మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Radha Madhavam: మార్చి 1న థియేట‌ర్ల‌లోకి.. ‘రాధా మాధవం’

ABN, Publish Date - Feb 26 , 2024 | 09:54 PM

వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ హీరో హీరోయిన్లుగా గోనాల్ వెంకటేష్ నిర్మించిన అందమైన ప్రేమ కథా చిత్రం ‘రాధా మాధవం’. ఈ మూవీకి దాసరి ఇస్సాకు దర్శకత్వం వహించారు. ఇప్పటికే రాధా మాధవం సాంగ్, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీసినిమాపై పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ఈ చిత్రం మార్చి 1న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ మీడియా ముందుకు వచ్చింది.

radha madhavam

వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ హీరో హీరోయిన్లుగా గోనాల్ వెంకటేష్ నిర్మించిన అందమైన ప్రేమ కథా చిత్రం ‘రాధా మాధవం’ (Radha Madhavam). ఈ మూవీకి దాసరి ఇస్సాకు (ESHAKU DASARI) దర్శకత్వం వహించారు. వసంత్ వెంకట్ బాలా ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలను అందించారు. ఇప్పటికే రాధా మాధవం సాంగ్, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీసినిమాపై పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ఈ చిత్రం మార్చి 1న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ మీడియా ముందుకు వచ్చింది. ఈ కార్యక్రమంలో నిర్మాత గోనాల్ వెంకటేష్ మాట్లాడుతూ.. ‘మా సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మార్చి 1న మా చిత్రం రాబోతోంది. ఓ అందమైన ప్రేమ కథా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మా సినిమాను ఆడియెన్స్ ఆదరించి పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. దర్శకుడు దాసరి ఇస్సాకు మాట్లాడుతూ.. ‘కథ విన్న వెంటనే నాకు చాలా నచ్చింది. మా రైటర్ అద్భుతంగా కథను రాశారు. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ కథను రాశారు. కథ విన్న తరువాత నాకు వినాయక్ గుర్తొచ్చాడు. ఆయన హైట్‌కు తగ్గ హీరోయిన్‌ను వెతికాం. చివరకు అపర్ణా దేవి కనిపించారు. ఆమె చక్కగా నటించారు.

హీరో వినాయక్ దేశాయ్ (Vinayak Desai) మాట్లాడుతూ.. ‘మా నిర్మాత వెంకటేష్ గారు సహకరించడం వల్లే ఈ సినిమా ఈ స్థాయి వరకు వచ్చింది. కొత్త హీరో అని చూడకుండా నాపై నమ్మకంతో ఈ చిత్రాన్ని నిర్మించారు. నేను డ్యాన్స్ టీచర్. రాధా మాధవం (Radha Madhavam) అందమైన ఓ ప్రేమ కథా చిత్రం. ఈ చిత్రంలో యాక్షన్ సీక్వెన్స్ ఎంతో సహజంగా ఉంటాయి. హీరోయిన్ మలయాళీ అమ్మాయి. పైగా క్లాసికల్ డ్యాన్సర్. అలాంటి అమ్మాయితో నటించడం ఆనందంగా ఉంది. పార్థు మా చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. మార్చి 1న మా చిత్రం రాబోతోంది. ప్రేక్షకులంతా మా సినిమాను చూసి సక్సెస్ చేయాలి’ అని అన్నారు. హీరోయిన్ అపర్ణా దేవి మాట్లాడుతూ.. ‘ నాకు తెలుగు అంతగా రాదు. ఈ సినిమాలో లెంగ్తీ డైలాగ్స్ ఉన్నాయి. హీరో వినాయక్ ఎంతో సపోర్ట్ చేశారు. నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. మార్చి 1న ఈ చిత్రం రాబోతోంది. అందరూ మా సినిమాను ఆశీర్వదించండి’ అని అన్నారు.


ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సతీష్ మాట్లాడుతూ.. ‘మొదటి సినిమానే అయినా నిర్మాత ఎంతో చక్కగా నిర్మించారు. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌కు చాలా సపోర్ట్ ఇచ్చారు. హీరో హీరోయిన్లు, మేక రామకృష్ణ అందరూ చక్కగా నటించారు. సినిమా కోసం అందరం చాలా కష్టపడ్డాం. మార్చి 1న మా చిత్రం రాబోతోంది. అందరూ ఆదరించండి’ అని అన్నారు. మాటల రచయిత వసంత్ వెంకట్ బాల మాట్లాడుతూ.. ‘సినిమా చాలా బాగా వచ్చింది. ఓ అందమైన గ్రామీణ ప్రేమకథతో పాటు.. చక్కని సందేశాత్మక చిత్రాన్ని చూడబోతున్నారు. ఈ చిత్రంలోని మాటలకు ప్రత్యేక అభినందనలు వస్తున్నాయి. సినిమాను చూసిన వారంతా కూడా డైలాగ్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు. మార్చి 1న రాబోతోన్న ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలి’ అని అన్నారు. మేక రామకృష్ణ మాట్లాడుతూ.. ‘నాకు ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. ఇంత మంచి సినిమాలో నటించినందుకు ఆనందంగా ఉంది. ఇంత వరకు నేను చాలా సాఫ్ట్ కారెక్టర్స్ చేశాను. కానీ ఇందులో మాత్రం నెగెటివ్ కారెక్టర్ పోషించాను. సినిమా చాలా బాగా వచ్చింది. మార్చి 1న మా చిత్రం రాబోతోంది. ప్రేక్షకులు మా సినిమాను ఆదరించాలి’ అని అన్నారు.

Updated Date - Feb 26 , 2024 | 09:54 PM