Shruti Haasan: శృతి హాసన్ అసహనం.. కారణమిదే

ABN, Publish Date - Oct 11 , 2024 | 04:04 PM

గ్లామర్ డాల్ శృతి హాసన్ రీ ఎంట్రీలో సక్సెస్ ఫుల్‌గా దూసుకెళుతోంది. రీసెంట్‌గా ఆమె నటించిన ‘సలార్’ చిత్రం మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె చేతిలో ‘సలార్ 2’ మినహా మరో చిత్రం లేదు. తాజాగా ఆమె ఇండిగో సంస్థపై అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఓ ట్వీట్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

Heroine Shruti Haasan

గ్లామర్ డాల్ శృతి హాసన్ (Shruti Haasan) రీ ఎంట్రీలో సక్సెస్ ఫుల్‌గా దూసుకెళుతోంది. రీసెంట్‌గా ఆమె నటించిన ‘సలార్’ చిత్రం మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం టాలీవుడ్ పరంగా ఆమె చేతిలో ‘సలార్ 2’ చిత్రం మాత్రమే ఉంది. కోలీవుడ్‌లో కూడా ఆమెకు ఏం ఆఫర్లు వచ్చినట్లుగా లేవు. కారణం ఆమె చాలా సెలక్టెడ్‌గా సినిమాలను ఎన్నుకుంటోంది. ఇక విషయంలోకి వస్తే.. తాజాగా శృతి హాసన్ ఇండిగో సంస్థపై అసహనం వ్యక్తం చేసింది. ఈ మధ్య ఇండిగో సంస్థ తరచూ వార్తల్లో నిలుస్తోన్న విషయం తెలిసిందే. నిత్యం ప్రయాణికులలో ఎవరో ఒకరు సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. ఇప్పుడీ జాబితాలోకి శృతి హాసన్ కూడా వచ్చి చేరింది. ఇండిగో తీరుపై మండిపడుతూ నటి శృతి హాసన్ ట్విట్టర్ ఎక్స్ వేదికగా అసహనాన్ని వ్యక్తం చేసింది. ప్రయాణికులకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఫ్లైట్ నాలుగు గంటల ఆలస్యం కావడంపై ఆమె గుస్సా అయ్యింది.

Also Read- Vettaiyan Review: రజనీకాంత్ నటించిన యాక్షన్ మూవీ ‘వేట్ట‌య‌న్... ది హంట‌ర్‌’ ఎలా ఉందంటే.. 

ఫ్లైట్ ఆలస్యంపై ఆమె స్పందిస్తూ.. ‘‘నేను సాధారణంగా ఇలాంటి విషయాలలో సర్దుబాటు ధోరణితో ఉంటాను కానీ ఈసారి ఇండిగో మాత్రం మరీ ఇబ్బంది పెట్టేసింది. నాలుగు గంటలుగా మేము ఎయిర్‌పోర్టులో పడిగాపులు కాస్తున్నా.. ఫ్లైట్ ఇంతవరకూ బయలుదేరలేదు. ఇటువంటి విషయాల్లో క్లారిటీ ఇవ్వాలి. మరింత మెరుగైన విధానాలు అవలంబించాలి’’ అని పేర్కొంది. ఆమె ట్వీట్‌కు నెటిజన్లు కూడా మద్దతు పలుకుతున్నారు. ‘ఇండిగో లో ఇలాంటివి కామన్.. ఈసారి ఇలాంటి ప్రయాణాలు చేయాల్సి వస్తే.. ఈ సంస్థను పక్కన పెట్టేయడం బెటర్’, ‘ఈ మధ్యకాలంలో ఈ సంస్థపై బాగా కంప్లయింట్స్ వస్తున్నాయి’, ‘వరస్ట్ సర్వీస్’ అంటూ నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Also Read- Maa Nanna Superhero Review: సుధీర్‌బాబు నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఎలా ఉందంటే..


ఇక శృతి హాసన్ చేసిన పోస్టుకు ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థ కూడా వెంటనే స్పందించి.. ప్రయాణికులు ఇబ్బంది పడ్డందుకు విచారం వ్యక్తం చేసింది. ‘‘మిస్ హాసన్ మీకు కలిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము. ఫ్లైట్ ఆలస్యమైతే ఎంత ఇబ్బందో అర్థం చేసుకోగలం. ముంబైలో వాతావరణం అనుకూలించక ఫ్లైట్ ఆలస్యం అయ్యింది. ఆ అంశాలు మా చేతుల్లో లేవని అర్థం చేసుకోగలరని ఆశిస్తున్నాం. కస్టమర్లకు ఇబ్బంది రాకుండా మేము అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము’’ అని ఇండిగో సంస్థ అధికారిక ట్విట్టర్ ద్వారా రిప్లై ఇచ్చింది.

Also Read- Janaka Aithe Ganaka Review: ‘జనక అయితే గనక’ మూవీ ప్రీ రిలీజ్ రివ్యూ


-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 11 , 2024 | 04:06 PM