Sai Dharam Tej: ఆ యాక్సిడెంట్‌లో నన్ను కాపాడింది అదే..
ABN, Publish Date - Feb 13 , 2024 | 06:00 PM
నేటి యువతతో పాటు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ విధిగా పాటించాలని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా అవేర్‌నెస్‌తో వుండాలని అన్నారు సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా సోమవారం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (వెస్ట్ జోన్) ఆధ్వర్యంలో బంజార హిల్స్‌లోని సుల్తాన్ ఉల్ ఉలూమ్ ఎడ్యుకేషనల్ సోసైటీ ఆడిటోరియంలో రహదారి భద్రతా చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హీరో సాయిధరమ్ తేజ్ హాజరయ్యారు.
నేటి యువతతో పాటు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ విధిగా పాటించాలని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా అవేర్‌నెస్‌తో వుండాలని అన్నారు సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా సోమవారం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (వెస్ట్ జోన్) ఆధ్వర్యంలో బంజార హిల్స్‌లోని సుల్తాన్ ఉల్ ఉలూమ్ ఎడ్యుకేషనల్ సోసైటీ ఆడిటోరియంలో రహదారి భద్రతా చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరయ్యారు హీరో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej).
ఈ కార్యక్రమంలో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదం నుంచి కోలుకున్న నాకు ఇది రెండో జీవితం. నేను ఆ ప్రమాదం నుంచి బయటపడటానికి హెల్మెట్ కారణమైంది. అభిమానులు, మీలాంటి వాళ్లు, ప్రేక్షకుల ఆశీస్సులతో ఈ రోజు మీ ముందు ఇలా నిలబడ్డాను. టూ వీలర్ డ్రైవ్ చేసే వాళ్లంతా హెల్మెట్‌ను తప్పక ధరించాలి, అలాగే కార్లు డ్రైవ్ చేసే వారు సీటు బెల్ట్‌లు విధిగా ధరించాలి.
చాలా మంది ట్రాఫిక్ రూల్స్ పాటించడంలో నిర్లక్ష్యంగా వుంటున్నారు. డ్రైవింగ్‌లో వున్నప్పుడు సేఫ్టీని మరిచిపోతున్నారు. తప్పకుండా అందరూ ట్రాఫిక్స్ రూల్స్ పాటించాలని కోరుతున్నాను. అలాగే మద్యం తాగినప్పుడు డ్రైవింగ్ చేయడం చాలా ప్రమాదకరం. అందరూ ట్రాఫిక్ పోలీసులకు సహకరిస్తూ, ట్రాఫిక్స్ నిబంధనలు పాటించాలని ఈ సందర్భంగా అందరినీ కోరుతున్నానని అన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరబాద్ నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస రెడ్డితో పాటు ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనర్ విశ్వప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి:
====================
*Bramayugam: మమ్ముట్టి ‘భ్రమయుగం’ చిత్రం విడుదలపై కీలక ప్రకటన
**********************
*Kayal Anandhi: ఆనంది ‘వైట్ రోజ్’ ఫస్ట్ లుక్‌ని ఎవరు విడుదల చేశారంటే..
*************************
*Harish Shankar: దమ్ముంటే హరీష్ శంకర్ తెల్లవార్లు మద్యం తాగాడని రాయ్..
***************************
*Ooru Peru Bhairavakona: మ్యాజికల్ ఫాంటసీ అడ్వెంచర్.. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు
***************************