Singer Karthik: కాలేజ్ ఫెస్ట్‌లో కార్తీక్ లైవ్ ఇన్ కన్సర్ట్.. జోష్ అంటే ఇది
ABN, Publish Date - May 04 , 2024 | 08:39 PM
హైదరాబాద్‌లోని మీర్ పేటలో గల టీకేఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ కాలేజ్ 22వ వార్షికోత్సవ వేడుకలో ప్లేబ్యాక్ సింగర్ కార్తీక్ లైవ్ ఇన్ కన్సర్ట్‌కు విద్యార్థులలో జోష్ నింపింది. విద్యార్థులతో కిక్కిరిసిపోయిన ఈ క్యాంపస్ ప్రాంగణంలో.. కార్తీక్ తను పాడిన ఎన్నో అద్భుతమైన తెలుగు పాటలను ఈ మ్యూజికల్ కన్సర్ట్‌లో పాడి వీక్షకులను ఉర్రూతలూగించారు.
హైదరాబాద్‌లోని మీర్ పేటలో గల టీకేఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ కాలేజ్ 22వ వార్షికోత్సవ (TKR College Anniversary) వేడుకలో ప్లేబ్యాక్ సింగర్ కార్తీక్ (Singer Karthik) లైవ్ ఇన్ కన్సర్ట్‌కు విద్యార్థులలో జోష్ నింపింది. విద్యార్థులతో కిక్కిరిసిపోయిన ఈ క్యాంపస్ ప్రాంగణంలో.. కార్తీక్ తను పాడిన ఎన్నో అద్భుతమైన తెలుగు పాటలను ఈ మ్యూజికల్ కన్సర్ట్‌లో పాడి వీక్షకులను ఉర్రూతలూగించారు. కార్తీక్ పాటలకు విద్యార్థులు సైతం స్వరం కలుపుతూ, డాన్స్‌లతో సరదాగా ఎంజాయ్ చేశారు. ఆయన స్వర రాగ సంగీత పాటలతో యువత మదిని దోచారు. కార్తీక్ తను పాడిన హిట్ సాంగ్స్ ఈ స్టేజ్‌పై ప్రదర్శించి.. విద్యార్థులలో జోష్ నింపారు. తన గాత్రంతో మరోసారి వీక్షక విద్యార్థుల హృదయాలను దోచుకున్నారు.
*Thalaimai Seyalagam: శ్రియారెడ్డి ప్రధాన పాత్రలో ‘తలమై సెయల్గమ్’.. టీజర్, స్ట్రీమింగ్ డేట్ వచ్చేశాయ్
ఈ కాలేజ్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 3 రోజులు జరిగే ఈ ఫెస్ట్‌లో మొదటి రోజు త్యోహర్ (సాంప్రదాయ రోజు) వంటి కరిక్యులర్, కో-కరిక్యులర్ కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులు, కళాశాల సిబ్బంది వివిధ సంస్కృతులు, సంప్రదాయాలను సూచించే సాంప్రదాయ భారతీయ దుస్తులు ధరించి సందడి చేశారు. రెండవ రోజు ప్లేబ్యాక్ సింగర్ కార్తీక్ లైవ్ ఇన్ కన్సర్ట్ (Singer Karthik Live in Concert) నిర్వహించగా.. మూడవ రోజురక్షణ మంత్రిత్వ శాఖ సైంటిఫిక్ అడ్వైజర్ డాక్టర్ జి సతీష్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్‌పర్సన్ డాక్టర్ అనితా రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రతి సంవత్సరం ఇలా మూడు రోజుల పాటు ఈ ఫెస్ట్ జరుపుకుంటున్నామని కళాశాల కార్యదర్శి హరినాథ్ రెడ్డి తెలిపారు. అంతకు ముందు గాయకుడు కార్తీక్, టీకేఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ తీగల కృష్ణారెడ్డి, కోశాధికారి అమర్నాథ్ రెడ్డి మీడియాతో ముచ్చటించారు.