Raashii Khanna: ఆభరణాలు అందాన్ని మరింత పెంచుతాయి
ABN, Publish Date - May 18 , 2024 | 08:57 PM
గ్లామర్ గాళ్ రాశీ ఖన్నా శనివారం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లోని లుంబిని జ్యువెల్ మాల్‌లో మంగత్రయి నీరజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వీనస్ - ద గాడెస్ ఆఫ్ ఎమరాల్డ్’ ప్రత్యేక కలెక్షన్‌ను ఆవిష్కరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన పలు ఆభరణాలను ధరించి ఆమె సందడి చేశారు.
గ్లామర్ గాళ్ రాశీ ఖన్నా (Raashii Khanna) శనివారం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లోని లుంబిని జ్యువెల్ మాల్‌లో మంగత్రయి నీరజ్ (Mangatrai Neeraj) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వీనస్ - ద గాడెస్ ఆఫ్ ఎమరాల్డ్’ (Venus: The Goddess of Emerald) ప్రత్యేక కలెక్షన్‌ను ఆవిష్కరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన పలు ఆభరణాలను ధరించి ఆమె సందడి చేశారు.
*Chitrangada Singh: ఆమె వయసు 48, కానీ ఆమెని చూస్తే అబ్బా...
ఈ సందర్భంగా ఆమె (Raashii Khanna) మీడియాతో మాట్లాడుతూ.. మన సంప్రదాయాలకు ఆధునికతను మేళవిస్తూ ఇక్కడ రూపొందించిన ఆభరణాలు తనకెంతగానో నచ్చాయన్నారు. ప్రతి మగువ ఆభరణాలను ధరించడానికి ఇష్టపడుతుందని, అలాగే తనకు కూడా ఆభరణాలు ధరించడం ఇష్టమేనని అన్నారు. అయితే సందర్భానుసారంగా తన అలంకరణ ఉంటుందన్నారు. డిజైనర్ నయన్ గుప్తా రూపొందించిన ఈ ఆభరణాలు ప్రత్యేక రీతిని కలిగి ఉన్నాయని అన్నారు. మగువల, యువత మనసును ఇవి ఖచ్చితంగా దోచుకుంటాయని చెప్పుకొచ్చారు.
నయన్ గుప్తా (Nayan Gupta) మాట్లాడుతూ.. మగువల ఆలోచనలను ప్రతిబింబించేలా ఈ ఆభరణాలను రూపొందించినట్లు తెలిపారు. ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా పలువురు మోడల్స్ నగలను ధరించి హొయలు పోయారు.
Read Latest Cinema News