నారు. డైరెక్టర్ గాను ఉప్పి తన డిఫరెంట్ టేకింగ్ తో వింటేజ్ ఉపేంద్రని చూపించాడు అంటున్నారు.
మరికొందరు రొటీన్, మసాలా సినిమాలు వస్తున్న వేళా ప్రస్తుతం ప్రపంచం పేస్ చేస్తున్న రియల్ ప్రాబ్లమ్స్ బేస్డ్ గా హార్డ్ హిట్టింగ్ మూవీ తెరకెక్కించిన ఉపేంద్రకి సెల్యూట్ చేస్తున్నారు.
థియేటర్ లో ఫస్ట్ డిస్క్లైమర్ మాత్రం 'మీరు ఇంటిలిజెంట్ అనుకుంటే.. వెంటనే థియేటర్ నుండి బయటకి వెళ్ళండి' అంటూ వేశారు క్లాసిక్ ఉపేంద్ర. మరోవైపు అతికొందరు మాత్రం మిక్స్‌డ్ రివ్యూలు ఇస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఒరిజినల్ రివ్యూ రావడానికి మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే. రియల్ టైమ్ ప్రాబ్లమ్స్ తో హార్డ్ హిట్టింగ్ ఫ్యాక్ట్స్ తో తెరకెక్కి సినిమాలు చాలా అరుదు, ఇంకా ఇండియాలో దశాబ్దానికి ఒకటి రావడమే మహా అరుదు. కాబట్టి 'యూఐ' మూవీ ఈజ్ ఏ మస్ట్ ట్రై.