Prakash Raj: కొండా సురేఖ వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ ఫైర్

ABN, Publish Date - Oct 02 , 2024 | 05:07 PM

తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలపై నటుడు ప్రకాష్ రాజ్ రెస్పాండ్ అయ్యారు. గత కొన్ని రోజులుగా ఏపీ డిప్యూటీ సీఎంని టార్గెట్ చేస్తున్న ప్రకాశ్ రాజ్.. ఇప్పుడు కొండా సురేఖ కామెంట్స్‌పై స్పందించి.. మరో కొత్త వివాదంలో వేలెట్టారు. అదేంటంటే..

Konda Surekha and Prakash Raj

తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ (Konda Surekha) తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలపై నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) రెస్పాండ్ అయ్యారు. తెలంగాణ మాజీ ఐటీ శాఖ మంత్రి, బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)ని టార్గెట్ చేస్తూ హీరోయిన్స్ సమంత (Samantha), రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) పేర్లని ప్రస్తావించడంపై ఆయన భగ్గుమన్నారు. తిరుపతి లడ్డూ వివాదంలో వరుస ట్వీట్లతో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)పై విరుచుకుపడిన ఆయన మరోసారి కొత్త వివాదంలో వేలుపెట్టినట్లుగా తాజాగా ఆయన ట్వీట్‌తో తెలుస్తోంది.

Also Read- Konda Surekha: చైతూ-సమంత విడాకులు, రకుల్ హడావుడి పెళ్లి.. కారణం కేటీఆరే..

ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటూ సమకాలీన రాజకీయాలపై హాట్ కామెంట్రీ చేస్తుంటారు. తాజాగా కేటీఆర్‌పై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల విధానం ఆయనకే చిర్రెత్తేలా చేసింది. మంత్రి సరైన సాక్ష్యాధారాలు లేకుండా హీరోయిన్ల పేర్లు ప్రస్తావించడంపై ఆయన ‘X’ ఖాతా ద్వారా అసహనం వ్యక్తం చేశారు. ‘ఏంటీ సిగ్గులేని రాజకీయాలు… సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూప?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి ఇద్దరు ఆడబిడ్డల వ్యవహారాల్ని సరైన ఆధారాలు లేకుండా నీచ రాజకీయాల కోసం మంత్రి హోదాలో ఒక స్త్రీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని కొందరు ప్రకాష్ రాజ్‌కి మద్దతు తెలుపుతున్నారు. మరికొందరు హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న ‘హైడ్రా’ (Hydra)ని పక్క దారి పట్టించేందుకు కాంగ్రెస్ ఈ వ్యూహాన్ని పన్నినట్లు కామెంట్ చేస్తున్నారు.


అంతకుముందు గాంధీ జయంతి (Gandhi Jayanti) సందర్భంగా బాపు ఘాట్‌లో నివాళులు అర్పించి కొండా సురేఖ మీడియాతో కేటీఆర్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘N కన్వెన్షన్ హాల్ కూల్చకుండా ఉండాలంటే అక్కినేని ఫ్యామిలీకి కేటీఆర్ కొన్ని డిమాండ్స్ విధించారని, అందువల్లే చై-సామ్ విడాకులు అయ్యాయంటూ సంచలన కామెంట్స్ చేశారు. మరో యంగ్ హీరోయిన్ ఇటీవల హుటాహుటిన పెళ్లి చేసుకోవడానికి కారణం కేటీఆర్ అని, హీరోయిన్లకి మత్తుమందు అలవాటు చేసింది కేటీఆర్ అని, విచారణలో కేటీఆర్ గురించి షాకింగ్ విషయాలు తెలిశాయంటూ కొండా సురేఖ చేసిన షాకింగ్ కామెంట్స్‌పై ప్రస్తుతం హాట్‌హాట్‌గా చర్చలు నడుస్తున్నాయి. ఇప్పుడు కొండా సురేఖ చేసిన షాకింగ్ కామెంట్స్, ఆమె కామెంట్స్‌పై ప్రకాశ్ రాజ్ చేసిన ట్వీట్ వైరల్ అవుతూ ఇండస్ట్రీలో కలకలం సృష్టిస్తున్నాయి.

Also Read- Tollywood: సినిమాల కరువులో.. టాలీవుడ్ భామలు

Also Read- Pawan Kalyan: తిరుమలలో పవన్ క‌ల్యాణ్‌ చిన్న‌ కుమార్తె.. డిక్లరేషన్ ఇచ్చి దైవ ద‌ర్శనానికి

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 02 , 2024 | 06:28 PM