Telugu Indian Idol: లాంచింగ్‌తోనే.. 'తెలుగు ఇండియన్ ఐడల్' సీజన్ 3 సెన్సేషన్

ABN, Publish Date - Jun 17 , 2024 | 07:39 PM

ఇండియన్ బిగ్గెస్ట్ మ్యూజికల్ రియాలిటీ షో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 గ్రాండ్ గా లాంచ్ అయ్యింది.

Telugu Indian Idol

ఇండియన్ బిగ్గెస్ట్ మ్యూజికల్ రియాలిటీ షో తెలుగు ఇండియన్ ఐడల్ (Telugu Indian Idol) సీజన్ 3 గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఇండియన్ ఐడల్ శ్రీరామచంద్ర హోస్ట్ చేస్తున్న ఈ మ్యాసీవ్ మ్యూజికల్ కాంపిటేషన్ షోలో దేశ, విదేశాల నుంచి పాల్గొన్న ట్యాలెంటెడ్ కంటెస్టెంట్స్ తమ మెస్మరైజింగ్ వోకల్స్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశారు. అంతేగాక‌ కంటెస్టెంట్స్ జర్నీ ఆడియన్స్ ని ఎమోషనల్ గా కదిలిచింది. లాంచింగ్ ఆడిషన్ ఎపిసోడ్స్ గ్రౌండ్ బ్రేకింగ్ రెస్పాన్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేశాయి.

సెన్సేషనల్ కంపోజర్ ఎస్ ఎస్ తమన్, స్టార్ సింగర్స్, కార్తిక్, గీతా మాధురి జడ్జస్ గా వ్యహరించే ఈ మెగా మ్యూజికల్ షో లాంచింగ్ ఎపిసోడ్స్ ప్రస్తుతం టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతున్నాయి. జడ్జ్ కార్తిక్, కంటెస్టెంట్స్ తో వచ్చిన గెస్టులతో కలసి పాడటం మరో హైలెట్‌గా నిలిచింది.

ఆడిషన్స్‌కి వచ్చిన ఒక చిన్న బాబు, తన సోదరితో తమన్‌ సరదా సంభాష‌ణ‌ నవ్వులు పంచింది. కాగా హైలీ మ్యాజికల్ గా సాగిన లాంచింగ్ ఎపిసోడ్స్ చూస్తుంటే తెలుగు ఇండియన్ ఐడల్ (Telugu Indian Idol) సీజన్ 3 డబుల్ ఫన్ అండ్ ఎంటర్ టైన్మెంట్ ఉండబోతోందని, గోల్డెన్ మైక్‌లు, గోల్డెన్ టిక్కెట్లు గెలుచుకోవడం అంత ఈజీ కాదని ఆడిషన్స్ చూస్తుంటే అర్ధమౌతోంది.


ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసిన తెలుగు ఇండియన్ ఐడల్ (Telugu Indian Idol) సీజన్ 3 మోస్ట్ పాపులర్ ఓటీటీ 'ఆహాస‌లో ప్రతి శుక్రవారం, శనివారం రాత్రి 7 గంటలకు స్ట్రీమ్ అవ‌నుంది. తొలి రెండు ఆడిషన్ ఎపిసోడ్స్ ఈ షో పై ఉన్న అంచనాలు మరింతగా పెంచాయి. తొలి ఎపిసోడ్ మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఎవర్ గ్రీన్ మెలోడీ ఈ శతమానం అన్నదిలే.. పాటతో మ్యూజికల్ ట్రీట్ గా ప్రారంభమైంది. ఈ పాటకు గాను కంటెస్టెంట్ కీర్తి తమన్ నుంచి గోల్డెన్ మైక్‌, స్టంప్ అందుకుంది. సెకండ్ ఎపిసోడ్‌లో అనిరుద్ సుస్వరన్‌ గోల్డెన్ మైక్‌తో పాటు పెర్ఫార్మర్ అఫ్ ది వీక్ గా నిలిచాడు.

Updated Date - Jun 17 , 2024 | 07:39 PM