నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు)కు మాతృ వియోగం
ABN, Publish Date - May 30 , 2024 | 04:27 PM
సినీ నిర్మాత, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) మాతృమూర్తి శ్రీమతి సూర్యదేవర నాగేంద్రమ్మ(90) గురువారం (30-5-24) 3 గంటల సమయంలో హృదయ సంబంధిత వ్యాధితో స్వర్గస్థులయ్యారు. ఆవిడకు ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు. నిర్మాత రాధాకృష్ణ ఆవిడకు రెండవ తనయుడు.
సినీ నిర్మాత, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత సూర్యదేవర రాధాకృష్ణ (Suryadevara Radhakrishna) (చినబాబు) మాతృమూర్తి శ్రీమతి సూర్యదేవర నాగేంద్రమ్మ(90) (Suryadevara Nagendramma) గురువారం (30-5-24) 3 గంటల సమయంలో హృదయ సంబంధిత వ్యాధితో స్వర్గస్థులయ్యారు. ఆవిడకు ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు. నిర్మాత రాధాకృష్ణ ఆవిడకు రెండవ తనయుడు. నిర్మాత సూర్యదేవర నాగ వంశీ (Suryadevara Naga Vamsi)కి నాగేంద్రమ్మ నాయనమ్మ అవుతారు. రేపు ఉదయం 10 గంటల ప్రాంతంలో ఫిల్మ్ నగర్‌లోని విద్యుత్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
చినబాబుగారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి- పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)
‘‘ప్రముఖ సినీ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) గారి మాతృమూర్తి శ్రీమతి సూర్యదేవర నాగేంద్రమ్మగారు కన్నుమూశారని తెలిసి చింతిస్తున్నాను. శ్రీమతి నాగేంద్రమ్మగారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. చినబాబుగారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను..’’ అని పవన్ కళ్యాణ్ ఓ లేఖను విడుదల చేశారు.