Puri Musings: ఆ ప్రేమంతా శృంగారం కోసమే.. దక్కలేదన్న ఉక్రోశమది!
ABN, Publish Date - May 02 , 2024 | 02:46 PM
కొంతగ్యాప్ తర్వాత పూరి జగన్నాథ్ (Puri Jagannadh) వరుసగా ‘పూరి (Puri Musings) మ్యూజింగ్స్’ పేరుతో ఆసక్తికర విషయాలు షేర్ చేస్తున్నారు. తాజా వీడియోలో ప్రేమ గురించి వివరించారాయన. ప్రేమ కంటే కుటుంబానికి ఎక్కువ విలువ ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. ‘జీవితంలో ఎంతోమంది ప్రేమలో ఫెయిల్ అవుతారు. తిండి తినాలని అనిపించదు.
కొంతగ్యాప్ తర్వాత పూరి జగన్నాథ్ (Puri Jagannadh) వరుసగా ‘పూరి (Puri Musings) మ్యూజింగ్స్’ పేరుతో ఆసక్తికర విషయాలు షేర్ చేస్తున్నారు. తాజా వీడియోలో ప్రేమ గురించి వివరించారాయన. ప్రేమ కంటే కుటుంబానికి ఎక్కువ విలువ ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. ‘జీవితంలో ఎంతోమంది ప్రేమలో ఫెయిల్ అవుతారు. తిండి తినాలని అనిపించదు. నిద్ర రాదు. గుండెల్లో తెలియని మంటగా ఉంటుంది. దాంతో మద్యానికి బానిసలుగా మారతారు. స్నేహితులు ఎంత ఓదార్చినా ఆ బాధ తీరదు. కన్నీళ్లు ధారలుగా (Puri Jagannadh About love) కారుతుంటాయి. అది చెప్పలేని నరకం. మన ప్రేమను అమ్మాయి అర్థం చేసుకోలేదని కుంగిపోతాం. నిజానికి అదంతా ప్రేమ కాదు.. ఈగో. నీకు ఎంత ఈగో ఉంటే అంత నరకం చూస్తావు. నీకు దక్కలేదన్న ఉక్రోశమది. ఆ అమ్మాయి వల్ల నువ్వు ఇలా పిచ్చోడిలా అయ్యావనీ అందరూ తనకు చెప్పాలి. అదే నీ ఉద్దేశం’. ‘నిన్ను మీ అమ్మ అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. ఎప్పుడైనా అమ్మ కోసం ఏడ్చావా? అమ్మ కోసం కత్తిపెట్టి చేయి కోసుకున్నావా? లేదు కదా! మన ప్రేమలన్నీ శృంగారం కోసమే. అందమైన అమ్మాయిలనే ఎందుకు ప్రేమిస్తున్నారు. కాళ్లు, చేతులు లేని వాళ్లను కూడా ప్రేమించొచ్చు కదా? నిజంగా అమ్మాయిని ప్రేమిస్తే.. తన నిర్ణయాలు గౌరవించు. ప్రేమలో ఉన్నప్పుడు నీకోసం పుట్టిన దేవతలా కనిపిస్తుంది. ఆ అమ్మాయి అంగీకరించకపోతే చనిపోవాలని పిస్తుంది. ఒకవేళ తను నిన్ను పెళ్లి చేసుకుంటే రెండేళ్లు కూడా కలిసి ఉండలేవు. మోజు తీరుతుంది. కొత్త కోరికలు మొదలవుతాయి. పెళ్లి తర్వాత ఆ అమ్మాయిని చూసే పద్థతి మారుతుంది. సైన్స్ ప్రకారం ఆడ, మగ మధ్య ఎట్రాక్షన్ 18 నెలలు మాత్రమే ఉంటుంది. ‘ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్లందరూ వేరే ఏ అమ్మాయిని చూడరని ప్రామిస్ చేయగలరా? చేయలేరు.
"ప్రేమించడం, ఇంట్లో వద్దంటే గొడవ పడడం.. ఇవన్నీ సాధారణం. మనం ఎక్కువ ఈ డ్రామాలనే ఎంజాయ్ చేస్తాం. ప్రేమలో విఫలమైన అమ్మాయిలను ఎక్కడైనా చూశారా?. వాళ్లు ఎప్పుడూ ఏడుస్తూ ఉండరు. చాలా ప్రాక్టికల్‌గా ఉంటారు. సందర్బాన్ని బట్టి వెళ్తుంటారు. వాళ్లను చూసి మిగతా వాళ్లు నేర్చుకోవాలి. ప్రేమలో ఫెయిల్ అవడం ఎప్పుడూ మంచిదే. దానివల్ల మనిషి స్ర్టాంగ్ అవుతాడు. కానీ, ప్రేమించమని బతిమిలాడుతూ.. ఏడవొద్దు. ప్రేమను కోల్పోయి ఈరోజు ఇంత ఏడుస్తున్నావు కదా.. ఒక సంవత్సరం తర్వాత ఇది చాలా చిన్న విషయంగా కనిపిస్తుంది. ‘నిజంగా అమ్మాయి మోసం చేస్తే.. ఆ బాధను కెరీర్‌లో ముందుకెళ్లడం కోసం ఉపయోగించుకోండి? ఒంటరితనం ప్రేమ కంటే గొప్పది. ఒంటరిగా తినండి, ప్రయాణాలు చేయండి? కొన్నేళ్ల తర్వాత మిమ్మల్ని చూసి మీరే నవ్వుకుంటారు. మీ లవ్ ఫెయిల్యూర్ మీద మీరే జోకులు వేసుకుంటారు. లవ్ మ్యారేజ్ చేసుకున్న ఎంతోమంది సెలబ్రిటీలే విడాకులు తీసుకున్నారు. వాళ్లతో పోలిస్తే మన ప్రేమలు ఎంత? లవ్‌లో ఫెయిలైతే పిచ్చి ఆలోచనలు మానండి? మిమ్మల్ని నమ్ముకొని మీ కుటుంబం ఉందని గుర్తుంచుకోండి’’ అని పూరి జగన్నాథ్ అన్నారు.