Rajinikanth gave advice : రజనీకాంత్ సలహాలు ఇచ్చారు
ABN , First Publish Date - 2023-09-26T01:36:08+05:30 IST
‘‘నా బాడీలో రజనీ సార్ స్టైల్, చిరంజీవి గారి డాన్స్ ఉంటాయి. ఇవి రెండూ తీసేయడం చాలా కష్టం’’ అన్నారు లారెన్స్. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘చంద్రముఖి 2’. కంగనా రనౌత్ కీలక పాత్రధారి. పి.వాసు దర్శకత్వం వహించారు...
‘‘నా బాడీలో రజనీ సార్ స్టైల్, చిరంజీవి గారి డాన్స్ ఉంటాయి. ఇవి రెండూ తీసేయడం చాలా కష్టం’’ అన్నారు లారెన్స్. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘చంద్రముఖి 2’. కంగనా రనౌత్ కీలక పాత్రధారి. పి.వాసు దర్శకత్వం వహించారు. ఈనెల 28న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో లారెన్స్ మాట్లాడుతూ ‘‘పి.వాసు గారు ఓ రోజు ‘చంద్రముఖి 2’ కథ చెప్పారు. ‘నేను చెయొచ్చా’ అని అడిగి మరి ఈ అవకాశం తీసుకొన్నాను. పాత్ర విషయంలో రజనీ సార్ ఎన్నో సలహాలు ఇచ్చార’’న్నారు. ‘‘నేను చాలామంది హీరోలతో పనిచేశా. కానీ లారెన్స్‌తో మాత్రమే మళ్లీ మళ్లీ పనిచేయాలనిపిస్తోంది. ఈ సినిమా నాకు చాలా స్పెషల్’’ అన్నారు కంగనా. ‘‘చంద్రముఖి 1లో విద్యాసాగర్ ఓ మార్క్ సెట్ చేశారు. ఈ సినిమాలో ఆ తరహా సంగీతం అందించడానికి నావంతు ప్రయత్నం చేశా’’ అని కీరవాణి తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘గ్రూప్ డాన్సర్ల నుంచి హీరోగా ఇంత పెద్ద స్థాయికి ఎదిగాడు లారెన్స్. తనతో పనిచేయడం నా అదృష్టం’’ అన్నారు.