Sandhya Theatre Stampede: శ్రీతేజ్ ఆరోగ్యంలో మార్పు.. హెల్త్ బులిటెన్
ABN, Publish Date - Dec 23 , 2024 | 07:52 PM
తాజాగా కిమ్స్ వైద్యులు శ్రీతేజ్ హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడి.. దాదాపు మూడు వారాలుగా కోమాలో ఉన్న శ్రీతేజ్ హెల్త్ బులిటెన్‌ను కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం విడుదల చేసింది. ప్రస్తుతం శ్రీ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, వెంటిలేటర్ లేకుండానే శ్వాస తీసుకుంటున్నాడని ఈ హెల్త్ బులిటెన్‌లో డాక్టర్స్ తెలిపారు. ఆదివారం కంటే సోమవారం అతని ఆరోగ్యం మెరుగైందని, కాకపోతే.. జ్వరం పెరుగుతోందన్నారు. అలాగే వైట్ బ్లడ్ సెల్స్, మిగితా సెల్స్ అన్ని ఇప్పుడిప్పుడే ఇంప్రూవ్ అవుతున్నాయి అని చెప్పారు. ఫుడ్ తీసుకోగలుగుతున్నాడని వెల్లడించారు. అయితే నాడీ వ్యవస్థ పనితీరులో మాత్రం ఎలాంటి మార్పు కనిపించలేదన్నారు.