మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Satya Kashyap: ‘అయోధ్య శ్రీరామ్’ సక్సెస్‌పై సంగీత దర్శకుడి స్పందనిదే..

ABN, Publish Date - Feb 06 , 2024 | 08:24 PM

తెలుగు సినిమాలతో పాటు... హిందీ సినిమాలకు కూడా సంగీత దర్శకత్వం వహిస్తూ... ప్రతి చిత్రంతో సంగీత దర్శకుడిగా తన స్థాయిని పెంచుకుంటూ వస్తున్న యువ సంగీత దర్శకుడు సత్య కశ్యప్ తాజాగా ‘అయోధ్య శ్రీరామ్’ ఆల్బమ్‌కు సారధ్యం వహించారు. అయోధ్య రాముని విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా... హిందీ, తెలుగు భాషల్లో విడుదలైన ఈ గీతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.

Satya Kashyap on Ayodhya Sriram

తెలుగు సినిమాలతో పాటు... హిందీ సినిమాలకు కూడా సంగీత దర్శకత్వం వహిస్తూ... ప్రతి చిత్రంతో సంగీత దర్శకుడిగా తన స్థాయిని పెంచుకుంటూ వస్తున్న యువ సంగీత దర్శకుడు సత్య కశ్యప్ తాజాగా ‘అయోధ్య శ్రీరామ్’ ఆల్బమ్‌కు సారధ్యం వహించారు. అయోధ్య రాముని విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా... హిందీ, తెలుగు భాషల్లో విడుదలైన ఈ గీతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. అతి త్వరలో సినీ రంగ ప్రవేశం చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్న ప్రవాస భారతీయుడు సమీర్ పెనకలపాటి ఈ రామ గీతాన్ని ఎస్.పి. ప్రొడక్షన్ హౌస్ పతాకంపై ఎంతో ప్రతిష్టాత్మకంగా, అత్యంత భక్తి ప్రపత్తులతో రూపొందించారు. ఈ గీతానికి లభిస్తున్న వస్తున్న స్పందనపై సంగీత సారధి సత్య కశ్యప్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

సంగీత దర్శకుడిగా తన జన్మకు లభించిన సార్ధకతగా భావిస్తున్నానని ఈ సాంగ్ సక్సెస్‌పై ఈ యంగ్ సంగీత దర్శకుడు ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు. స్వతహా రామ భక్తుడైన సత్య కెరీర్ శ్రీకారం చుట్టుకున్నదే ‘శ్రీరామ స్వరాలు’ అనే ప్రయివేట్ ఆల్బమ్‌తో కావడం గమనార్హం. హైదరాబాద్‌లోని శ్రీ త్యాగరాయ మ్యూజికల్ కాలేజ్‌లో ఆరేళ్ళ డిప్లొమా కోర్స్ చేసిన ఈ శ్రీకాకుళం చిన్నోడు... రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ‘కిల్లింగ్ వీరప్పన్, వంగవీటి’ చిత్రాలకు సంగీతం సమకూర్చాడు. తెలుగు, హిందీతో పాటు తమిళ, కన్నడ, ఒరియా చిత్రాలకు సైతం పని చేసిన సత్య... ‘అయోధ్య శ్రీరామ్’ ఆల్బమ్‌కు స్వర సారధ్యం చేసే సువర్ణావకాశం ఇచ్చిన నిర్మాత సమీర్ పెనకలపాటికి కృతజ్ఞతలు తెలిపారు.


ఈ ఆల్బమ్ రూపకల్పనలో ఎంతో శ్రమించిన ఎడిటర్ యువర్స్ ఉన్నికి కూడా ఈ విజయంలో తగిన పాత్ర ఉందని చెప్పే సత్య కశ్యప్... వీటన్నిటి కంటే శ్రీ రాముని కరుణాకటాక్షాల వల్లే ‘అయోధ్య శ్రీరామ్’ అసాధారణ విజయం సాధిస్తున్నదని అన్నారు. అచంచల భక్తిశ్రద్ధలతో రూపొందిన ‘అయోధ్య శ్రీరామ్’ గీతాన్ని సత్య కశ్యప్‌తో కలిసి... చిన్మయి, స్నిఖిత, శ్రాగ్వి ఆలపించారు. తెలుగులో ఈ గీతానికి ‘చిరంజీవి ఎన్ని’ సాహిత్యం సమకూర్చగా... హిందీలో తన్వీర్ ఘజ్వి రాశారు.


ఇవి కూడా చదవండి:

====================

*Kavya Thapar: గోపీచంద్, శ్రీను వైట్ల కాంబో మూవీ టైటిల్ లీక్ చేసిన ‘ఈగల్’ భామ

************************

*Sai Pallavi: సాయి పల్లవి సినిమా రీ రిలీజ్.. లేడీ పవర్ స్టార్ అని అనేది అందుకే..

*****************************

*Super Star: ఇక ‘సూపర్‌స్టార్‌’ ట్యాగ్‌ చర్చకు తెరపడినట్టేనా? విజయ్ అభిమానులకు హితబోధ

*****************************

*Sudigali Sudheer: అయ్యో పాపం సారూ.. ఇట్టా బుక్కయ్యాడు

***************************

Updated Date - Feb 06 , 2024 | 08:24 PM