ఓ వైపు ‘దేవీం స్మరామి’, ‘దుర్గే ప్రసీద’.. మరో వైపు ‘హరే .. హరే’!: మూలా నక్షత్రం వేడుకలో సినీ ప్రముఖులు

ABN, Publish Date - Oct 10 , 2024 | 12:05 AM

నిర్మాత సాయి కొర్రపాటి సమర్పణలో పురాణపండ శ్రీనివాస్ రచనా సంకలనంగా మరొక అపురూప భక్తిమయ రాగరంజిత గాన స్తోత్రాలతో తేజరిల్లిన గ్రంధరాజం ‘దుర్గే ప్రసీద’ గ్రంధం ఒక శుభ దృష్టిగా గోచరించినట్లు అనేక ఆలయాల భక్తశ్రేణులు తన్మయత్వంతో గ్రంధాన్ని స్వీకరించగా..మరొక వైపు కిమ్స్ హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్య సమర్పణలో బెజవాడ కనకదుర్గమ్మకు సమర్పించిన మంగళమయ శాంత తేజస్సులాంటి పురాణపండ శ్రీనివాస్ రచనా సంకలనం ‘దేవీం స్మరామి’ అపూర్వ అమోఘ గ్రంధం విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారి శోభలమధ్య, భక్త బృందాల మధ్య విశేషమైన ఆకర్షణగా నిలుస్తోంది.

ఎన్నో తెలుగు చలన చిత్రాలకు సుముహూర్తపు సన్నివేశాలకు క్లాప్ కొట్టి, ‘మహానటి సావిత్రి’ అసాధారణ గ్రంధాన్ని ప్రచురించి మెగాస్టార్ చిరంజీవితో ఆవిష్కరింపచేసిన కిమ్స్ హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్య సమర్పణలో బెజవాడ కనకదుర్గమ్మకు సమర్పించిన మంగళమయ శాంత తేజస్సులాంటి ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ రచనా సంకలనం ‘దేవీం స్మరామి’ అపూర్వ అమోఘ గ్రంధం విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారి శోభలమధ్య, భక్త బృందాల మధ్య విశేషమైన ఆకర్షణగా నిలవడమే కాకుండా.. ఎంతో మంది ఈ పుస్తకప్రసాదాన్ని దుర్గమ్మ కటాక్షంగా అనుభూతి చెందుతుండగా.. తెలంగాణలో మరొకవైపు జంట నగరాలలో ప్రఖ్యాత చలన చిత్ర నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి ప్రచురించిన మంగళ తేజస్సులాంటి పురాణపండ శ్రీనివాస్ ‘దుర్గే ప్రసీద’ గ్రంధం ఎన్నో ఆలయాల్లో వందల భక్తుల్ని మనసుల్ని కట్టేసిందనేది సత్యం.

పరమ పవిత్రమైన మూలా నక్షత్ర సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాలలో జరిగిన మహాసరస్వతీ అలంకార మహా సంరంభ మహోత్సవాల్లో ప్రముఖ రచయిత , శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ రచించి సంకలనం చేసిన ‘దేవీం స్మరామి’, ‘దుర్గే ప్రసీద’ పేరిట రెండు మహామంగళ గ్రంధాలు వరుసగా ఇటు విజయవాడ ఇంద్ర కీలాద్రిపై, విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరం, భీమవరం, ఏలూరులలోని అనేక అమ్మవార్ల ఆలయాల్లో వేలకొలది భక్తులను, అటు తెలంగాణలో జంటనగరాలైన హైదరాబాద్ సికింద్రాబాద్‌లలో అనేక దేవాలయాల్లో విశేషంగా ఆకర్షించేలా ఆకట్టుకున్నాయి.


అత్యంత కాంతిమయంగా పవిత్ర విలువలతో శాక్తేయ గ్రంధంగా శోభిల్లిన ‘దేవీం స్మరామి’ గ్రంధాన్ని స్వయంగా శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం డిప్యూటీ కలెక్టర్ కె.ఎస్. రామారావు అతిధులకు దుర్గమ్మ జ్ఞాపికతో పాటు పంచడం విశేషం. ఉత్సవ కమిటీ సభ్యుల మధ్య ఈ.ఓ రామారావు ‘శ్రీనిధి’ దివ్య భవ్య గ్రంధాన్ని ఆవిష్కరిస్తూ ఈ ఉత్సవ సమారోహంలో ఈ సరస్వతీ పవిత్ర వేడుక రోజున ఎన్నో వందలమందికి ‘శ్రీనిధి’ మంత్రమయ తేజోమయ గ్రంధాన్ని సిబ్బంది పంచుతుంటే వాళ్లంతా అమ్మ అనుగ్రహంగా భావించి ఎంతో సంతోషాన్ని వెలిబుచ్చుతున్నారని చెప్పారు.

వారాహిచలన చిత్రం అధినేత సాయికొర్రపాటి సమర్పణలో పురాణపండ శ్రీనివాస్ రచనా సంకలనంగా మరొక అపురూప భక్తిమయ రాగరంజిత గాన స్తోత్రాలతో తేజరిల్లిన గ్రంధరాజం ‘దుర్గే ప్రసీద’ గ్రంధం ఒక శుభ దృష్టిగా గోచరించినట్లు అనేక ఆలయాల భక్తశ్రేణులు తన్మయత్వంతో గ్రంధాన్ని స్వీకరించారు. ఈ రెండు గ్రంధాలకూ రచనా సంకలన కర్తగా వ్యవహరించిన ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ మాట్లాడుతూ మనసుకు, మాటకి అందని ఈ దివ్య వైభవాలు అందడానికి కారణభూతులైన బొల్లినేని కృష్ణయ్య సంస్కార హృదయానికి, వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి సౌజన్య ప్రోత్సాహానికి, శ్రీ దుర్గామల్లేశ్వర దేవస్థానం డిప్యూటీ కలెక్టర్ కె.ఎస్.రామారావు సంస్కార సంపన్నతకు మనసా కృతజ్ఞతలు తెలిపారు.

బొల్లినేని కృష్ణయ్య ప్రోత్సాహంతో అందిన వేల వేల గ్రంధాలకు భక్తజనసందోహం పొందుతున్న భక్తి పారవశ్యాన్ని ఎందరో ఎంపీలు, ఎమ్మెల్యేలు, తెలుగు దేశం శ్రేణులు హర్షాన్ని ప్రకటించాయి. దేవస్థానంలో ఈ ఉచిత వితరణలో పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని పాల్గొనడమే కాకుండా తన స్వహస్తాలతో పురాణపండ గ్రంధాలను ఉచితంగా పంచడం పలువురిని ఆకర్షించింది. పీఠాలు, మఠాలు చేయలేని అపురూప కార్యాన్ని ఎంతో స్వచ్ఛ హృదయంతో చేస్తున్న పురాణపండను మేధో సమాజం జేజేలు పలకడం విశేషం.

ఇంద్రకీలాద్రిపై పుస్తకప్రసాదం చారిత్రాత్మకమని సాక్షాత్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ధర్మపత్ని శ్రీమతి నారా భువనేశ్వరి బాహాటంగా అర్చకపండితులతో పేర్కొనడం విశేషంగా చెప్పక తప్పదు. తిరుమల ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు ధర్మపత్ని, కుమార్తె మాన్య చంద్రన్ తమకు పురాణపండ శ్రీనివాస్ కృషి తెలుసునని ఈ బుక్ దివ్యంగా ఉందని తమ ఆనందాన్ని అమ్మవారి ఆలయ ప్రాంగణంలో వెలిబుచ్చారు.


మరోవైపు మాజీ సినిమాటోగ్రఫీశాఖామంత్రి, ప్రస్తుత దేవాదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణరెడ్డి తిరుమల బ్రహ్మోత్సవాల సిరుల మంత్రమయ ప్రత్యేక సంచిక ‘హరే హరే’ మంగళమయ సౌందర్యాల అక్షరబాండాగారంలాంటి గ్రంధాన్ని ఆవిష్కరించి ప్రముఖ రచయిత పురాణపండను అభినందించారు. ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ బార్ అసోసియేషన్ పూర్వ అధ్యక్షులు, ప్రఖ్యాత న్యాయవాది చల్లా ధనంజయ మాట్లాడుతూ సర్వ దిశలలో, సర్వ దశలలో ఈ సృష్టిని రక్షించే తిరుమల శ్రీనివాసునిపై ఎంతో పరమ పవిత్ర లావణ్యంగా ఇంతటి అందాల గ్రంధాన్ని అందించిన చిరంజీవి పురాణపండ శ్రీనివాస్‌ని అభినందిస్తూ.. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి ఇలాంటి అద్భుతాలను అందిస్తున్న జ్ఞానమహాయజ్ఞ కేంద్ర నిర్వాహకులను అభినందించారు. ఈ శ్రీకార్యంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ సీహెచ్ శివశంకర్, ప్రముఖ యువ న్యాయవాది చల్లా వెంకటరమణ సుబ్బారావు పాల్గొని హరే హరే గ్రంథ శోభను రసజ్ఞులకు చూపించడం విశేషం.

Updated Date - Oct 10 , 2024 | 11:32 AM