Cess: సినిమా టికెట్లు, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌లపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం
ABN, Publish Date - Jul 20 , 2024 | 05:53 PM
సినిమా లవర్స్‌కు షాకింగ్ న్యూస్. అదేంటంటే ఇకపై సినిమా టికెట్లు, ఓటీటీ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు మరింత ప్రియం కానున్నాయి. ఇప్పుడున్న టికెట్ల ధరలు, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లపై సెస్ విధించాలని రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై సినిమా టికెట్లు అలాగే ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లపై 2 శాతం సెస్ వసూలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.
సినిమా లవర్స్‌కు షాకింగ్ న్యూస్. అదేంటంటే ఇకపై సినిమా టికెట్లు (Movie Tickets), ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు (OTT Subscriptions) మరింత ప్రియం కానున్నాయి. ఇప్పుడున్న టికెట్ల ధరలు, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లపై సెస్ విధించాలని రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై సినిమా టికెట్లు అలాగే ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లపై 2 శాతం సెస్ వసూలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఇంతకీ ఏ రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటున్నారా? తెలుగు రాష్ట్రాలు కాదులెండి.. కాస్త ఊపిరి పీల్చుకోవచ్చు. ఈ ప్లాన్ చేస్తోంది కర్ణాటక (Karnataka)లోని సిద్ధరామయ్య ప్రభుత్వం (Siddaramaiah Govt).
Also Read- Anand Sai: కళ్యాణ్ ఆలోచనలు, అభిరుచి మేరకు మార్పులు చేశాం!
అంటే స్వచ్ఛ భారత్ టాక్స్‌లాగా ఇకపై సినిమా టికెట్లు, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు తీసుకునే వారిపై రెండు శాతం అదనపు భారం పడనుంది. అయితే ఈ మార్గంలో వచ్చే అమౌంట్‌ను సినీ, సాంస్కృతిక కార్యకర్తల సంక్షేమం కోసం వినియోగించాలనేలా కర్ణాటక ప్రభుత్వ సర్కారు ప్రణాళికలు చేస్తోందని తెలుస్తోంది. టికెట్లు, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు మాత్రమే కాకుండా ఎంటర్‌టైన్‌మెంట్ రంగానికి సంబంధించిన ఆదాయ వనరులన్నింటిపైన, రాష్ట్ర పరిధిలో ప్రదర్శించే నాటకాలపైనా కూడా ఈ సెస్ విధించాలనేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం.
కర్ణాటక సినీ, సాంస్కృతిక కార్యకర్తల సంక్షేమ బిల్లు పేరుతో ఇప్పటికే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టినట్లుగా కార్మిక శాఖ కార్యదర్శి మహమ్మద్ మోహ్‌సిన్ వెల్లడించారు. ఈ పన్నును ఎలా వసూలు చేయాలనే దానిపై ప్రణాళికలు జరుగుతున్నాయని.. అలాగే సినీ, సాంస్కృతిక కార్యకర్తల సంక్షేమం కోసం ఏడుగురు సభ్యులతో కూడిన బోర్డును కూడా ఏర్పాటు చేసే అంశాన్ని ఈ బిల్లులో ప్రస్తావించారని, ఈ సెస్ కింద వచ్చే ఆదాయాన్ని ఈ బోర్డుకు బదిలీ చేసేలా, మూడేళ్లకోసారి ఈ సెస్ రేటును సమీక్షించేలా ప్లాన్ చేసినట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. దీంతో పాటు నటీనటుల ఆర్థిక భద్రత నిమిత్తం కొంత ఫండ్‌ను ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తోందని తెలుస్తోంది. మరి ఈ బిల్లుపై సినీ ప్రియులు (Cine Lovers) ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Read Latest Cinema News