Best Friends: ప్రాణ స్నేహితులు ఒకే చోట.. వీడియో వైరల్

ABN , Publish Date - Jul 04 , 2024 | 10:24 PM

సూపర్ స్టార్ రజినీకాంత్, మంచు మోహన్ బాబుల మధ్య ఉన్న స్నేహం గురించి టాలీవుడ్, కోలీవుడ్‌లలో ఎవరిని అడిగినా ఇట్టే చెబుతారు. వారిద్దరి మధ్య ఉన్న స్నేహం గురించి ఇప్పటికే ఇద్దరూ పలుమార్లు వారే చెప్పుకొచ్చారు కూడా. రజినీకాంత్ హైదరాబాద్ వస్తే.. మోహన్ బాబు ఇంటికి వెళ్లకుండా ఉండరు. అలాగే మోహన్ బాబు కూడా. అలాంటి స్నేహం వారిద్దరి మధ్యా ఉంది. ఇప్పుడా ఇద్దరూ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించి.. అందరినీ ఆశ్చర్యపరిచారు.

Rajinikanth and Mohan Babu

సూపర్ స్టార్ రజినీకాంత్ (Superstar Rajinikanth), మంచు మోహన్ బాబు (Manchu Mohan Babu)ల మధ్య ఉన్న స్నేహం (Friendship) గురించి టాలీవుడ్, కోలీవుడ్‌లలో ఎవరిని అడిగినా ఇట్టే చెబుతారు. వారిద్దరూ ప్రాణ స్నేహితులని. వారిద్దరి మధ్య ఉన్న స్నేహం గురించి ఇప్పటికే ఇద్దరూ పలుమార్లు చెప్పుకొచ్చారు కూడా. రజినీకాంత్ హైదరాబాద్ వస్తే.. మోహన్ బాబు ఇంటికి వెళ్లకుండా ఉండరు. అలాగే మోహన్ బాబు కూడా చెన్నై వెళ్తే రజినీ ఇంటికి వెళ్లాల్సిందే. అలాంటి స్నేహం వారిద్దరి మధ్యా ఉంది.

Also Read-Shyamala Devi: అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రపై ప్రభాస్‌తో సినిమా చేయిస్తా..


ఇప్పుడా ఇద్దరూ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించి.. అందరినీ ఆశ్చర్యపరిచారు. సూపర్ స్టార్ రజినీకాంత్, మంచు మోహన్ బాబు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో (Airport) దర్శనమిచ్చారు. ఇద్దరు కలిసి వచ్చి, కారెక్కి వెళుతున్న వీడియో ఒకటి సోషల్ మాధ్యమాలలో బాగా వైరల్ అవుతోంది. ప్రస్తుతం రజినీకాంత్ ‘కూలీ’ అనే సినిమాలో చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ నిమిత్తం ఆయన హైదరాబాద్ వచ్చినట్లుగా తెలుస్తోంది. వరలక్ష్మీ శరత్ కుమార్ రిసెప్షన్ నిమిత్తం చెన్నై వెళ్లిన మోహన్ బాబు.. ఆ ఫంక్షన్ చూసుకుని రిటన్ వచ్చే క్రమంలో ఇద్దరూ ఇలా కలిసి ఉండవచ్చు. ప్రస్తుతం వారిద్దరూ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కబుర్లు చెప్పుకుంటూ వస్తూ కారెక్కి వెళుతున్న వీడియో చూసిన వారంతా.. బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ వారి స్నేహం గురించి మరోసారి మాట్లాడుకుంటున్నారు.


Rajini.jpg

రజినీకాంత్ ‘కూలీ’ (Coolie) సినిమా విషయానికి వస్తే.. లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో రజినీకాంత్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రమిది. ఇది రజినీకాంత్ 171వ చిత్రం. సన్‌ పిక్చర్స్‌ నిర్మిస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలుండగా.. టాలీవుడ్ హీరో కింగ్ నాగార్జున (King Nagarjuna) ఇందులో ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్లుగానూ, అలాగే శృతిహాసన్ కూడా ఇందులో భాగం కానుందనేలా వార్తలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.

Read Latest Cinema News

Updated Date - Jul 04 , 2024 | 10:24 PM