Samyuktha: వయనాడ్ విపత్తు బాధితుల సహాయార్థం సంయుక్త విరాళం

ABN, Publish Date - Aug 04 , 2024 | 06:32 PM

వయనాడ్ విపత్తు బాధితులకు అండగా నిలబడేందుకు చిత్ర పరిశ్రమలోని పలువురు స్టార్స్ ముందుకొస్తున్నారు. టాలీవుడ్ నుంచి ఇప్పటికే స్టార్ హీరోలెందరో సాయం ప్రకటించారు. తాజాగా స్టార్ హీరోయిన్ సంయుక్త వయనాడ్ బాధితుల సహాయార్థం కొంత (అమౌంట్ ఎంత అనేది చెప్పలేదు) సాయం చేసినట్లుగా ఆమె టీమ్ వెల్లడించింది. వయనాడ్‌లో సహాయ కార్యక్రమాలు చేస్తున్న విశ్వశాంతి ఫౌండేషన్‌కు చెక్‌ను సంయుక్త అందజేసింది.

Actress Samyuktha Donation to Wayanad Landslide Victim

వయనాడ్ విపత్తు బాధితులకు అండగా నిలబడేందుకు చిత్ర పరిశ్రమలోని పలువురు స్టార్స్ ముందుకొస్తున్నారు. టాలీవుడ్ నుంచి ఇప్పటికే సెలబ్రిటీలెందరో సాయం ప్రకటించారు. తాజాగా స్టార్ హీరోయిన్ సంయుక్త (Samyuktha) వయనాడ్ బాధితుల (Wayanad Landslide Victims) సహాయార్థం కొంత (అమౌంట్ ఎంత అనేది చెప్పలేదు) సాయం చేసినట్లుగా ఆమె టీమ్ వెల్లడించింది. వయనాడ్‌లో సహాయ కార్యక్రమాలు చేస్తున్న విశ్వశాంతి ఫౌండేషన్‌ (Viswasanthi Foundation)కు చెక్‌ను సంయుక్త అందజేసింది.

Also Read- Chiranjeevi - Ram Charan: మంచి మనసు చాటుకున్నారు.. బాధితులంతా త్వరగా కోలుకోవాలి!


ఈ సందర్భంగా సంయుక్త సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ.. ‘‘వయనాడ్ ప్రజలకు ఎదురైన విపత్తు ఎంతో బాధను కలిగిస్తోంది. ఈ కష్ట సమయంలో వారికి అండగా నిలబడి, నా వంతు సపోర్ట్ అందిస్తున్నాను. విశ్వశాంతి ఫౌండేషన్ వారు వయనాడ్‌లో చేస్తున్న పలు సేవా కార్యక్రమాలకు నా వంతు సహాయం అందించాను. వయనాడ్‌కు సపోర్ట్‌గా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. అక్కడి ప్రజలు ఈ విపత్తు నుంచి కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’’ అని పేర్కొంది.


సొసైటీకి తన వంతుగా ఏదైనా చేయాలనే తపన ఉన్న సంయుక్త ఇప్పటికే మహిళా సాధికారత, నిస్సహాయ స్త్రీలను ఆదుకునేందుకు ‘ఆదిశక్తి’ అనే ఫౌండేషన్ స్థాపించి సేవలు అందిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పుడు వయనాడ్ బాధితుల సహాయార్థం ఆర్థిక సాయం అందించడం ఆమె మంచి మనసును మరోసారి తెలియజేస్తోంది. అయితే ఆమె సీఎం రిలీఫ్ ఫండ్‌కు కాకుండా.. విశ్వశాంతి ఫౌండేషన్‌కు విరాళం అందించి.. తన ప్రత్యేకతను చాటుకుంది. విశ్వశాంతి ఫౌండేషన్‌ స్టార్ హీరో మోహన్‌లాల్‌కి చెందినదనే విషయం తెలిసిందే.

వయనాడ్‌ ఘటన సహాయార్దం ఇప్ప‌టి వ‌ర‌కు సినీ ప్రముఖులు ఇచ్చిన విరాళాలు..

మోహన్ లాల్ - రూ.3 కోట్లు

చిరంజీవి, రామ్ చరణ్ 1 కోటి

సూర్య, జ్యోతిక దంపతులు - రూ.50 లక్షలు

మమ్ముట్టి-దుల్కర్ - రూ.40 లక్షలు

కమల్ హాసన్ - రూ.25 లక్షలు

అల్లు అర్జున్ - 25 లక్షలు

ఫహాద్ ఫాజిల్ - రూ.25 లక్షలు

విక్రమ్ - రూ.20 లక్షలు

రష్మిక - రూ.10 లక్షలు

సితార ఎంటర్‌టైన్‌మెంట్ వంశీ - రూ. 5 లక్షలు

ఇప్పుడీ లిస్ట్ లోకి సంయుక్త కూడా చేరింది.

Read Latest Cinema News

Updated Date - Aug 04 , 2024 | 06:32 PM