Pranitha Subhash: హైదరాబాద్‌లో ప్రణీత సందడి

ABN, Publish Date - Nov 03 , 2024 | 08:15 PM

బాపు బొమ్మ ప్రణీత సుభాష్‌ (Pranitha Subhash) హైదరాబాద్‌లో సందడి చేశారు. స్వయం డిజైనర్‌ స్టూడియో పేరుతో హైదరాబాదులో సరికొత్త డిజైనర్‌ స్టూడియో అందుబాటులోకి వచ్చింది


బాపు బొమ్మ ప్రణీత సుభాష్‌ (Pranitha Subhash) హైదరాబాద్‌లో సందడి చేశారు. స్వయం డిజైనర్‌ స్టూడియో పేరుతో హైదరాబాదులో సరికొత్త డిజైనర్‌ స్టూడియో అందుబాటులోకి వచ్చింది. యమునా బధిత (Yamuna Badhita) ఏర్పాటు చేసిన ఈ ఫ్లాగ్‌ షిప్‌ స్టోర్‌ను (Flagship Store).

ప్రముఖ సినీనటి ప్రణీత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ "ఒకప్పుడు డిజైనర్‌ దుస్తులు డిజైనర్లు హైదరాబాదులో అందుబాటులో ఉండేవారు కాదు. కానీ ఇప్పుడు ప్రపంచ వేదికపై హైదరాబాద్‌ డిజైనర్‌ లో తమ ఖ్యాతిని చాటుతున్నారు. అంతే కాకుండా సాంప్రదాయ దుస్తులకు ఆధునికతను మేళవిస్తూ అద్భుతంగా సృష్టిస్తున్నారు. శుభకార్యాలు, అందాల వేడుకలు ఏవైనా ఇప్పుడు డిజైనర్‌ దుస్తులు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. నేను కూడా డిజైనర్‌ దుస్తులను అవసరానికి అనుగుణంగా ధరిస్తాను’’ అని చెప్పారు. (Swayam Designer Studio)



నిర్వాహకురాలు  యమునా బదిత మాట్లాడుతూ ుూ లండన్‌లో మాస్టర్స్‌ చేసి డిజైనర్‌ రంగంపై ఉన్న అభిలాషతో ఈ స్టోర్‌ ఏర్పాటు చేశా. మా డిజైన్లు సౌకర్యవంతంగా అందాన్ని ఇనుమడింపజేసేలా ఉంటాయి’’ అని అన్నారు.
 

Updated Date - Nov 03 , 2024 | 08:15 PM