Shyamala Devi: అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రపై ప్రభాస్‌తో సినిమా చేయిస్తా..
ABN, Publish Date - Jul 04 , 2024 | 09:39 PM
అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రపై ప్రభాస్‌తో చిత్రం చేయించేందుకు తాను ప్రయత్నం చేస్తానని అన్నారు కృష్ణంరాజు సతీమణీ శ్యామలా దేవి. అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వేడుకలలో పాల్గొన్న ఆమె.. అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అల్లూరి సీతారామరాజు గొప్పతనాన్ని తెలియజేస్తూ.. తన భర్త కృష్ణంరాజు అల్లూరి విగ్రహాన్ని పార్లమెంట్‌లో పెట్టించాలని ప్రయత్నించినట్లుగా ఆమె చెప్పుకొచ్చారు.

Also Read- Manamey OTT Release Date: ఓటిటి లోకి ఇంకో ఫ్లాప్ మూవీ వచ్చేస్తోంది, ఎప్పుడు ఎక్కడ అంటే...
ఈ సందర్భంగా శ్యామలా దేవి మాట్లాడుతూ.. అల్లూరి సీతారామరాజు పాత్రను ప్రభాస్ చేస్తే, సీతారామరాజు మళ్లీ పుట్టినట్లు ఉంటుందన్నారు. 15ఏళ్ల క్రితం అల్లూరి విగ్రహం పార్లమెంట్‌లో పెట్టాలని కృష్ణంరాజుగారు అప్పట్లో చాలా ప్రయత్నించారు. అప్పటి స్పీకర్ మీరా కుమారిగారిని కూడా కోరారు. ఆమె కూడా అందరికి తెలియజెప్పి చేయిద్దాం అన్నారు కానీ.. ఎందుకో జాప్యం జరిగింది. మళ్లీ ఆయన స్ఫూర్తితో దేశ ప్రధానికి, రాష్ట్రపతికి, రాష్ట్ర ముఖ్యమంత్రులకి కూడా మరొక్కసారి ఈ విషయాన్ని విన్నవించుకోవాలని అనుకుంటున్నాం. పార్లమెంట్‌లో అల్లూరి విగ్రహం పెట్టిన రోజున.. మేమంతా మా కన్నీటితో నివాళులు అర్పించాలనేలా నిర్ణయం తీసుకున్నాం. అది త్వరలోనే జరుగుతుందనే ఆశ కూడా మాకు ఉంది. అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్లో ప్రభాస్‌ను చూడాలని చాలామంది అభిమానులు, ప్రేక్షకులు అనుకుంటున్నారు. వారి కోరికను నేను ప్రభాస్‌కు తెలియజేస్తాను. ఆ పాత్ర చేసే విషయంలో ఎలాంటి అవకాశమున్నా సరే చేయమని ప్రభాస్‌కు చెబుతానన్నారు. ప్రస్తుతం ఆమె అల్లూరి సీతారామరాజు పాత్రను ప్రభాస్‌తో చేయించే ప్రయత్నం చేస్తానని చెబుతున్న వీడియో సోషల్ మాధ్యమాలలో బాగా వైరల్ అవుతోంది.
మరోవైపు ప్రభాస్ క్షణం తీరిక లేకుండా చేతుల నిండా సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. ‘సలార్ 2’, ‘కల్కి 2898 AD పార్ట్ 2’, ‘ది రాజా సాబ్’, ‘స్పిరిట్’, హను రాఘవపూడితో సినిమాతో పాటు మరికొన్ని కథలు విన్నట్లుగా తెలుస్తోంది. ఈ లెక్కన చూస్తే.. ప్రభాస్ అల్లూరి పాత్రలో నటించాలంటే చాలా సమయం పట్టే అవకాశం అయితే లేకపోలేదు. అయితే తన పెద్దమ్మ కోరిక మేరకు ఏదో ఒక సినిమాలో చిన్న గెటప్ వేసే అవకాశాలు అయితే లేకపోలేదు. చూద్దాం మరి.. పెద్దమ్మ, ఫ్యాన్స్, ప్రేక్షకుల కోరిక ఎప్పుడు తీరుతుందో..
Read Latest Cinema News