Parvathy Thiruvothu: ఇక్కడ ప్రతీది రాజకీయమే

ABN, Publish Date - Aug 11 , 2024 | 10:49 AM

ఇక్కడ ప్రతీది రాజకీయమే అని.. సమాజంలో అసమానతలు ఇంకా ఎందుకున్నాయన్న విషయంపై నిరంతరం చర్చ జరగాలని తంగ‌లాన్ న‌టి పార్వతి అభిప్రాయపడ్డారు.

parvathy

అయితే ఇటీవ‌ల జ‌రిగిన ఓ మీడియా సమ‌వేశంలో ఈ సినిమాలో విక్ర‌మ్‌కు భార్య‌గా, ఐదుగురు పిల్ల‌ల త‌ల్లిగా న‌టించిన‌ పార్వ‌తి తిరుమోతూ (Parvathy Thiruvothu) మాట్లాడుతూ.. సమాజంలో అసమానతలు ఇంకా ఎందుకున్నాయన్న విషయంపై నిరంతరం చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. కొన్ని ఆస‌క్తిక‌ర విశ‌యాలు చ‌ర్చించారు.

గ‌డిచిన 18 సంవ‌త్స‌రాలుగా సినిమా ఇండ‌స్ట్రీలో ఉన్నాన‌ని, ఇప్పటివరకు 30కి పైగా చిత్రాల్లో నటించానని అన్నారు. సినిమా అనేది వినోదం, సమష్టి కృషి అని అనేది గ్రహించాలని కానీ ఇక్కడ ప్రతీది రాజకీయమే అని. రాజకీయం లేనిదంటూ ఏదీ లేదని అన్నారు. ఈ రోజుల్లో ఒక నటుడికి కరుణ అనేది ఉండాలని ఆ ల‌క్ష‌ణాలు ఉన్న న‌టుడికి పెద్ద ఉదాహరణే విక్రమ్ అని అంద‌రినీ ఇక్వ‌ల్‌గా ట్రీట్ చేస్తార‌ని అన్నారు.


సమాజంలో అసమానతలు ఎందుకు ఉన్నాయో చర్చ జరగాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, ఈ విషయంలో కొందరికి అసౌకర్యం అనిపించినప్పటికీ అంగీకరించాల్సిందేన‌ని అన్నారు. ఈ సినిమాలో నాటి అస‌మాన‌త‌లు ఎలా ఉండేవో చూయించార‌న్నారు. కళ అంటే రాజకీయం. దానికి సారథ్యం వహించిన సైనిక దళపతి పా.రంజిత్‌. ఆయన సైన్యంలో ఒక భాగంగా ఉన్నందుకు గర్వపడుతున్నాను’ అని పార్వ‌తి తిరుమోతూ (Parvathy Thiruvothu) పేర్కొన్నారు.

Updated Date - Aug 11 , 2024 | 10:49 AM