Rakul Preet Singh: కొండా సురేఖ వ్యాఖ్యలపై రకుల్ ప్రీత్ సింగ్ కూడా స్పందించింది..

ABN, Publish Date - Oct 03 , 2024 | 06:12 PM

నాకు రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదు. రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులతో కానీ పార్టీలతో కానీ నాకు ఎటువంటి సంబంధం లేదు. నా పేరు ని తప్పుడు ఆరోపణలతో మీ రాజకీయాల కోసం వాడుకోవడం ఆపేయండి.. అంటూ మంత్రి కొండా సురేఖకు రకుల్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఆమె ఇంకా ఏం అందంటే..

Rakul Preet Singh and Konda Surekha

నాకు రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదు. రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులతో కానీ పార్టీలతో కానీ నాకు ఎటువంటి సంబంధం లేదు. నా పేరు ని తప్పుడు ఆరోపణలతో మీ రాజకీయాల కోసం వాడుకోవడం ఆపేయండి.. అంటూ మంత్రి కొండా సురేఖ (Konda Surekha)కు రకుల్ ప్రీత్ సింగ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మాజీ మంత్రి కేటీఆర్‌ని ఉద్దేశిస్తూ బుధవారం అక్కినేని ఫ్యామిలీతో పాటు సమంత, రకుల్‌ ప్రీత్ సింగ్‌ల పేర్లను మంత్రి కొండా సురేఖ ప్రస్తావించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కొండా సురేఖ వ్యాఖ్యలపై తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా ఫైర్ అవుతుంది. కింగ్ నాగార్జున అయితే పరువు నష్టం దావాకి కూడా వెళ్లారు. తాజాగా ఈ కాంట్రవర్సీపై రకుల్ ప్రీత్ సింగ్ కూడా ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించింది. రకుల్ తన ట్వీట్‌లో ఏం తెలిపిందంటే..

Also Read- Konidala Anjana Devi: పవన్ కళ్యాణ్ రాజకీయాలపై అంజనమ్మ సంచలన వ్యాఖ్యలు


‘‘ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే టాలెంట్‌కు, నైపుణ్యానికి ప్రతీకగా చూస్తున్నారు. నేను ఈ అందమైన పరిశ్రమలో గొప్ప ప్రయాణం చేశాను మరియు ఇప్పటికీ చాలా కనెక్ట్ అయ్యి వున్నాను. ఇలాంటి నిరాధారమైన మరియు దుర్మార్గపు వార్తలు మహిళలపై వ్యాప్తి చెందడం బాధాకరం. మరింత నిరుత్సాహపరిచే విషయం ఏమిటంటే, చాలా బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న మరో మహిళ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం. మనం గౌరవం కోసం మౌనంగా ఉండటాన్ని ఎంచుకుంటాము, కానీ అది మన బలహీనతగా తప్పుగా భావించబడుతుంది. నాకు రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదు. రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులతో కానీ పార్టీలతో కానీ నాకు ఎటువంటి సంబంధాలు లేవు. నా పేరును హానికరమైన రీతిలో మీ రాజకీయ లబ్ధికోసం వాడుకోవడం వదిలేయాలని కోరుతున్నాను. కళాకారులు మరియు సృజనాత్మక వ్యక్తులను రాజకీయ కోణం నుండి దూరంగా ఉంచాలి. రాజకీయ విమర్శల కోసం, న్యూస్ హెడ్‌లైన్‌ల కోసం అర్థం లేని అంశాలలోకి మమ్మల్ని లాగకండి..’’ అని రకుల్ తన ట్వీట్‌లో పేర్కొంది.


అసలేం జరిగిందంటే..

ఉమ్మడి మెదక్ జిల్లాలోని దుబ్బాకలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న కొండా సురేఖకు మెదక్ ఎంపీ రఘునందనరావు చేనేత కార్మికుల సమస్యలను విన్నవిస్తూ నూలుపోగు దండను మంత్రి మెడలో వేశారు. దీనిపై కొందరు ట్రోల్స్ చేయడంతో పాటు అసభ్యకరంగా పోస్టులు చేశారు. సోషల్ మీడియాలో ఈ పోస్టులు చేసిన వ్యక్తుల డీపీలో బీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు ఫోటో ఉండటంతో వాళ్లు బీఆర్‌ఎస్ కార్యకర్తలుగా కాంగ్రెస్ అనుమానిస్తోంది. బీఆర్‌ఎస్ నేతల ఆదేశాలతోనే ఈ పోస్టులు చేశారని, దీని వెనుక కేటీఆర్, హరీష్‌రావు ఉన్నారంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. తనపై వస్తున్న ఆరోపణలపై బుధవారం కొండా సురేఖ మీడియా ముందు కేటీఆర్‌పై ఫైర్ అవుతూ.. అక్కినేని ఫ్యామిలీ, సమంత, రకుల్ వంటి వార్ల పేర్లతో కొన్ని వివాదస్పద కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అయితే సమంత ట్వీట్ తర్వాత కొండా సురేఖ క్షమాపణలు తెలిపారు.

Also Read- Samantha: కొండా సురేఖ కాంట్రవర్సీ వ్యాఖ్యలపై సమంత స్ట్రాంగ్ కౌంటర్

Also Read- Tollywood: సినిమాల కరువులో.. టాలీవుడ్ భామలు

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 03 , 2024 | 06:24 PM