Renu Desai: ఉపాసనకు థ్యాంక్స్ చెప్పిన రేణూ దేశాయ్.. ఎందుకో తెలుసా?

ABN, Publish Date - Oct 27 , 2024 | 12:55 PM

మెగా కోడలు ఉపాసన కామినేని కొణిదెలకు నటి రేణూ దేశాయ్ సోషల్ మీడియా వేదికగా థ్యాంక్స్ చెప్పారు. ఉపాసనకు రేణూ దేశాయ్ థ్యాంక్స్ చెప్పడమేంటి? అసలు ఏమై ఉంటుంది అని అనుకుంటున్నారా? అసలు విషయం ఏమిటంటే..

Upasana and Renu Desai

మెగా కోడలు ఉపాసన కామినేని కొణిదెల (Upasana Konidela Kamineni)కు నటి రేణూ దేశాయ్ (Renu Desai) సోషల్ మీడియా వేదికగా థ్యాంక్స్ చెప్పారు. ఉపాసనకు రేణూ దేశాయ్ థ్యాంక్స్ చెప్పడమేంటి? అసలు ఏమై ఉంటుంది అని అనుకుంటున్నారా? విషయంలోకి వస్తే.. రేణూ దేశాయ్‌కి ఎప్పటి నుండో ఒక డ్రీమ్ ఉంది. ఆ డ్రీమ్ ఏంటో పలుమార్లు ఆమె సోషల్ మీడియాలో తెలిపింది. తనకి 8 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి జంతువుల పట్ల ఎంతో ప్రేమ ఉండేదని, వాటిని సంరక్షించడానికి ఏదో ఒకటి చేయాలని ఉండేదని, ఆ డ్రీమ్ ఇన్నాళ్లకు నెరవేరిందని తెలుపుతూ తాజాగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఇంతకీ రేణూ దేశాయ్ డ్రీమ్ ఎలా నెరవేరింది? తన డ్రీమ్ విషయంలో ఉపాసన పేరు ఎందుకు వచ్చింది? అనే విషయానికి వస్తే..

Also Read-Nandamuri Balakrishna: తెలంగాణలో ‘బాలకృష్ణ ఫిలిం స్టూడియో’.. నిజమేనా?

మూగ జీవాల సంరక్షణ నిమిత్తం రేణూ దేశాయ్ ఓ ఎన్టీవోని స్థాపించి తన డ్రీమ్‌ని నెరవేర్చుకుంది. ‘శ్రీ ఆద్య యానిమల్ షెల్టర్’ (Shree Aadya Animal Shelter) పేరుతో ఓ సంస్థను స్థాపించిన రేణూ దేశాయ్.. ఈ సంస్థకు ఎవరైనా విరాళాలు ఇవ్వవచ్చని తెలిపింది. ఈ సంస్థ కోసం తనొక అంబులెన్స్‌ని కూడా కొన్నట్లుగా తెలుపుతూ.. ఆ అంబులెన్స్ విషయంలో హెల్ప్ చేసిన వారందరికీ ఆమె ఇన్ స్టా వేదికగా థ్యాంక్స్ చెప్పారు. ఈ అంబులెన్స్ కొనే విషయంలోనే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వైఫ్ ఉపాసనకు ఆమె థ్యాంక్స్ చెప్పారు.


రామ్ చరణ్, ఉపాసన దంపతులకు పెట్స్ పట్ల ఎంత ప్రేమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెట్ రైమ్‌తో రామ్ చరణ్ ఎప్పుడూ కనిపిస్తుంటారు. మేడమ్ టుస్సాడ్స్‌లో కూడా రైమ్‌తో రామ్ చరణ్ మైనపు విగ్రహం తయారవుతుంది. ఈ విషయంలో ఆయన రికార్డ్ కూడా క్రియేట్ చేశారు. ఇప్పుడా రైమ్ పేరుతో ఉపాసన.. రేణూ దేశాయ్ ఏర్పాటు చేసిన ఎన్జీవో సంస్థకు అంబులెన్స్‌ని డొనేట్ చేసింది. అంబులెన్స్ కొనుగోలుకు విరాళం అందించిన రైమ్‌కి ధన్యవాదాలు అని రేణూ దేశాయ్ ఇన్‌స్టా స్టేటస్‌లో తెలిపింది. దీనికి ఉపాసన పేరును కూడా ట్యాగ్ చేసింది. దీంతో రేణూ దేశాయ్‌కి ఉపాసన సాయం అంటూ సోషల్ మీడియాలో వార్తలు మొదలయ్యాయి. ఈ ఎన్జీవో స్థాపించడానికి గల కారణాలను కూడా ఈ వీడియోలో రేణూ దేశాయ్‌ చెప్పుకొచ్చింది.


Also Read-NBK: అన్‌స్టాపబుల్ స్టేజ్‌పై బాలయ్య.. కానీ ఈ లుక్ ఏ సినిమాలోదో కనిపెట్టారా?

Also Read-Star Heroine: ఈ ఫొటోలోని పాప ఇప్పుడొక స్టార్ హీరోయిన్.. ఎవరో కనిపెట్టండి చూద్దాం!

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 27 , 2024 | 12:56 PM