Lakshmi Manchu: టీచ్ ఫర్ ఛేంజ్ ఫ్యాషన్ షో లో మెరిసిన టాలీవుడ్ తారలు
ABN, Publish Date - Feb 12 , 2024 | 05:18 PM
ప్రతి సంవత్సరం మంచు లక్ష్మి ఆధ్వర్యంలో పేద విద్యార్థుల చదువుల కోసం నిధుల సమీకరణకు ఏర్పాటు చేసే ఫ్యాషన్ షో లో ఈసారి షో స్టాపర్లుగా నిలిచిన శ్రుతి హాసన్, శ్రియా శరణ్ మరియు హర్షవర్ధన్
ప్రముఖ సిననటి లక్ష్మీ మంచు ఆధ్వర్యంలో పేద విద్యార్థుల చదువులకు నిధుల సమీకరణ కోసం ప్రతి ఏటా నిర్వహించే టీచ్ ఫర్ ఛేంజ్ ఫ్యాషన్ షో మరోసారి నగర వాసులకు కనువిందు చేసింది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో నిధుల సమీకరణ కోసం ఈ ఫ్యాషన్ షో ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఈ షోలో ఈ సారి షో స్టాపర్లుగా శ్రుతి హాసన్, శ్రియా శరణ్ మరియు హర్షవర్ధన్ లతోపాటు ప్రముక క్రీడాకారులు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ వంటి ప్రముఖులు కూడా ర్యాంప్ వాక్ చేశారు.
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఈ వచ్చిన నిధులను వినియోగిస్తారు. ఇందుకోసం నిన్న ఫిబ్రవరి 11న 9వ ఎడిషన్ అయిన ఈ ఈవెంట్ ను లక్ష్మీ మంచు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ఈవెంట్లో మహిళల దుస్తుల కోసం ప్రఖ్యాత ఫ్యాషన్ మాస్ట్రోలు అమిత్ జీటీ, పురుషుల దుస్తుల కోసం శశాంక్ చెల్మిల్లా రూపొందించిన డిజైన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమానికి సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్ ఆభరణాలను అందజేస్తుంది.
టీచ్ ఫర్ చేంజ్ వార్షిక నిధుల సమీకరణ కోసం ప్రముకుల, సినీ రంగ నటీనటుల భాగస్వామ్యంతో ముందుకు వెళ్తుంది ఇందులో నగరానికి చెందిన వివిధ రంగాల ప్రముకులు హాజరై తమవంతు సాయాన్ని అందిస్తూ నాణ్యమైన, మెరుగైన విద్యకు సాయంగా నిలుస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చే ఆదాయం సంస్థ అభివృద్ధి మరియు కార్యక్రమాలకు కోసం వినియోగిచబడుతుంది, ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారాన్నిచూపేందుకు ఈ సంస్థ ముందుకెల్తుంది.
ఈ షో లో సీరత్ కపూర్, ఫరియా అబ్దుల్లా, అవంతిక మిశ్రా, లేఖా ప్రజాపతి, అలేక్య హారిక, రాశి సింగ్, అక్షర గౌడ, అశోక్ గల్లా, ప్రదీప్ మాచిరాజు, విరాజ్ అశ్విన్, శ్రుతి హాసన్, శ్రియా శరణ్, హర్షవర్ధన్ రాణే వంటి ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. సుధీర్ బాబు, అదిత్, శివ కందుకూరి, బ్యాడ్మింటన్ క్రీడాకారులు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్, తెలంగాణ రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
లక్ష్మి మంచు మాట్లాడుతూ, ది టీచ్ ఫర్ చేంజ్ ఫ్యాషన్ షో కేవలం స్టైల్ మరియు గ్లామర్ మాత్రమే కాదు; అవసరమైన పిల్లల జీవితాలలో అర్ధవంతమైన మార్పును సృష్టించడానికి చేస్తున్న గొప్ప ప్రయత్నం అన్నారు. ఈ ప్రయత్నంలో ఎంతో మంది పెద్ద మనసుతో ముందుకు వచ్చి తమ వంతు సాయాన్ని అందిస్తున్నారన్నారు. నిధులను సేకరించి విద్యార్థులకు వాటిని అందించి వారి భవిష్యత్తులో భాగం అవ్వాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నామని అన్నారు.
శ్రియా శరణ్ మాట్లాడుతూ, టీచ్ ఫర్ చేంజ్స్ వార్షిక ఫ్యాషన్ షో నిధుల సమీకరణలో భాగమవ్వడాన్ని గౌరవంగా భావిస్తున్నామన్నారు. విద్య అనేది ప్రాథమిక హక్కు అని, టీచ్ ఫర్ చేంజ్ వంటి కార్యక్రమాలు ఇలాంటి మార్పుకు చాలా అవసరం అన్నారు. ప్రతి విద్యార్థకి నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తుందన్నారు. మంచు లక్ష్మి నిజంగా అసాధారణమైన వ్యక్తిత్వం ఉన్న సహృదయిని అన్నారు. ఆమె అంకితభావానికి తన మద్దతును అందించడానికి సిద్దంగా ఉన్నట్టు తెలిపారు.
హర్షవర్ధన్ రాణే మాట్లాడుతూ, కొన్ని సంవత్సరాలుగా మంచు లక్ష్మి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు టీచ్ ఫర్ చేంజ్ చొరవలో భాగం కావడం అద్భతమన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమంలో తాను భాగమవ్వడం, వారి కోసం ఫ్యాషన్ షోలో పాల్గొనడం గొప్ప అనుభూతి అన్నారు.